Latest Updates
-
డీప్ ఫ్రై లేని హెల్తీ స్నాక్..సూపర్ టేస్టీ సగ్గుబియ్యం పొంగనాలు ఈజీగా ఇంట్లో చేసుకోండిలా.. -
ఈ చిన్న సీక్రెట్ తెలిస్తే..ఇంట్లోనే క్షణాల్లో రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ,సాఫ్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ -
వంకాయ దోసకాయ పచ్చడి..ఏంట టేస్ట్ రా బాబు మైండ్ నుంచి పోవట్లేదు అనాల్సిందే! -
తల్లిదండ్రులూ బీ అలర్ట్..పిల్లలకు సిరప్ వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి -
భూటాన్ స్పెషల్ ఎగ్ ఏమా దత్షీ..స్వర్గానికి బెత్తెడే దూరం! -
పండుగ రోజే దారుణం..భర్త డోర్ ఓపెన్ చేయగానే ప్రియుడితో సరసాలాడుతూ భార్య..రెండ్ హ్యాండెడ్ గా దొరకడంతో.. -
జలుబు, దగ్గును మాయం చేసే చెట్టినాడ్ ఉల్లిపాయ రసం.. ఈ మసాలాతో చేస్తే టేస్ట్ అదుర్స్! -
రోజూ ఒకే పప్పు బోర్ కొట్టిందా? అయితే ఈ సీక్రెట్ హోటల్ స్టైల్ పప్పు ట్రై చేయండి -
సోయా పుట్టు ఎప్పుడైనా వండుకున్నారా? తస్సాదియ్యా వేడి వేడి అన్నంలో కలిపితే నా సామి రంగా.. -
ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు ఆకుపచ్చ, బ్లూ కలర్ గౌన్స్ మాత్రమే ఎందుకు ధరిస్తారో తెలుసా?
కరివేపాకు మరమరాలు..మూవీ, వెబ్ సిరీస్ చూస్తూ తినడానికి బెస్ట్ టేస్టీ,హెల్తీ స్నాక్ !
స్నాక్స్ గా ఎప్పుడూ అవే బూందీ, మురుకులు, నమ్ కీన్, చిప్స్ తిని తిని బోర్ కొట్టిందా? నోటికి కారం కారంగా, మంచి కిక్ ఇచ్చే స్నాక్ కావాలనుకుంటే కరివేపాకు మరమరాలు ట్రై చేయండి. టీవీ చూస్తూ లేదా ఫోన్ లో మంచి సినిమా, సిరీస్ చూస్తూ ఇది పక్కన పెట్టుకుని తింటుంటే ఒక్కరే మొత్తం తినేయడం గ్యారెంటీ. ఎంత తిన్నా ఇంకా ఇంకా అనిపించేలా ఉంటుంది.
దీనిని చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్. మన వంటగదిలో రెగ్యులర్ గా ఉండే పదార్థాలే తప్ప ఎలాంటి మసాలాలు వాడం. సూపర్ టేస్టీ కరివేపాకు మరమరాలు ఇంట్లో తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

కరివేపాకు మరమరాలు తయారీకి కావాల్సిన పదార్థాలు
-జీడిపప్పు
-పల్లీలు
-కొత్తిమీర
-పచ్చిమిర్చి
-మరమరాలు
-కరివేపాకు
-నూనె
-పసుపు
-ఉప్పు
-నల్ల ఉప్పు
-ఆమ్చూర్ పొడి
డీప్ ఫ్రై లేని హెల్తీ స్నాక్..సూపర్ టేస్టీ సగ్గుబియ్యం పొంగనాలు ఈజీగా ఇంట్లో చేసుకోండిలా..
కరివేపాకు మరమరాలు తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద కడాచి పెట్టుకోండి. అందులో కప్పు నూనె వేసి వేడయ్యాక అందులో అర కప్పు వేరుశెనగపప్పు(పల్లీలు)వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత అదే నూనెలో కావాల్సినన్ని జీడిపప్పులు కూడా వేసి ఎర్రగా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత 6 పచ్చిమిరపకాయలకు గాట్లు పెట్టి వాటిని పాన్ లోని నూనెలో వేసి ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత పాన్ లోని నూనెలోనే 1 కట్ట కొత్తిమీర కాడలతో సహా వేసి ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత పాన్ లోని ఆయిల్ లో కడిగి ఆరబెట్టుకున్న 1 కప్పు(2 గుప్పెళ్ల) కరివేపాకు అందులో వేసి ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి.
-మిక్సీ జార్ లో వేయించిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద మరో బాండీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి మంటను తక్కువలో ఉంచి అందులో పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ ఉఫ్పు, నల్ల ఉప్పు అర టీస్పూన్, ఆమ్చార్ పొడి అర టీస్పూన్ వేసి మిక్సీ చేసుకున్నాక అందులో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకుని ఫ్రై చేసుకుని స్టవ్ ఆపేయండి.
-ఇప్పుడు బాండీలో 3 పెద్ద కప్పుల మరమరాల వేసి మొత్తం కలిసేలా కలుపుకోండి. తర్వాత అందులోనే ఫ్రై చేసుకున్న పల్లీలు, జీడిపప్పు వేసి కలుపుకోవాలి.
-అంతే కరివేపాకు మరమరాలు రెడీ.
-వీటిని డబ్బాలో నిల్వ చేసుకుంటే 5 రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
