Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రస్తుతం కుజుడు తన అత్యల్ప రాశి అయిన కర్కాటకంలో సంచరిస్తూ ఉన్నాడు. నవంబర్ 12 వరకు అక్కడే ఉండనున్నాడు. ఇక గురుడు గ్రహం కూడా అక్టోబర్ 31 వరకు అదే రాశిలో కొనసాగుతాడు. ఈ క్రమంలో కుజుడు నీచ స్థితిలో ఉండగా, గురుడు ఉచ్ఛ స్థితిలో ఉండటంతో నీచ భంగ రాజయోగం కొనసాగుతోంది. ఇది చాలా శుభప్రదం కాగా, ఈ యోగం వల్ల ఈ రాశుల వారు ఎనలేని ప్రయోజనాలు పొందనున్నారు.

వృషభ రాశి
కుజ, గురు గ్రహాల కలయిక, నీచభంగ రాజయోగంతో వృషభ రాశి వారికి శుభప్రదం, ప్రయోజనకరం కానుంది. ఈ రాజయోగం వల్ల వీరికి ఊహించని ధన లాభాలు ఏర్పడతాయి. వ్యాపారంలో మంచి లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగస్తులు పదోన్నతి పొందవచ్చు. కోరుకున్న ఉద్యోగంతో పాటు మంచి స్థాయిలో ఉండే అవకాశం ఉంది. నిలిచిపోయిన పనులు నెరవేర్చుకుని విజయం సాధిస్తారు. దీంతో లాభాలు అందుకుంటారు.

కన్యా రాశి
నీచ భంగ రాజయోగం కారణంగా కన్యా రాశి వారు విలాసవంతమైన జీవితం గడుపుతారు. కోరికలు నెరవేరుతారు. ఎంతోకాలంగా కొనాలని ప్రణాళికలు వేసుకుంటున్న వాటిని కొనుగోలు చేస్తారు. నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. దీంతో మీ బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరుగుతుంది. పెండింగ్ పనులు పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. ఇక వ్యాపారస్తులు తాము పెట్టుబడి పెట్టిన చోట ఊహించని లాభాలు అందుకుంటారు.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ కాలం మంచి ఫలితాలను ఇవ్వనుంది. ముఖ్యంగా విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. కోరికలు నెరవేరుతాయి. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. సొంత వ్యాపారం ప్రారంభించాలనుకునే యోచనలో ఉన్నవారికి ఇది మంచి సమయం. నీచ భంగ రాజయోగంతో విజయం సాధిస్తారు.

కుంభ రాశి
కుంభ రాశి వారు ఈ నీచ భంగ రాజయోగం కొనసాగుతున్నంత కాలం వృత్తి, వ్యాపార రంగాల్లో గణనీయమైన విజయాలను అనుభవిస్తారు. ఆదాయ మార్గాలు పెరగడంతో అప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారంలో భారీగా లాభాలు చూస్తారు. వ్యాపార విస్తరణకు మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులు మెరుగైన అవకాశాలు, ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
