మెతుకు మిగల్చకుండా తినే రుచి..తమిళనాడు స్పెషల్ దిండిగల్ తలపకట్టి చికెన్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోండిలా..

Posted By:

మన తెలంగాణ, ఆంధ్రాలో వరల్డ్ ఫేమస్ బిర్యానీలు ఉన్నాయి కానీ తమిళనాడులో చాలా ఎక్కువ రకాల బిర్యానీలు ఉన్నాయి. అందులో ఒక్కొక్కటి చాలా ఢిఫరెంట్ గా, అద్భుతంగా ఉంటాయి. అందులో ఒకటే దిండిగల్ స్పెషల్ తలపకట్టి చికెన్ బిర్యానీ. దీనిని ఒక్క ముద్ద నోట్లో పెట్టకుంటే అద్భుతం, అమోఘం, ఆహో ఓహో కేక అంటూ తినేస్తారు. మెతుకు మిగల్చకుండా తినేయడం ఖాయం.

పొట్టలో గ్యాప్ లేకుండా తినేసేంత రుచిగా ఉంటుంది. సూపర్ టేస్టీ దిండిగల్ స్పెషల్ తలపకట్టి చికెన్ బిర్యానీ ఈ ఆదివారం మీ ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Sunday Special How to Make Dindigul Thalappakatti Biryani at Home Recipe in Telugu

కావాల్సిన పదార్థాలు

చికెన్- 600 గ్రాములు
ఉప్పు- 1 టీస్పూన్
నిమ్మరసం- 2 టీస్పూన్లు
పెరుగు- 1 కప్పు

మసాలా పొడి కోసం:
-దాల్చిన చెక్క
-అనాస పువ్వు
-జాపత్రి
-బిర్యానీ ఆకు
-యాలకలు
-లవంగాలు
-షాజీరా
-జీలకర్ర
-సోంపు
-ధనియాలు
-మిరియాలు
-జీడిపప్పు
-బిర్యానీ ఆకులు

బిర్యానీ కోసం:
-ఉల్లిపాయలు
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-టమాటోలు
-పచ్చిమిర్చి
-పుదీనా
-కొత్తిమీర
-కారం
-చిట్టిముత్యాల రైస్
-ఉప్పు
-నెయ్యి

కరివేపాకు మరమరాలు..మూవీ, వెబ్ సిరీస్ చూస్తూ తినడానికి బెస్ట్ టేస్టీ,హెల్తీ స్నాక్ !

తలపకట్టి చికెన్ బిర్యానీ తయారీ విధానం

-ముందుగా ఒకటిన్నర గ్లాసు చిట్టి ముత్యాల రైస్ నానబెట్టుకోండి.

-తర్వాత 600 గ్రాముల చికెన్ ముక్కలు శుభ్రంగా కడగండి.

-తర్వాత ఒక గిన్నె తీసుకోండి. అందులో చికెన్ ముక్కలు వేయండి,ఇందులోనే 1 టీస్పూన్ ఉప్పు, 2 టీస్పూన్లు నిమ్మరసం, 1 కప్పు పెరుగు వేసి మొత్తం కలిసేలా చేత్తో కలిపి 10 నిమిషాలు పక్కన ఉంచుకోండి.

-ఇప్పుడు బిర్యానీ మసాలా కోసం.. స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకోండి. అందులో 1 ఇంచు దాల్చిన చెక్క, 1 స్టార్ అనాస, జాపత్రి చిన్న ముక్క, 5 యాలకలు, 6 లవంగాలు, అర టీస్పూన్ షాజీరా, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ సోంపు, 1 టీస్పూన్ ధనియాలు, అర టీస్పూన్ మిరియాలు, 10 జీడిపప్పు, 2 బిర్యానీ ఆకులు వేసి తక్కువ మంట మీద 2 నిమిషాలు వేయించాలి. తర్వాత స్టవ్ ఆపేసి వేయించినవన్నీ మిక్సీ గిన్నెలో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.

-తర్వాత స్టవ్ మీద పాన్ లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక అందులో 3 ఉల్లిపాయల పొడవాటి చీలికలు వేసి వేయించాక అందులోనే 3 టీస్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేదాకా వేగిన తర్వాత అందులో 2 టమాటోల ముక్కలు, 3 పచ్చిమిర్చి ముక్కలు, 1 కప్పు పుదీనా, 1 పెద్ద కట్ట కొత్తిమీర వేసి మూతపెట్టి 5 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి.

-5 నిమిషాల తర్వాత మూత తీసి అందులో పావు టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ కారం వేసి కలుపుకోవాలి. టమాటో ముక్కలు మెత్తగా అయ్యాక స్టవ్ ఆపేయండి. చల్లారిన తర్వాత ఈ మెత్తం మిశ్రమాన్ని మిక్సీ గిన్నెలో వేసి పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.

-తర్వాత స్టవ్ మీద బిర్యానీ గిన్నె పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 ఉల్లిపాయ చీలికలు వేసి వేయించాక ఇందులో పక్కన ఉంచుకున్న చికెన్ పెరుగు మిశ్రమం వేసి కలుపుకోవాలి. 10 నిమిషాలు మూతపెట్టి బాగా ఉడికించుకోవాలి.

-10 నిమిషాల తర్వాత మూత తీసి అందులో గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి వేసి కలిపి మూతపెట్టి మరో 2 నిమిషాలు ఉడికించాలి.

-తర్వాత మూత తీసి అందులో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసి కలిపి మూతపెట్టి మరో 3 నిమిషాలు ఉడికించుకోవాలి.

-తర్వాత మూత తీసి అందులో 3 గ్లాసుల వేడి నీళ్లు పోయండి, కొంచెం ఉప్పు వేసేుకుని 5 నిమిషాల బాగా మరిగించి తర్వాత అందులో నానబెట్టుకున్న ఒకటిన్నర గ్లాసు చిట్టిముత్యాల రైస్(జీరా సాంబా రైస్) వేసి ఒకసారి కలిపి 12 నిమిషాలు ఉడికించుకోండి. మధ్యమధ్యలో మూత తీసి కలుపుతుండాలని గుర్తుంచుకోండి.

-అందులో కొంచెం నీళ్లు ఉన్నప్పుడే స్టవ్ ఆపేసి, అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలిపుకోండి. దీంతో ఆ నీటిని అంతా రైస్ పీల్చేసుకుంటది. మూత పెట్టి 15 నిమిషాలు అలా వదిలేయండి.

-తర్వాత మూత తీస్తే తినడానికి వేడి వేడి తలపకట్టి చికెన్ బిర్యానీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Sunday, November 1, 2026, 11:51 [IST]
Desktop Bottom Promotion