Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Guru Gochar 2023:12 ఏళ్ల తర్వాత 'గజలక్ష్మీ రాజయోగం',ఈ 5 రాశుల వారికి అకస్మిక ధనలాభం,అన్నింటా శుభప్రదం..
Guru Gochar 2023:12 ఏళ్ల తర్వాత 'గజలక్ష్మీ రాజయోగం', 5 రాశుల వారికి అనుకోకుండా ధనలాభం,అన్నింటా శుభప్రదం..
Guru Gochar 2023: వేద జ్యోతిష్యం ప్రకారం, ఏదైనా ఒక గ్రహం దాని రాశిని మార్చినప్పుడు. దీని ప్రత్యక్ష ప్రభావం మానవ జీవితం చూపుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువు బృహస్పతి ఏప్రిల్ 22 న మేషరాశిలో ప్రవేశించనున్నాడు. ఈ సంవత్సరం దేవ గురు బృహస్పతి ఒక్కసారి మాత్రమే తన గమనాన్ని మార్చుకోనుంది. దీని వల్ల మేషరాశిలో ఇదివరికే చంద్రుడు నివాసం ఉండటం వల్ల బృహస్పతి కూడా సంచారం చేయడంతో గజలక్ష్మీ రాజయోగం ఏర్పడనుంది.

బృహస్పతి 12 సంవత్సరాల తర్వాత మేషరాశిలో సంచరిస్తుండట వల్ల మొత్తం ద్వాదశ రాశుల్లో 5 రాశుల వారికి ఎంతో మేలు చేకూరుస్తుంది. ఈ సమయంలో ఆకస్మిక ధన లాభం పొందుతారు మరియు జీవితంలో మంచి పురోగతి అవకాశాలు రానున్నాయి. గజలక్ష్మి రాజయోగం చాలా శుభప్రదంగా ఉండబోతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఈ రాజయోగం వల్ల ఏఏ రాశుల వారికి అత్యంత ఫలప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.

మేష రాశి
గజలక్ష్మీ రాజయోగం ఏర్పడటంతో ఈ రాశి వారికి ఎలాంటి ఆర్థిక సమస్యలున్నా పరిష్కరింపబడుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండే సూచనలు కనబడుతున్నాయి. ఎందుకంటే బృహస్పతి మీ రాశి నుండి లగ్నాధిపతి ఇంటికి వెళ్లబోతున్నాడు. అందుకే ఈ సమయంలో ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఇక కుంటుంబం విషయంలో మీరు పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలను పొందుతారు . దాంతో సంతోషంగా ఉంటారు. పిల్లలు కెరీర్ లో స్థరపడటం వల్ల మీకు ఉపశమనం కలుగుతుంది. అదే సమయంలో కోర్టు కేసుల్లో నిర్ణయం మీకు అనుకూలంగా వచ్చే సూచనలున్నాయి.

మిధునరాశి
గజలక్ష్మి రాజయోగం వల్ల మిథునరాశి వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి మీ సంచార జాతకంలో ఆదాయ గృహంలో సంచరించబోతున్నాడు. కాబట్టి, ఈసారి మీరు వివిధ రూపాల్లో డబ్బు సంపాదించగలరు. మీరు ఎందులో పెట్టుబడి పెట్టినా అందులో ఆధాయం బాగా పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడికి మంచి రాబడి లభిస్తుంది. దీంతో పాటు ఉద్యోగులకు ప్రమోషన్లు , ఇంక్రిమెంట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో పెద్ద ఒప్పందాన్ని ఖరారు చేయవచ్చు, ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది.

ధనుస్సు రాశి
మేషరాశిలో గజలక్ష్మి రాజయోగంగా ఏర్పడటం వల్ల, మీరు ఆకస్మిక ధనలాభం పొందవచ్చు. ఎందుకంటే బృహస్పతి మీ రాశి నుండి ఐదవ ఇంటిలో సంచరించబోతున్నాడు. అందుకే ఈ సమయంలో వ్యాపారవేత్తలు వ్యాపారంలో మంచి విజయం సాధిస్తున్నారు. మంచి లాభాలు పొందుతారు. డబ్బు పరంగా ఎలాంటి లోటు ఉండదు. దీనితో పాటు, ప్రేమ-బంధాలలో బలం కనిపిస్తుంది. పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకొనేవారికి మీ కోరిక నెరవేరుతుంది.

మకరరాశి
మకర రాశి వారికి గజలక్ష్మీ రాజయోగం శుభప్రదం మరియు ఫలప్రదం. ఎందుకంటే బృహస్పతి మీ రాశిలోని నాల్గవ ఇంట్లోకి ప్రవేశించనున్నాడు. ఇది మీ శారీరక ఆనందం మరియు సంతోషం కలిగిస్తుంది. ఈ సమయంలో మీరు అన్ని భౌతిక ఆనందాలను పొందవచ్చు. ఈ రాజయోగ సమయంలో ఆస్తులు మరియు వాహనం కొనుగోలు చేస్తారు. అలాగే పిత్రార్జిత ఆస్తి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరోవైపు, హోటళ్లు, టూర్ ట్రావెల్స్ మరియు రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన వ్యాపారస్తులకు ఈ సమయం చాలా బాగుంది. అదే సమయంలో, ఈ యోగం యొక్క దృష్టి మీ జాతకంలో పదవ ఇంటిపై పడుతోంది. కాబట్టి మీరు ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది.

మీనరాశి
మీన రాశి వారికి గజలక్ష్మీ రాజయోగం ఏర్పడటంతో ఆర్థికంగా చాలా మేలు జరుగుతుంది. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. ఎందుకంటే బృహస్పతి రెండవ ఇంట్లో సంచరించబోతున్నాడు. కాబట్టి, మీరు ఈ సమయంలో ఆకస్మిక ధన లాభాన్ని పొందవచ్చు. ఇంకా అనేక కారణాల వల్ల గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి వేగవంతం కానున్నాయి. కార్యాలయంలో అధికారులు మరియు సహోద్యోగుల నుండి పూర్తి సహకారం ఉంటుంది మరియు మీ కీర్తి కూడా పెరుగుతుంది. వ్యాపారస్తులకు తమకు రావాల్సిన డబ్బును పొందుతారు. అయితే మీకు శని సడే శతి జరుగుతున్నందున మీ ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి.



Click it and Unblock the Notifications