Latest Updates
-
ఫ్రిజ్‌లో ఏ కూరగాయ ఎంత కాలం నిల్వ ఉంటుంది?.. సరైన స్టోరేజ్ పద్ధతులు ఇవే! -
ఒంట్లో రక్తం పెంచి, బలాన్ని అందించే సూపర్ ఫుడ్ 'జొన్న మెంతి పరాటా’.. ఈజీగా ఇలా చేసేయండి.! -
దానిమ్మ తింటే నిజంగానే టెస్టోస్టెరాన్ పెరుగుతుందా.. పురుషులు తెలుసుకోవాల్సిన లాజిక్ ఇదే.! -
స్పైసీ ఫుడ్ లవర్స్‌కి పండగే.. ముక్కముక్కలో తెలంగాణ ఘాటు తెలిపే 'అంకాపూర్ నాటుకోడి కూర'! -
నకిలీ డిస్కౌంట్లకు నో ఛాన్స్.. ఆన్లైన్ షాపింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు.! -
శుక్రుడి వక్రగతి మహర్దశ.. ఆ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో సిరుల పంట.! -
బెంగళూరు వీధుల్లో దొరికే అచ్చమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
తొలిసారి విదేశీ ప్రయాణమా.. ఈ 5 తప్పులు చేస్తే మీ వీసా తిరస్కరణకు గురైనట్లే.! -
మొఘలాయ్ తవా చికెన్.. మసాలా వేశాక ఇలా చేస్తే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది!
చంద్ర, కేతు సంయోగంతో సింహ రాశిలో గ్రహణం.. చిక్కుల్లో పడబోయే రాశులు ఇవే.!
జ్యోతిష్యం ప్రకారం అక్టోబర్ 6న చంద్రుడు, కేతువు ఒకే రాశిలో ఉండనున్నాయి. అదే సింహరాశి. ఆ రోజు రాత్రి చంద్రుడు కర్కాటక రాశిని విడిచి సింహంలోకి వస్తాడు. కేతువు అప్పటికే ఆ రాశిలో ఉండగా.. చంద్ర- కేతు కలయికతో అశుభ గ్రహణం సంభవించనుంది. ఈ సంయోగం దాదాపు 54 గంటల పాటు ఉండే అవకాశం ఉంది. ఈ కారణంగా ఐదు రాశుల వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. శారీరకంగా, మానసికంగా, కుటుంబ పరంగా పలు సమస్యలు ఎదుర్కోనున్నారు. మరి ఆ రాశులేంటి.. వారు ఏ విషయంలో అప్రమత్తంగా ఉండాలో తెలుసుకుందాం..

మేష రాశి
చంద్ర- కేతు సంయోగం ప్రభావం మేష రాశి వారిపై తీవ్రంగా పడనుంది. వారి చదువు, ప్రేమ, పిల్లలకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. కుటుంబంలో అశాంతి వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థులు చదువులో ఏకాగ్రత కోల్పోయే ప్రమాదం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిదని గమనించాలి.
వృషభ రాశి
వృషభ రాశి వారి కుటుంబ విషయాల్లో ఉద్రిక్తతలు తలెత్తవచ్చు. కుటుంబీకులతో విభేదాలు ఏర్పడవచ్చు. ఆస్తికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. మనశ్శాంతి కాపాడుకునేందుకు మీకు సంబంధంలేని, అనసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. చట్టపరమైన విషయాలకు దూరంగా ఉండటం మంచిది.

సింహ రాశి
సింహ రాశిలోనే చంద్ర- కేతు సంయోగం జరగుతుండటంతో వీరిపై ఎక్కువ ప్రభావం ఉండవచ్చు. మానసికంగా పలు సమస్యలు ఎదుర్కొంటారు. ఒక్క చోట కుదురుగా ఉండలేరు. తొందరపాటు నిర్ణయాలు, పనులు హాని కలుగజేస్తాయి. ఈ క్రమంలో ఆరోగ్యం, నిద్ర పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం.
వృశ్చిక రాశి
చంద్ర- కేతు కలయిక వృశ్చిక రాశిలో జన్మించిన వారి వృత్తి, వ్యాపార విషయాల్లో ప్రభావం చూపిస్తుంది. ఆఫీసులో ఉద్రిక్త వాతావరణం ఎదుర్కొంటారు. ఆఫీసులో సీనియర్లతో మాట్లాడేటప్పుడు మీ భాషను అదుపులో ఉంచుకుని మాట్లాడాలని గుర్తుంచుకోండి. వ్యాపార రంగంలో ఉన్న వారు పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఆచితూచీ వ్యవహరించాలి.

కుంభ రాశి
కుంభ రాశి వారిపై గ్రహణ ప్రభావం ఉంటుంది. వివాహ జీవితంలో భాగస్వామితో ఇబ్బందులు తలెత్తవచ్చు. చిన్న చిన్న అంశాలపైనే మీ లైఫ్ పార్ట్‌నర్‌తో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారు భాగస్వామితో అపార్థాలను పరిష్కరించుకునేందుకు చర్చలు చేపట్టడం మంచిది. కీలకమైన నిర్ణయాలు తీసుకునేముందు అప్రమత్తంగా ఉండటం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
