Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
కుబేర యోగం..మహా శివరాత్రి నుంచి ఈ రాశులకు ఎక్కడ పెట్టుకోవాలో తెలియనంత సంపద
హిందూమతంలో కుబేరుడు సంపదకు అధిపతి అయిన దేవుడిగా పరిగణిస్తారు. కలియుగ ప్రత్యక్ష్య దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కూడా కుబేరుడి దగ్గర నుంచి డబ్బు అప్పు తీసుకున్నట్లు మన పురాణాలు చెబుతున్నాయి. కుబేరుడు అనుగ్రహిస్తే ఆ ఇంట్లో సిరిసంపదలకు అస్సలు లొటుండదని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుబేర యోగం ఆర్థిక భాగ్యం అందించే శక్తివంతమైన జ్యోతిష్య యోగం. ఇది ఉన్నత స్థాయికి ఎదగడంలో సహాయపడుతుంది.
ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి 26, 2025న జరుపుకుంటారు. ఈ మహా శివరాత్రికి కొన్ని గ్రహాలు మీనరాశిలో కలుస్తున్నాయి. ఈ కలయికవల్ల మహా శివరాత్రి రోజు ఏర్పడే కుబేర యోగం మూడు రాశుల వారిని కోటీశ్వరులను చేస్తోందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఆ మూడు రాశులేవో ఇక్కడ చూడండి.

కుబేరుడు అనుగ్రహంతో వృశ్చిక రాశి వ్యక్తులకు ఆకస్మిక ధనలాభం ఉంది. వృత్తిపరంగా చాలా మంచిగా ఉంటుంది. పనిలో విజయం సాధిస్తారు. సహోద్యోగులు, ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి సమయం. వ్యాపారస్తులు తమ వ్యాపారాలను విస్తరిస్తారు. కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. శివుని పూజ చేయడం, మహాలక్ష్మీ సహస్రనామం పఠించడం, దాన ధర్మాలు చేయడం ద్వారా కుబేర యోగం మరింత శక్తివంతం అవుతుంది.
సింహ రాశి
ఆర్థికంగా లాభాలు ఉంటాయి. అనుకోకుండా కలిసివచ్చే ధనంవల్ల రుణ సమస్యలన్నీ తీరిపోయి కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. మనశ్శాంతి కలుగుతుంది. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. కొత్త ఉద్యోగాలు వస్తాయి, ప్రమోషన్లు కూడా వస్తాయి. ఉన్నత విద్యను అభ్యసించడానికి అవకాశాలు లభిస్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. వ్యాపారస్తులకు కూడా లాభాలు వస్తాయి. భూమి లేదంటే భవనాన్ని కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటే అది నెరవేరుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
వృషభ రాశి
కుబేర యోగం కారణంగా వృషభ రాశి వారికి మహాశివరాత్రి ప్రత్యేక ఫలితాలు దక్కనున్నాయి. ఆర్థికంగా చాలా బాగుంటుంది. వ్యాపారంలో విపరీతమైన లాభాలు వస్తాయి. సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే ఆలోచనలో ఉంటారు. సన్నిహితులు, స్నేహితులకు సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులతో సంబంధాలు బాగుంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కొత్తగా వచ్చే అవకాశాలను ఉపయోగించుకుంటే కుబేరులవుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
