Latest Updates
-
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు!
ఒకే స్థానంలో గురు, రాహు గ్రహాలు.. గురు చండాల యోగంతో జీవితంలో ఈ కష్టాలు తప్పవు.!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కలయిక మీ జాతకంపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని శుభ సంకేతాలను సూచిస్తే.. మరికొన్ని జీవితంలో ఎదుర్కోబోయే సవాళ్ల గురించి హెచ్చరిస్తుంది. అలాంటి కలయికల్లో ఒకటి గురు, రాహు గ్రహాల కలయిక. దీనినే గురు చండాల యోగం అంటారు. ఈ రెండూ ఒకే స్థానంలో ఉంటే అశుభానికి సంకేతంగా భావిస్తారు. గురు చండాల యోగం ద్వారా మీ జీవితంలో ఏమేం మార్పులు చోటుచేసుకుంటాయో జ్యోతిష్య పండితుల వివరణ చూద్దాం..

మీ జాతకం, రాశి ప్రకారం గురు, రాహు గ్రహాలు ఒకే స్థానంలో ఉంటే గురు చండాల యోగం ఏర్పడుతుందని జ్యోతిష్యం చెబుతోంది. దీని ద్వారా వ్యక్తి స్వభావం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంతో మీ జీవితంలో కీలక అంశాలను ప్రభావితం చేస్తుంది. ఈ దోష నివారణకు పరిహారాలు చేసుకుంటే మేలు జరగవచ్చు.
గురు చండాల యోగం లగ్నంలో, పంచమ లేదా నవమ భావంలో ఏర్పడితే మీ జాతకంపై ప్రభావాలు మరింత స్పష్టంగా ఉంటాయని పండితులు చెబుతున్నారు. అయితే ఈ యోగం ప్రభావం ప్రతి వ్యక్తికి ఒకేలా ఉండదని.. మొత్తం జాతకం, ఇతర గ్రహాల స్థానంపై ఆధారపడి ఉంటుందని వెల్లడిస్తున్నారు.
గురు చండాల యోగంతో దుష్ప్రభావాలు
నిర్ణయాలపై సామర్థ్యం
మీ జాతకంపై గురు చండాల యోగం ప్రభావం ఉన్నట్లయితే మీరు కొన్ని సందర్భాల్లో మంచి, చెడులను గుర్తించలేక గందరగోళానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా చెడు స్నేహాల వైపు ప్రభావితం కావచ్చు. తద్వారా సమాజంలో మీ ప్రతిష్ఠ, గౌరవం దెబ్బతినే ప్రమాదం ఉంది. అంతేకాకుండా వివిధ ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉండొచ్చు.
కుటుంబంలో ఒడుదొడుకులు
గురు చండాల యోగం కారణంగా మీ కుటుంబంలో ఉద్రిక్తత ఏర్పడవచ్చు. దాంపత్య బంధంలో విభేదాలు తలెత్తవచ్చు. దంపతుల మధ్య మనస్పర్థలు, అభిప్రాయ భేదాలు రావచ్చు. ప్రధానంగా స్త్రీల జాతకంపై ఇది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. వివాహానికి సంబంధించి విషయాల్లో ప్రతికూలతలు కనిపించవచ్చని పండితులు చెబుతున్నారు.

మంచి పరిణామం ఎప్పుడు
మీ జాతకంపై గురు చండాల యోగం దుష్ప్రభావాలు తగ్గాలి అంటే.. మీ జాతకంలో గురు గ్రహం ఉచ్చ రాశిలో ఉండాలి. లేదా శుభ గ్రహాల మద్దతు కలిగి ఉండటం లేదా బలమైన స్థితిలో ఉన్నట్లయితే ఈ యోగం వల్ల కలిగే నష్టాలు తగ్గుతాయి. గురు గ్రహం కేంద్రానికి అధిపతిగా ఉన్నా.. రాహువుతో త్రికోణంలో మీ జాతకంలో సానుకూల ఫలితాలు ఏర్పడే సూచనలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
గురు చండాల యోగం పరిహార మార్గాలు
మీ రాశి, జాతకంలో గురు చండాల యోగంతో కలిగే దుష్ప్రభావాల నుంచి బయటపడాలంటే కొన్ని నివారణ మార్గాలు తప్పనిసరిగా పాటిస్తే మేలు జరుగుతుందని పండితులు సూచిస్తున్నారు. ఇంట్లో పెద్దలను గౌరవించి, వారి ఆశీర్వాదాలు తీసుకుంటే శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ యోగం ఉన్నంత కాలం రోజూ ఇష్టదైవం ఆలయానికి వెళ్లి పూజ చేయాలి. ముఖ్యంగా ఆది దేవుడు శివుడిని పూజిస్తూ 'ఓం నమఃశివాయ’ మంత్రాన్ని జపిస్తే సానుకూలంగా ఉంటుంది. విష్ణుమూర్తి మంత్రాలను జపించడం, దుర్గాదేవిని ఆరాధిస్తూ దుర్గా సప్తశతి పారాయణం చేయడం ద్వారా గురు చండాల యోగం దుష్ప్రభావాల నుంచి బయటపడవచ్చని పండితులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
