Latest Updates
-
శరీరానికి అవసరమైన పోషకాల కోసం.. రుచికరమైన గ్రీన్ పొంగల్ ఎలా చేసుకోవాలంటే.. -
వాస్తు ప్రకారం ఇల్లు తుడుచుకోవడానికి సరైన టైం ఏది? -
కిచెన్‌లో శ్రమ తగ్గించే చిట్కాలు.. ఈ టెక్నిక్స్‌తో అన్నం అంటుకోదు, పప్పు పొంగిపోదు.! -
టీ తాగితే ఎముకలు కరిగిపోతాయా? ఈ విషయాలు మీకు తెలుసా? -
డైలీ ఐదు చాలు.. వీటిని రాత్రంతా నానబెట్టి తింటే రక్తహీనత బాధే ఉండదు.! -
రాఖీ, కృష్ణాష్టమి స్పెషల్..అచ్చు స్వీట్ షాప్ రుచితో ఇంట్లోనే పర్ఫెక్ట్ సోన్ పాప్డీ చేసుకోండిలా.. -
శుక్ర గోచారం 2026..ఆగష్టు 25 నుంచి ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు! -
శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి! -
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.? -
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు..
మీ ఇంటి తలుపులు ఇలా ఉన్నాయంటే.. పేదరికం కష్టాలు తప్పవు.!
ప్రతి ఇంటికీ ప్రధాన ద్వారం చాలా ముఖ్యం. ఇల్లు కట్టుకునేటప్పుడు ప్రధాన ద్వారం ఎలా ఉండాలనేదానిపై వాస్తు చూసుకుని అమర్చుతారు. భోగభాగ్యాలు, సిరులు కురిపించే లక్ష్మీ దేవి ప్రధాన ద్వారం గుండా ఇంట్లోకి ప్రవేశిస్తుందని ప్రజల నమ్మకం. అందుకే మెయిన్ డోర్ వద్ద చాలా పరిశుభ్రంగా ఉంచుతారు. కానీ తలుపుల్లో అప్పుడప్పుడూ చోటుచేసుకునే ఈ మార్పులను చాలా మంది గమనించరు. ఇది పేదరికానికి దారితీయవచ్చని వాస్తు శాస్త్రం చెబుతోంది.

జీవితంలో ఒత్తిడి
ఇంట్లోకి ప్రవేశించే క్రమంలో ప్రధాన ద్వారం తెరిచినప్పుడు లేదా మూసినప్పుడు వచ్చే శబ్దాన్ని చాలా మంది పట్టించుకోరు. అయితే ఇది చాలా పొరపాటు అని.. నిర్లక్ష్యం చేయవలసిన విషయం కాదని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది. ఇది పేదరికానికి దారి తీసే అవకాశం ఉందని చెబుతోంది. అంతేకాకుండా జీవితంలో ఒత్తిడి కూడా పెరగొచ్చు. ఈ విషయాలపై వాస్తు శాస్త్రంలో వివరించారు.
ప్రధాన ద్వారం తెరిచే, మూసే క్రమంలో వచ్చే తీవ్రమైన శబ్దాలు.. వాస్తు దోషాలకు కారణమవుతాయి. అంతేకాకుండా ఇంటి యజమాని ఆర్థిక పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. అంతేకాకుండా జాతకంలో రాహు కేతు గ్రహాల ప్రతికూల ప్రభావం అధికంగా ఉంటుంది. ఫలితంగా ఇంట్లో ఆకస్మిక ప్రమాదాలు జరగడం, కోర్టు వ్యవహారాలు, న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
ఇంటి యజమానిపై ప్రభావం
ఈ శబ్దాల వల్ల ఇంటి యజమాని ఎంత సంపాదించినా అది నీళ్లలా ఖర్చయిపోతుంది. అనవసర ఖర్చులు వస్తాయి. ఫలితంగా ఇంట్లో పేదరికం ఏర్పడటమే కాకుండా నిరాశకు దారితీసే ప్రమాదం ఉంది. మానసికంగానూ ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా కుటుంబీకులపై చిరాకు, కోపం ప్రదర్శించడంతో గొడవలకి దారి తీస్తుంది.
పరిష్కారమేంటి
మీ ఇంటి తలుపుల నుంచి కీచుమని శబ్దాలు తరచుగా వినిపిస్తున్నట్లయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. శబ్దాలు వస్తున్న దగ్గర నూనె లేదా గ్రీజు రాసి కాసేపు అలాగే వదిలేయాలి. ఇలా చేస్తే కాసేపటికి శబ్దాలు ఆగిపోతాయి. ఇంటిలోపల బయటా ప్రశాంతంగా, పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ప్రధాన ద్వారం చుట్టూ శుభ్రంగా, మంచి వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ప్రతికూల శక్తి తొలగి, లక్ష్మీదేవి ఆశీస్సులు అందుతాయని వాస్తు శాస్త్రం సూచిస్తోంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications