Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
12 ఏళ్ల తర్వాత బృహస్పతి రాశి మార్పు..3 రాశులపై కనకవర్షంకి రెడీ అయిన దేవతల గురువు
ఒక రాశి నుంచి బృహస్పతి వెళ్లిన తర్వాత మళ్లీ తిరిగి అదే రాశిలోకి రావాలంటే 12 ఏళ్లు పడుతుంది. జ్ణానానికి, విద్యకు, సంపదకు కారకుడిగా భావించే దేవతల గురువు బృహస్పతి ప్రస్తుతం వృషభరాశిలో ఉన్నాడు. గతేడాది మే నెలలో వృషభరాశిలోకి బృహస్పతి ప్రవేశించగా.. దాదాపు 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. బుధుడు అధిపతిగా ఉన్న మిథునరాశిలోకి మే 14,2025న బృహస్పతి ప్రవేశించడంతో దీని ప్రభావం మొత్తం అన్ని రాశులపై ఉండనుంది.
ముఖ్యంగా 3 రాశుల వారికి బృహస్పతి సంచారం శుభఫలితాలను కలిగిస్తుందని జ్యోతిష్య పండితులు చెప్పారు. ఈ 3 రాశుల వ్యక్తులు ఆర్థిక పరిస్థిలో మెరుగుదల, వృత్తిలో పురోగతి, సమాజంలో గౌరవం, ప్రతిష్ఠ,సంబంధాలలో సానుకూల మార్పులు పొందుతారని చెబుతున్నారు. ఆ 3 రాశులో ఏవో ఇక్కడ చూడండి.

తుల రాశి
దేవగురువు బృహస్పతి రాశి మార్పు తుల రాశి వ్యక్తులకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని జ్యోతిష్య పండితులు తెలిపారు. బృహస్పతి మీ అదృష్టస్థానంలోకి ప్రవేశిస్తుంది..దీంతో మీ జాతకంలో అదృష్టం తిరుగులేని శక్తిగా మారుతుంది. మీ ప్రయత్నాలన్నింటికి విజయం తోడవుతుంది. ఈ సమయంలో మీలో కొత్త ఉత్సాహం నిండి ఉంటుంది. మీ మనస్సు ఆధ్యాత్మిక చింతనలవైపు మళ్లుతుంది. పవిత్రమైన,శుభ కార్యాల్లో పాల్గొనే ఛాన్స్ లభిస్తుంది.విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మీ లైఫ్ స్టైల్ లో కూడా మార్పులు వస్తాయి. మీ ఆర్థిక ప్రణాళికలు విజయవంతంగా కార్యదూరం దాల్చుతాయి. కుటుంబసభ్యులతో, ప్రేమికుల మధ్య సంబంధాలు మరింత బలపడతాయి. కొత్త వ్యక్తులు మీ లైఫ్ లోకి వస్తారు. విదేశాలకు లేదా కొత్త ప్రదేశాలకు వెళ్లే ఛాన్స్ లభిస్తుంది. సమాజంలో కీర్తి,గౌరవం లభిస్తాయి. కళా రంగంలో ఉన్నోళ్లు తమ ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారని జ్యోతిష్య పండితులు తెలిపారు.
కన్య రాశి
బృహస్పతి రాశి మార్పు కన్య రాశి వ్యక్తులకు భారీ ప్రయోజనాలను అందిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. బృహస్పతి మీ కర్మ స్థానాలంలోకి అడుగుపెడుతున్నాడని,దీంతో అదృష్టం మీ తలుపు తట్టబోతుందని చెప్పారు. మీ తెలివిటేలు,కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. మీరు కెరీర్ లో అద్భుతమైన పురోగతి చూస్తారని తెలిపారు. ఎంతకోకాలంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఈ సమయంలో మీకు ఉద్యోగం లభిస్తుంది. ఇప్పటికే మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే అందులో పదోన్నతి వచ్చే ఛాన్స్ ఉంటుందని, మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుందని చెప్పారు. ఈ సమయంలో మీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఇది మీ ఆర్థిక భవిష్యత్తుకి బలమైన పునాది వేస్తుందని చెప్పారు.వ్యాపానం చేసే కన్య రాశి వ్యక్తులకు ఇది నిజంగా పండగ సమయం అని..వ్యాపారంలో ఊహించని లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పారు. ప్రేమ సంబంధాలు మరింత స్ట్రాంగ్ అవుతాయి. అవివాహితులకు మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
మీన రాశి
బృహస్పతి రాశి మార్పు మీన రాశి వ్యక్తుల జీవితాల్లో కొత్త మార్పులు తీసుకురానుందని జ్యోతిష్య పండితులు తెలిపారు. ఈ సమయంలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. పూర్వీకుల ఆస్తి నుంచి మీకు ప్రయోజనం చేరే అవకశముంటుది. కుటుంబంలో ఏవైనా విభేదాలు ఉంటే ఈ సమయంలో అవి పరిష్కారమవుతాయి. వ్యాపారులకు లాభం లభిస్తుంది,వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. తల్లితో మీ సంబంధం మరింత బలపడుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్దయవుతున్నవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. భౌతిక సుఖాలను ఈ సమయంలో మీన రాశి వ్యక్తులు అనుభవిస్తారని జ్యోతిష్య పండితులు చెప్పారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications