Latest Updates
-
నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం! -
భారతదేశంలో బంగారం పారే నదులు ఇవే.. మీకు తెలుసా? -
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి.. -
అందమైన అమ్మాయి పిలిచిందని అర్థరాత్రి రూమ్ కి వెళ్లిన బ్యాంక్ మేనేజర్..తర్వాత ఏమైందంటే..? -
జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి -
Navaratri 2026 Day 2: దసరా నవరాత్రులు 2వ రోజు.. బ్రహ్మచారిణి మాత పూజా విధానం, పురాణ గాథ, మంత్రాలు
మీరు సెప్టెంబర్‌లో జన్మించారా.. మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా.?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు సెప్టెంబర్‌లో జన్మించిన్నట్లయితే.. మీకు కొన్ని నిర్దిష్ట వ్యక్తిత్వ లక్షణాలు ఉంటాయి. ఈ నెలలో పుట్టిన వారిని సాధారణంగానే తెలివైన వారిగా, కష్టపడి పనిచేసే వారిగా, ప్రతిభావంతులుగా పరిగణిస్తారు. ఆకట్టుకునే వ్యక్తిత్వం, సంభాషణ నైపుణ్యంతో ప్రభావం చూపిస్తారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా పరిష్కారాలు కనుగొంటారు. ఇంకా వారిలోని ముఖ్యమైన లక్షణాలు ఏంటో తెలుసుకుందాం..

పనిలో బాధ్యత
సెప్టెంబర్‌లో జన్మించిన వారు తాము చేస్తున్న పని విషయంలో అత్యంత నిశితంగా ఉండటంతో పాటు ఏ బాధ్యతను కూడా అసంపూర్తిగా వదిలివేయరు. చిన్న చిన్న లోపాలను సైతం సరిదిద్దుతారు. ఈ అలవాటు ద్వారా తాము పనిచేస్తున్న రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు.
సమస్యల పరిష్కారంలో ముందుంటారు..
ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలడం ఈ నెలలో పుట్టిన వారి ప్రత్యేక లక్షణం. వ్యక్తిగత సవాలు అయినా, వృత్తిపరమైన సవాలు అయినా.. ఆందోళన చెందకుండా కారణం తెలుసుకుని పరిష్కారంపై దృష్టి సారిస్తారు. ప్రశాంతమైన మనస్సుతో పరిస్థితులను అర్థం చేసుకుంటారు. సరైన మార్గాన్ని కనుగొని సమస్యలను పరిష్కరించడం వారి వ్యక్తిత్వంలోని ప్రత్యేక లక్షణం.
పనిలో నిజాయితీ
సెప్టెంబర్‌లో పుట్టిన వారు తల లక్ష్యాల పట్ల పూర్తి నిబద్ధతతో ఉంటారు. ఒక పనిని పూర్తి చేయాలని నిర్ణయించుకున్న తర్వాత నిరంతర ప్రయత్నాలతో కృషి చేస్తారు. విజయానికి షార్ట్ కట్స్ కంటే కూడా పనిలో కష్టపడి, నిజాయితీగా పనిచేస్తూ ఫలితాన్ని పొందుతారు.

ఆకట్టుకునే సంభాషణ
ఈ నెలలో పుట్టినవారిలో ఆకట్టుకునే మరో అంశం సంభాషణా నైపుణ్యం. వారి మాటలు ఇతరులపై చాలా ప్రభావం చూపిస్తాయి. ఎదుటి వ్యక్తి చెప్పేది శ్రద్ధగా వింటారు. సందర్భానికి తగినట్లుగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. ఆత్మవిశ్వాసంతో మాట్లాడతారు. ఈ సామర్థ్యంతో ఆఫీసు, వ్యాపారం, సొసైటీలో గుర్తింపు సాధిస్తారు.
బంధంలో నిజాయితీ
సెప్టెంబర్‌లో పుట్టినవారిలో మరో ప్రత్యేక లక్షణం, వారు తమ సంబంధాల పట్ల చాలా విధేయులుగా ఉంటారు. కష్ట సమయాల్లో తోడుగా ఉండటంతో పాటు తమ సొంతం అనుకున్నవారికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తారు. నమ్మకం కలిగి ఉండటంతో పాటు పరస్పర అవగాహనతో ఉంటారు. టీమ్ లీడింగ్‌లో రాణస్తారు.
ఎమోషనల్ బ్యాలెన్స్
భావోద్వేగపరంగా బ్యాలెన్స్‌డ్‌గా, ప్రశాంతంగా ఉంటారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ వెంటనే స్పందించకుండా, పరిస్థితిని అర్థం చేసుకోవడానికి యత్నిస్తారు. కోపం, ఒత్తిడి సమయాల్లో ఆత్మనిగ్రహం పాటించడం ద్వారా ధైర్యంగా, బలంగా ఉంటారు. ఈ లక్షణం ద్వారా జీవితంలోని సవాళ్లను సహనంతో ఎదుర్కొంటారు.
విమర్శలను పాజిటివ్‌గా
వీరిలోని మరో ముఖ్య లక్షణం వారి లోపాలను అంగీకరిస్తారు. విమర్శలు ఎదుర్కొన్నప్పుడు వాటిని విస్మరించకుండా దాని నుంచి ఏదైనా నేర్చుకుంటారు. తప్పులను సరిదిద్దుకుంటారు. నిరంతరం తమను తాము మెరుగుపరుచుకుంటారు. ఇది వారి వ్యక్తిత్వంలో ప్రధాన లక్షణం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
