వంకాయ దోసకాయ పచ్చడి..ఏంట టేస్ట్ రా బాబు మైండ్ నుంచి పోవట్లేదు అనాల్సిందే!

Posted By:

పచ్చడి అందులోనూ రోటి పచ్చడి ఉంటే నాలుకకు ఆ రో.జు పెద్ద పండగ మాదిరే ఉంటది. వంకాయను చూస్తేనే అందులో పురుగులు ఉంటాయి, నాకు నచ్చదు అని చెప్పేవాళ్లు కూడా ఒక్కసారి వంకాయ దోసకాయ రోటి పచ్చడి తింటే జన్మ జన్మలక ఇదే కావాలంటారు, అంత టేస్టీగా ఉంటది. అంతేకాకుండా దీని తయారీలో వాడే ప్రతి పదార్థం ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేసేదే.

వేడి వేడి అన్నంతో ఈ పచ్చడి వేసుకుని,అందులో కొద్దిగా నెయ్యి కలుపుకు తింటుంటే ఆ ఫీల్ స్వర్గంలా అనిపిస్తుంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే వంకాయ దోసకాయ రోటి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయరీ విధానం ఇక్కడ చూడండి.

Quick Tasty and Healthy Vankaya Dosakaya Roti Pachadi Recipe in Telugu

తయారీకి కావాల్సిన పదార్థాలు

వంకాయలు- 5
టమాటోలు- 2
పచ్చిమిర్చి- 10
దోసకాయ- పావు భాగం
ఉప్పు- తగినంత
కరివేపాకు
చింతపండు- నిమ్మకాయ సైజు అంత
వెల్లుల్లి రెబ్బలు 10
జీలకర్ర 1 టీస్పూన్
కొత్తిమీర

తాలింపు కోసం

నూనె 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు 1 టీస్పూన్
జీలకర్ర 1 టీస్పూన్
శెనగపప్పు 1 టీస్పూన్
మినపప్పు 1 టీస్పూన్
కరివేపాకు 1 రెమ్మ

రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే..

తయారీ విధానం

-ముందుగా వంకాయలను శుభ్రంగా కడగండి. తర్వాత వాటిని ముక్కలుగా కట్ చేసి, ఆ ముక్కలను ఉప్పు కలిపిన నీళ్లల్లో వేయండి.

-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో నూనె వేసి వేడి చెయ్యాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఉప్పు నీళ్లల్లో నుంచి తీసి వంకాయ ముక్కలను వేయండి, ఇందులోనే పచ్చిమిరపకాయలు, టమాటో ముక్కలు, ఉప్పు వేసి కలిపి మగ్గించాలి.

-వంకాయ, టమాటో ముక్కలు మగ్గిన తర్వాత అందులో కరివేపాకు వేసి వేయించి వేయించి స్టవ్ ఆపేయండి.

-తర్వాత ఒక దోసకాయ పైన చెక్కును తీసేసి లోపల గింజలు తీసేయండి. చెక్కు తీసేసిన దోసకాయను ముక్కలుగా కట్ చేసుకోండి.

-తర్వాత రోట్లో నానబెట్టిన చింతపండు, వేయించిన టమాటో వంకాయల మిశ్రమం, ఉప్పు వేసి దంచుకోండి. కచ్చాపచ్చాగా దంచిన తర్వాత అందులో పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి దంచుకోవాలి. చివరగా అందులో కొత్తిమీర, కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసి లైట్ గా దంచుకుంటే సరిపోతుంది.

-ఈ పచ్చడికి తాలింపు కోసం స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాక వేసి వేయించాలి. తాలింపు వేగిన తర్వాత అందులో దంచుకున్న పచ్చడి వేసి కలుపుకోండి. తర్వాత స్టవ్ ఆపేయండి.

-అంతే వంకాయ దోసకాయ రోటి పచ్చడి రెడీ.

[ of 5 - Users]
Story first published: Saturday, October 31, 2026, 15:49 [IST]
Desktop Bottom Promotion