ఒరేయ్ అబ్బాయిలు బంపరాఫర్...పెళ్లి కానోళ్లకు ఫ్రీగా ఫిన్లాండ్ వీసా, అక్కడోళ్లతో డేటింగ్..ఖర్చులన్నీ వాళ్లవే!

పెళ్లి కాని వ్యక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా పెళ్లి కాని వ్యక్తులు తమ దేశంలోకి ఫ్రీగా వచ్చి అమ్మాయిలతో డేటింగ్ చేసి పెళ్లి చేసుకోవచ్చని బంపరాఫర్ ప్రకటించింది ఫిన్లాండ్. వారికి ఫ్రీ వీసా, ఫ్రీ ఫుడ్, బెడ్ అన్నీ ఏర్పాట్లు చేస్తామని కూడ ప్రకటించింది. పెళ్లి కాక ఇబ్బందులు పడుతున్నవారికి దీన్ని మించిన బంపరాఫర్ ఉండదోమో. అయితే ఈ వీసాకి ఎలా అప్లై చెయ్యాలి, అర్హతలు, తదితర పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల లిస్ట్ లో కొన్నేళ్లుగా ఫిన్లాండ్ ఫస్ట్ లోనే ఉంది. తాజాగా ఫిన్లాండ్ టూరిజం బోర్డు విజిట్ ఫిన్లాండ్.. ఫిన్నిష్ డిన్నర్ డేట్(finnish dinner date)అనే ఒక అద్భుతమైన క్యాంపెయిన్ ని ప్రారంభించింది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం వారైనా సరే 16 మంది పెళ్లికాని వ్యక్తలు ఫ్లినాండ్ కు 4 రోజుల ట్రిప్ కి ఉచితంగా వెళ్లొచ్చు. వీసా, రూమ్, ఫుడ్ అన్నీ ఖర్చులు ఈ 4 రోజల పాటు ఫ్లిన్లాండ్ ప్రభుత్వమే భరిస్తుంది. ఈ ట్రిప్ వచ్చే ఏడాది అంటే 2027 ఫిబ్రవరి 9-19 మధ్యలో ఉంటుంది. ఈ ట్రిప్ కు సెలక్ట్ అయిన 16 మందిలో 8 మందిని ఫిన్లాండ్ లోని హెల్సింకి, మరో 8 మందిని టంపేర్ సిటీకి తీసుకెళ్తారు.

Finnish dinner date free finland visa for singles date locals and fine your match see deatils

అయితే ఈ ట్రిప్ లో హైలెట్ విషయం ఏంటంటే..ఫిన్లాండ్ లోని పెళ్లి కాని వ్యక్తులతో మంచి
గ్రూప్ డిన్నర్ డేట్ కూడా అక్కడి ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. రకరకాల విందు భోజనాలు ఫ్రీగా పెట్టి, అక్కడి సింగిల్ అమ్మాయిలు, సింగిల్ అబ్బాయిలతో మాట్లాడి ప్రేమ, పెళ్లి వంటివి చేసుకునే మంచి అవకాశం కల్పిస్తోంది. ఫిన్లాండ్ ఫుడ్ కల్చర్ కూడా తెలుసుకునే ఛాన్స్ ఉంది.

ప్రభుత్వ హాస్పిటల్స్ దుస్థితికి ఇదే నిదర్శనం.. ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్ కి ఎయిమ్స్ డైరెక్టర్!ప్రభుత్వ హాస్పిటల్స్ దుస్థితికి ఇదే నిదర్శనం.. ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్ కి ఎయిమ్స్ డైరెక్టర్!

ఎలా అప్లై చేయాలి, రూల్స్ ఏంటి

ఫిన్లాండ్ దేశంలో నివసించేవాళ్లు తప్ప మిగతా దేశాల్లోని 18 ఏళ్లు పైబడి సింగిల్ గా ఉన్న వ్యక్తులందరూ అర్హులే. అయితే దీనికోసం ముందుగా మీరు డిన్నర్ డేట్ కి ఏం వడ్డిస్తారో, ఎందుకు వడ్డిస్తారో తెలియజేస్తూ ఇంగ్లీషులో ఒక షార్ట్ వీడియోను తీసి దాన్ని #FINNISHDINNERDATE, #VISIT FINLANDను ట్యాగ్ చేసి ఇన్ స్టాగ్రామ్ లేదా టిక్ టాక్ లేదా యూట్యూబ్ లో పోస్ట్ చేయాలి. తర్వాత ఫిన్నిష్ డిన్నర్ డేట్ డాట్ కామ్(FINNISHDINNERDATE.COM)అనే వెబ్ సైట్ లో ఫారమ్ నింపాలి. అప్లికేషన్లు నవంబర్ 10,2026లో ముగుస్తాయి. డిసెంబర్ 1న ఎవరు సలెక్ట్ అయ్యారో ప్రకటిస్తారు.

Story first published: Monday, November 2, 2026, 14:27 [IST]
Desktop Bottom Promotion