తల్లిదండ్రులూ బీ అలర్ట్..పిల్లలకు సిరప్ వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి

సాధారణంగా ఇంట్లో చిన్న పిల్లలు ఉండి వారికి ఏదైనా జ్వరం లేదా జలుబు, దగ్గు వంటివి ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే డాక్టర్ల సలహా మేరకు వారికి సిరప్ లు వేస్తుంటారు. పిల్లల వయస్సుని బట్టి ఏ సిరప్ ఎంత మోతాదులో వేయాలి అనేది డాక్టర్లు సూచిస్తారు, అలాగే పిరస్ బాటిల్ మీద కూడా రాసి ఉంటది.

అయితే చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు సిరప్ వేసేటప్పుడు చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలకు సిరప్ వేసే టైంలో చేసే పొరపాట్లు ఏంటో ప్రముఖ డాక్టర్ జవజాల మనోజ్ణ తెలియజేశారు. వీటిని తెలుుకుని నివారించడం ద్వారా పిల్లల ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు.

Common mistakes parents make when giving syrup to kids dr manogna explains

పిల్లలకు సిరప్ వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి

-చాలామంది పేరెంట్స్ పిల్లలకు సిరప్ వేసేటప్పుడు కప్ లో ఇంకా కొంచెం మిగిలిపోతే దాంట్లో కొంచెం నీళ్లు కలిపి అది కూడా పిల్లలకు తాపిస్తుంటారు. అయితే అలా అస్సలు చేయకూడదని డాక్టర్ మనోజ్ణ చెబుతున్నారు.

-డ్రాపర్ తో పిల్లలకు సిరప్ వేసేటప్పుడు ఆ డ్రాపర్ ని బాటిల్ కే పెట్టేస్తుంటారు. అయితే అలా చేయడం వల్ల సిరప్ మొత్తం కలుషితం అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డ్రాపర్ ని సపరేట్ గా వాష్ చేసి పెట్టుకోవాలి. సంబంధిత మెడిసిన్ బాటిల్ కి దాని తాలుకా మూతనే పెట్టుకోవాలని డాక్టర్ మనోజ్ణ సూచించారు.

క్యాన్సర్ రాకుండా కాపాడే 5 ఆహారాలు ఇవే..క్యాన్సర్ రాకుండా కాపాడే 5 ఆహారాలు ఇవే..

-యాంటీ బయాటిక్ సిరప్స్...పౌడర్ రూపంలో ఉన్నవి వాడేటప్పుడు ఆ బాక్సులోనే వాటర్ ఇస్తారు, ఆ బాటిల్ కు ఒకపైన ఒక గీత ఉంటుంది. ఆ గీత వరకు నీళ్లను మిక్స్ చేసి రోజూ కొంచెం చెప్పున వాడుకోవాలి. ఇలా కలిపిన వారం రోజుల లోపే ఆ యాంటీ బయాటిక్ సిరప్ మొత్తం వాడేసుకోవాలి. ఇంకా ఏమైనా మిగిలితే వాడకండి, పడేసేయడం మంచిదని డాక్లర్ మనోజ్ణ చెప్పారు

-యాంటీ బయాటిక్ సిరప్ కాకుండా మరే రకమైన సిరప్ అయినా సరే ఒకసారి మూత ఓపెన్ చేసిన 1 నెలలోపే దాన్ని వాడేయాలి. ఎక్స్ పైరీ డేట్ ఇంకా ఉంది కదా అని ఒకసారి మూత ఓపెన్ చేసిన నెల రోజుల తర్వాత కూడా వాడకూడదని డాక్టర్ మనోజ్ణ తెలిపారు.

-అన్నింటికన్నా ముఖ్యమైన విసయం ఏంటంటే చాలా సిరప్ లు..యాంటీబయాటిక్స్ లేదా సస్పెన్షన్స్ అడుగున మందు పేరుకుపోతుంది. కాబట్టి సిరప్ పట్టే ముందు ఒకసారి దాన్ని షేక్ చేయడం కూడా మంచిది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Saturday, October 31, 2026, 14:13 [IST]
Desktop Bottom Promotion