Latest Updates
-
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది!
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.!
గ్రహాల సంచారం, కలయిక కొన్ని రాశుల వారికి కుబేర యోగం, సుఖసంతోషాలను ప్రసాదిస్తే.. మరికొన్ని రాశుల వారిని ఒడుదొడుకుల్లో నెట్టివేస్తుంది. దీంతో ఆ కొంతకాలం సదరు రాశుల వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ క్రమంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజు శని నక్షత్రం పుష్యలోకి బుధుడు ప్రవేశం జరగనుంది. ఈ రెండు గ్రహాల భిన్న స్వభావం కారణంగా ఈ రాశుల వారిపై వృత్తి, ఆరోగ్యం, ప్రయాణానికి సంబంధించిన విషయాల్లో కొన్ని అడ్డంకులు ఏర్పడనున్నాయి. ఈ నెల 16 వరకు సదరు రాశుల వారిపై ఈ ప్రభావం ఉండనుంది. దీంతో వారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ రాశులేంటో చూద్దాం..

మిథునం
పుష్య నక్షత్రంలోకి బుధ సంచారం మిథున రాశి వారి కొన్ని సవాళ్లను తీసుకురావచ్చని పండితులు చెబుతున్నారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. పొరపాటుగా ఏదైనా తప్పుగా మాట్లాడితే వారి మధ్య వివాదాలకు దారితీయవచ్చు. వ్యాపారంలో, ఆఫీసులో అనవసరమైన వాదనలు జోలికి వెళ్లకుండా ఉండండి. ఆరోగ్య సంబంధిత విషయాల్లో నిర్లక్ష్యం పనికిరాదు. ఏవైనా అసౌకర్యంగా అనిపిస్తే సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలి. పెట్టుబడులు, ఆర్థిక విషయాల్లో ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోవాలి.

కన్యా రాశి
బుధ సంచారం కన్యా రాశి వారికి కొన్ని విషయాల్లో పాజిటివ్‌గా ఉండవచ్చు. అయితే ఏదైనా పని తలపెట్టినప్పుడు కొద్దిపాటి అజాగ్రత్త వహించినా భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఆదాయ మార్గాల అన్వేషణలో మునుపటి కన్నా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. చట్టపరమైన, కోర్టుకి సంబంధించి వ్యవహారాల్లో సహనంగా ఉండండి. వృత్తిపరమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు. కుటుంబీకులు, భార్యాభర్తల మధ్య పలు ఉద్రిక్తతలు మీకు ఆందోళన కలిగిస్తాయి. పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో మానసిక ఒత్తిడి ఎదుర్కొంటారు.

కుంభ రాశి

కుంభ రాశి వారికి బుధ గోచారం అంతగా కలిసిరాదు. ముఖ్యంగా కొత్తగా ఏవైనా పనులు చేపడుతున్నప్పుడు ఇది సరైన సమయం కాదు. మరికొన్ని రోజులు వేచిచూడటం మంచిది. విద్యార్థులు పరధ్యానానికి గురయ్యే అవకాశం ఉండటంతో చదువులో మరింత ఎక్కువగా కష్టపడాలి. ఆర్థిక పరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా తీరని నష్టాలకు దారితీస్తుంది. ప్రయాణాలు వాయిదా పడే సూచనలు ఉన్నాయి. ఫలితంగా చికాకు ఏర్పడుతుంది. ఫ్రెండ్స్‌తో పాత విభేదాలు మళ్లీ మొదలవుతాయి. వివాహ జీవితంలో భాగస్వామితో కొన్ని అడ్డంకులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications