Latest Updates
-
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్
హనుమాన్ జయంతి రోజు ఇలా చేస్తే.. శనిదోషం తొలగిపోతుంది
ప్రతీ సంవత్సరం రెండు సార్లు వచ్చే హనుమాన్ జయంతిని హిందువులు ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం చైత్రమాసం పౌర్ణమి రోజు ఏప్రిల్ 23న హనుమాన్ జయంతిని జరుపుకుంటాం. ఎన్ని దోషాలు, బయాలు ఉన్నా హనుమంతుడికి పూజిస్తే తొలగిపోతాయ్. శనిప్రభావం వున్న రాశుల వారు హనుమాన్ జయంతి రోజున ఆంజనేయుడికి పూజచేస్తే వారిపై శనిప్రభావం ఉండదు.
శనిదోషం తొలగేందుకు ప్రత్యేక పూజ
హనుమాన్ జయంతి రోజున చాలా మంది భక్తులు విధిగా ఉపవాసం చేస్తారు, పూజ చేస్తారు, హనుమాన్ భజన, హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారు. అయితే శనిప్రభావం ఉన్నవారు శనిదోషం తలగాలంటే ప్రత్యేకంగా హనుమంతుడికి ఆరోజు పూజ చేయవలసి ఉంటుంది. ఆ పూజను ఎలా చేయలో తెలుసుకుందాం.

శని దోషం తొలగాలంటే ఇలా చేయాలి..
హనుమాన్ జయంతి రోజున ఉదయం నుంచి నిష్టగా హనుమంతుడిని పూజించడం ప్రారంభించాలి. హనుమంతుడి విగ్రహం ముందు ఆవు నూనెతో దీపం వెలిగించాలి. అందులో నల్లనువ్వులు వేసి దండం పెట్టుకోవాలి. నల్ల నువ్వులు వేయడానికి ఓ కారణం ఉంది. వీటిపై శనిప్రభావం ఉండదు, అశుభాలు జరగకుండా కూడా నల్లనువ్వులు కాపాడతాయ్. శనిదేవుడి ప్రభావం పడని వాళ్లల్లో ఆంజనేయుడు కూడా ఉన్నాడు. అందువల్ల శని దోషం తొలగిపోవాలంటే ఆంజనేయుడిని ఆరాధించాల్సిందే.
అప్పుల బాధలు తీరాలంటే
హనుమాన్ జయంతి రోజు హనుమాన్ చాలీసా పఠనం చేయలి. హనుమంతుడి విగ్రహం ముందు మల్లె నూనెతో దీపం వెలిగించి శనగపిండి, ఎర్రచోళం సమర్పించాలి. ఇలా పూజిస్తే అప్పుల బాధ నుంచి బయటపడతారు.
తమలపాకుల దండ
ప్రతీ ఆంజనేయస్వామి దేవాలంలో హనుమంతుడిపై తమలపాకుల దండ చూసే ఉంటారు. తమలపాకులంటే ఆంజనేయుడికి ప్రతీ. తమలపాకులదండతో పూజిస్తే హనుమంతుడి ఆశిస్సలు ఉంటాయ్.
సందరకాండ పారాయణం
హనుమాన్ జయంతి రోజున సందరకాండ పరాయణం తప్పకుండా చేయాలి. అలాగే ప్రసాదంగా లడ్డూలు చేసి భక్తులకు పంచిపెట్టాలి. దీని వల్ల మీ కుటుంబంలో పిల్లల ఆరోగ్యం, చదువు మెరుగుపడుతుంది.
ఆర్ధిక సమస్యలు
హనుమాన్ జయంతి రోజున మీ శక్తికి తగినట్లు దానధర్మాలు చెయ్యాలి. అప్పుడు మీపై ఆంజనేయుడి ఆశీస్సులతో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయ్. డబ్బుకు సంబంధించిన ఇంకా ఏ సమస్యలున్నా మీనుంచి దూరమౌతాయ్. ఆకలితో అలమటించే నిరుపేదలకు అన్నదానం చేస్తే కూడా మీకు ఆర్థిక సమస్యలు తీరిపోతాయ్.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
