జీర్ణక్రియను మెరుగుపరిచే.. ఇడ్లీ, దోశలోకి అదిరిపోయే కొబ్బరి అల్లం చట్నీ చేసుకోండిలా..

Posted By:

రోజూ తినే అల్లం, కొబ్బరి చట్నీలతో విసిగిపోయారా? మీ అల్పాహారానికి కొత్త రుచిని, అదిరిపోయే కారాన్ని జోడించాలనుకుంటున్నారా? అయితే ఆంధ్ర స్టైల్ కొబ్బరి అల్లం చట్నీ ఒకసారి ట్రై చేయండి. సాధారణ చట్నీలకు పూర్తి భిన్నంగా, ఘాటుగా, ఆరోగ్యకరంగా ఉండే ఈ రెసిపీ ఇడ్లీ, దోశల రుచిని రెట్టింపు చేస్తుంది.

ఈ చట్నీ ప్రత్యేకత ఏమిటంటే..ఇందులో అల్లం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం రుచిని అందించడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ, బరువు తగ్గాలనుకునేవారికి సహకరించడంలోనూ అద్భుతంగా పనిచేస్తుంది. కొబ్బరి తీపిదనం, అల్లం ఘాటు, చింతపండు పులుపు కలగలిసి ఈ చట్నీకి అద్భుతమైన రుచిని ఇస్తాయి. ఒక్కసారి ట్రై చేస్తే రోజూ ఇదే కావాలంటారు. కొబ్బరి అల్లం చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

Spicy Healthy Andhra Style Coconut Ginger Chutney How to Make Allam Kobbari Pachadi for Idli Dosa

కావలసిన పదార్థాలు

తురిమిన కొబ్బరి: 3 టేబుల్ స్పూన్లు
అల్లం: పావు కప్పు
పచ్చిమిరపకాయలు: 3
చింతపండు గుజ్జు: 1 టేబుల్ స్పూన్
బెల్లం: 1 టేబుల్ స్పూన్
ఉప్పు: తగినంత
నూనె: 2 టేబుల్ స్పూన్లు

తాలింపు కోసం:

ఆవాలు: 1 చెంచా
మినప పప్పు: 1 చెంచా
కరివేపాకు: రెబ్బ

ఈ దీపావళికి ఇడ్లీలతో స్పైసీ బోటి పులుసు.. ఇలా చేస్తే రుచి అద్భుతం

తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద మందపాటి బాండీ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేయాలి. తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి అల్లం బంగారు గోధుమ రంగులోకి మారే వరకు వేయించి పక్కన పెట్టాలి. తర్వాత మిక్సీ జార్‌లో వేయించుకున్న అల్లం, పచ్చిమిరపకాయలతో పాటు తురిమిన కొబ్బరి, చింతపండు గుజ్జు, బెల్లం, తగినంత ఉప్పు వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొన్ని నీళ్లు కలపవచ్చు.

-తాలింపు కోసం అదే బాండీలో మిగిలిన నూనె వేడి చేసి ఆవాలు, మినపపప్పు, కరివేపాకు వేసి చిటపటలాడించాలి. తర్వాత తయారు చేసుకున్న చట్నీ పోపులో వేసి ఒక నిమిషం పాటు చిన్న మంటపై ఉడికించి దించాలి.

-ఆంధ్ర స్టైల్ కొబ్బరి అల్లం చట్నీ రెడీ. దీన్ని వేడి వేడి ఇడ్లీ లేదా క్రిస్పీ దోశతో కలిసి ఆస్వాదించండి.

[ of 5 - Users]
Desktop Bottom Promotion