గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.!

జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహాన్ని జ్ఞానం, సంపద, విద్య, సంతానం, మతం, అదృష్టానికి కారకుడిగా పరిగణిస్తారు. ఈ గ్రహం రాశి లేదా నక్షత్ర మార్పులు జరిగినప్పుడల్లా రాశి చక్రాలపై ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం గురుడు కర్కాటక రాశిలో ఉండగా.. అక్టోబర్‌ 8న అశ్లేష నక్షత్రం నాల్గవ దశలోకి ప్రవేశిస్తుంది. అక్టోబర్‌ 31 వరకు అక్కడే ఉండనుంది. ఈ మార్పు కొన్ని రాశుల వారికి శుభప్రదం కానుంది. వృత్తి, సంపదకి కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆ రాశులేంటో చూద్దాం..

Good days in October for these four zodiac signs due to Jupiter s change of nakshatra

మిథున రాశి

మిథున రాశి వారిలో జన్మించిన వారి జాతకంలో గురుగ్రహం రెండో స్థానంలో ఉంటుండగా.. ఇది సంపద, పొదుపు, కుటుంబం, వాక్చాతుర్యంతో ముడిపడి ఉంటుంది. ఈ మార్పుతో వీరికి ఉద్యోగస్తులకు మంచి రోజులు రానున్నాయి. జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు తీసుకోవచ్చు. అదనపు ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. వ్యాపారస్తులు లాభాలను చూస్తారు. కుటుంబానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?

కర్కాటక రాశి

కర్కాటక రాశిలో గురు గ్రహం అశ్లేష నక్షత్రం నాల్గవ దశలోకి ప్రవేశం చేయనుంది. ఈ ప్రభావంతో ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం బలపడుతుంది. పనిలో బాధ్యతలు పెరుగుతాయి. దీంతో ఆఫీసులో మీ గౌరవం పెరుగుతుంది. పెండింగ్‌ పనులు పూర్తవుతాయి. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. పిల్లల నుంచి ఆనందం, సంతోషకరమైన వార్తలు అందుకుంటారు.

Good days in October for these four zodiac signs due to Jupiter s change of nakshatra

కన్యారాశి

కన్యారాశి వారి జాతకంలో గురు గ్రహం పదకొండో స్థానంలో ఉంటుంది. ఇది ఆదాయం, లాభాలను సూచిస్తుంది. గురు గ్రహం నక్షత్ర స్థానం మార్పు ప్రభావవంతమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరుచుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఉద్యోగంలో ప్రమోషన్లు పొందవచ్చు. కొత్త బాధ్యతలకి సంబంధించి చర్చలు ముందుకు సాగే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు నూతన పరిచయాలతో వారి బిజినెస్ పెరుగుతుంది. పెండింగ్‌ పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉంది.

Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే!Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే!

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి గురు గ్రహం తొమ్మిదో స్థానంలో ఉంటున్న కారణంగా ఈ రాశి చక్రం వారికి చదువులు, వృత్తి పరంగా కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారికి ఇతరుల నుంచి మంచి గైడెన్స్‌ లభిస్తుంది. ఉన్నత విద్య, విదేశాల్లో ఉద్యోగం, పెద్ద ప్రాజెక్టులకి సంబంధించి మీకు మంచి అవకాశాలు రావచ్చు. ప్రభావవంతమైన వ్యక్తుల నుంచి మీరు తీసుకునే సలహాలు మీ భవిష్యత్తుకి ప్రయోజనకరంగా ఉంటాయి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Monday, September 28, 2026, 6:42 [IST]
Desktop Bottom Promotion