ఈ చిన్న సీక్రెట్ తెలిస్తే..ఇంట్లోనే క్షణాల్లో రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ,సాఫ్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్

Posted By:

ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. పిల్లల నుంచి పెద్దల వరకు అ్ందరూ ఇష్టపడే స్నాక్ లో ఫస్ట్ ప్లేస్ లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటది. మెక్ డొనాల్డ్, కేఎఫ్ సీ వంటి రెస్టారెంట్స్ కు వెళ్తే అక్కడ కరకరతాడే ఫ్రెంచ్ ఫ్రైస్ తింటూ ఉంటే ఆ మజానే వేరు.

అయితే వందల రూపాయల డబ్బులు ఖర్చుపెట్టి రెస్టారెంట్స్ కు వెళ్లే పని లేకుండా చాలా ఈజీగా వీటిని మన ఇంట్లోనే క్షణాల్లో తయారుచేసుకోవచ్చు. అచ్చం రెస్టారెంట్ రుచితో, బయట కరకరలాడుతూ, లోపల మృదువుగా ఉండేలా ఇంట్లోనే ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

crispy outside soft inside restaurant style french fries recipe in telugu

ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు

-బంగాళదుంపలు
-ఉప్పు
-నీళ్లు
-కారం
-ఆయిల్

వంకాయ దోసకాయ పచ్చడి..ఏంట టేస్ట్ రా బాబు మైండ్ నుంచి పోవట్లేదు అనాల్సిందే!

ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీ విధానం

-ముందుగా 2 బంగాళదుంపలను తీసుకొని, పైన చెక్కును తీసేయండి.

-చెక్కు తీసేసిన బంగాళదుంప ముక్కలను నీటిలో వేసి శుభ్రంగా కడగండి. తర్వాత వాటిని ముందు రెండు భాగాలుగా కట్ చేసి వాటి చివరను కట్ చేసి తీసేయండి. తర్వాత బంగాలదుంపలను అర ఇంచు మందంతో స్లైసులుగా కట్ చేసుకోవాలి.

-తర్వాత మళ్లీ ఆ స్టైసులను స్క్వేయర్ షేపులో నిలువుగా కట్ చేసుకోండి.

-తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి, అందులో నిలువుగా కట్ చేసుకున్న బంగాళదుంపలను వేయండి,ఇందులోనే ఉప్పు వేసి కలపండి. నీరు బాగా మరిగిన తర్వాత అందులో నుంచి బంగాళదుంపల స్లైసులను బయటకు తీసేయండి.

-తర్వాత స్టవ్ మీద మరో గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి ఆ నీళ్లల్లో మరిగించిన బంగాళదుంప స్టైసేలను వేసి 80 శాతం వరకు ఉడకనివ్వాలి. బక చాకుతో గుచ్చి చూస్తే అది నీట్ గా దిగితే అది ఉడికినట్లు లెక్క. అప్పుడు జాలి గిన్నెలోకి వాటిని తీసుకుని నీరంతా పోయాక వాటిని ఒక పొడి టవల్ మీద వేసి విడివిడిగా జరిపి ఆరబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిపోయాలి.

-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి 80 శాతం ఆయిల్ వేడయ్యాక అందులో ఒక్కొక్కటిగా వాటిని వేసి మీడియం మంట మీద మాత్రమే వేయించాలి. ఈ ఆయిల్ లో కూడా వాటిని 80 శాతం వరకు మాత్రమే వేయించాలి. తర్వాత వాటిని తీసి టవల్ మీద ఆరబెట్టుకోండి.

-చల్లారిన తర్వాత మళ్లీ స్టవ్ మీద పాన్ లోని ఆయిల్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. ఇలా రెండు సార్లు వేపడం వల్ల లోపల వరకు బాగా వేగి మనం రెస్టారెంట్స్ లో కొన్నవాటిల్లానే టేస్ట్ చాలా బాగుంటుంది.

-వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని, వాటిమీద ఉప్పు, కారం, చాట్ మసాలా చల్లి అంతా కలిసేలా చేత్తో కలుపుకోండి.

-అంతే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Saturday, October 31, 2026, 17:46 [IST]
Desktop Bottom Promotion