Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్‌లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు చిత్ర నక్షత్రరాశిలోకి సెప్టెంబర్ 21న రాత్రి 10.45 గంటలకు ప్రవేశించనున్నాడు. పది రోజుల పాటు అంటే అక్టోబర్ 1, ఉదయం 9.33 గం. వరకు అక్కడే ఉండనున్నాడు. చిత్ర నక్షత్రం కుజుడికి సంబంధించినది కావడంతో జ్యోతిష్య పరంగా ఈ సంచారం చాలా ముఖ్యమైనది పరిగణిస్తారు. తెలివితేటలు, వాక్చాతుర్యం, వ్యాపారం, తర్కం, సంభాషణ, ఆర్థిక వ్యవహారాలకు బుధ గ్రహాన్ని కారకుడిగా భావిస్తారు. దీంతో ఈ పరిణామం అన్ని రాశుల వారిపై భిన్నంగా ఉంటుంది. ఈ క్రమంలో చిత్త నక్షత్రంలోకి మార్పు ఈ నాలుగు రాశుల వారికి అనుకూలం కానుంది. ఆ రాశులేంటంటే..

వృషభ రాశి
చిత్త నక్షత్రంలోకి బుధ గ్రహ సంచారం వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండనుంది. ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్స్, హైక్ లాంటివి పొందే సూచనలు ఉన్నాయి. పై అధికారుల సపోర్ట్ ఉంటుంది. దీంతో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యాపారస్థులు ఊహించని ధనలాభం అందుకోవచ్చు. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవచ్చు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.

మిథునం
బుధ గ్రహ సంచారంతో మిథున రాశి వారు వృత్తి, వ్యాపార పరంగా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెంపు మార్గాలు కనపడతాయి. మీరు పెట్టిన పెట్టుబడులు లాభాలను తీసుకువస్తాయి. దీంతో ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయవచ్చు. కొత్త ప్రాజెక్టులకు ఇది మంచి సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు.

కన్యా రాశి
కన్యా రాశి వారికి సెప్టెంబర్ 21 తర్వాత ఉద్యోగ, వృత్తిపరమైన పురోగతి లభించనుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇది మంచి సమయం. పెండింగ్ ప్రాజెక్టులు ఊపందుకుంటాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. సిరిసంపదలు పెరగడంతో మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించి శుభవార్త అందుకునే అవకాశం ఉంది.

మకర రాశి
మకర రాశి వారికి రానున్న పదిరోజులు శుభ సమయం. మీ మనసులోని ప్రధాన కోరిక నెరవేరబోతుంది. వృత్తిపరంగా కొత్త ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ టైం కలిసి రానుంది. ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి బలపడటంతో పాటు బయట చిక్కుకుపోయిన మీ డబ్బులు తిరిగి వస్తాయి. నూతన పరిచయాలు వ్యాపారస్తులకు ప్రయోజనం కానుంది. ఇది భవిష్యత్తు లాభాలకు అవకాశం కానుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు ఒక పెద్ద సంస్థ నుంచి ఆఫర్ అందుకుంటారు. మీకు ఇష్టమైన వాహనం కొనాలనే మీ కోరిక నెరవేరనుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
