Latest Updates
-
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే..
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా?
ఈ ఏడాది నవంబర్ 8న దీపావళి పండుగను జరుపుకుంటారు. అయితే దీపావళి పండుగకు ముందు, అక్టోబర్ 31న దేవగురువైన బృహస్పతి (గురుడు) సింహ రాశిలోకి ఎంటర్ అవుతాడు. అప్పటికే సింహరాశిలో ఉండే కేతువుతో గురుడు కలుస్తాడు. ఈ ప్రత్యేకమైన గురు కేతు కలయికను జ్యోతిష్య నిపుణులు ధ్వజ యోగం అని పిలుస్తారు. దీనిని కుబేర యోగం అని కూడా అంటారు.
గురు గ్రహం జ్ఞానం, అపారమైన సంపద, ఉన్నత విద్య, అదృష్టాలకు ప్రతీకగా నిలుస్తుంది. మరోవైపు కేతువు ఆధ్యాత్మికత, వైరాగ్యం, మోక్ష మార్గాలకు నిదర్శనం. ఈ రెండు భిన్నమైన శక్తులు ఏకమవ్వడం వల్ల కొన్ని రాశుల వారికి ఊహించని అదృష్టం వరిస్తుంది.ముఖ్యంగా మేష, సింహ, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ సమయం వృత్తి, విద్యా, ఆర్థిక పరంగా సరికొత్త అవకాశాలను అందించబోతోంది. ఆయా రాశుల అదృష్ట ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఇక్కడ చూడండి.

మేష రాశి
ఉద్యోగ, విద్యా రంగాల్లో ఉన్నవారికి సరికొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు ఇక శరవేగంగా ముందుకెళ్తాయి. ఆర్థికపరంగా మంచి భరోసా లభిస్తుంది. కెరీర్ మారాలనుకునే వారికి, చదువులో రాణించాలనుకునే వారికి ఇది సువర్ణావకాశం. అయితే అదృష్టం తోడున్నప్పటికీ.. మీ కఠోర శ్రమ, సరైన సమయంలో తీసుకునే వివేకవంతమైన నిర్ణయాలే మిమ్మల్ని శిఖరాగ్రానికి చేరుస్తాయి.
సింహ రాశి
గురు, కేతువుల కలయిక ఈ రాశిలోనే జరుగుతుండటంతో సింహ రాశి వారికి ఇది అత్యంత ప్రాముఖ్యత కలిగిన సమయం. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి, తద్వారా ఆర్థిక పునాదులు మరింత బలంగా మారుతాయి. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టవచ్చు. ఏళ్ల తరబడి వేధిస్తున్న ఆస్తి, భూ వివాదాలు ఓ కొలిక్కి వచ్చి ప్రశాంతత లభిస్తుంది. అయితే ఆర్థికపరమైన భారీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం కాస్త ఆచితూచి అడుగువేయడం ఉత్తమం.

కన్యా రాశి
నిలిచిపోయిన పనులన్నీ విజయవంతంగా పూర్తయి, పెద్ద ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారి ప్రణాళికలు సక్సెస్ అవుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరగడంతో పాటు వారి పనితీరుకు తగిన గుర్తింపు, కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థిక విషయాల్లో ఖర్చులను నియంత్రించుకుంటూ, సరైన ప్రణాళికతో ముందుకు సాగితే అద్భుతమైన ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశికి చెందిన విద్యార్థులకు, ఉద్యోగులకు ఈ గ్రహ సంయోగం టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఉద్యోగం మారాలని ప్లాన్ చేసే వారికి ఆకర్షణీయమైన, లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు తమ కష్టానికి తగ్గ అద్భుత ఫలితాలు సాధిస్తారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంపై, మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెడితే భవిష్యత్తు బంగారుమయం అవుతుంది. అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా మీ సన్నద్ధతపై మాత్రమే ఆధారపడండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
