Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు అధిపతిగా సూర్యభగవానుడిని పరిగణిస్తారు. శని దేవుడిని కర్మ, న్యాయానికి కారకుడిగా చెబుతారు. ఈ రెండిటి మధ్య తండ్రీకొడుకుల బంధం ఉన్నా.. స్వభావాల్లో తేడా కారణంగా పరస్పర శత్రువులుగా జ్యోతిష్యం చెబుతోంది. అందుకే మీ జాతకంలో లేదా గోచారంలో ఈ రెండు గ్రహాలు నిర్దిష్ట స్థానంలో ఉంటే ఆ ప్రభావం అనేది కొన్ని రాశులపై పడుతుంది. ఇప్పటికే సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించడంతో నెలరోజుల పాటు అక్కడే ఉండనున్నాడు. ఇంకా ఈ రెండు గ్రహాల మధ్య సమసప్తక యోగం ఏర్పడింది. ఈ రెండూ ఏడవ స్థానంలో ఉండటంతో ఈ మూడు రాశుల వారికి వృత్తి, ఆరోగ్యే, ఆర్థికం, కుటుంబ వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తనున్నాయి. అవేంటి.. పరిహారాలేంటి.. చూద్దాం..

మేషరాశి
ఈ రాశి వారికి తమ జాతకం ప్రకారం సూర్యుడు ఆరవ పాదంలో, శని ఏడవ పాదంలో ఉండటంతో రెండూ ఎదురెదురుగా వచ్చాయి. దీంతో ఉద్యోగ బాధ్యతల్లో ఈ రాశి వారు ఒత్తిడి ఎదుర్కోవచ్చు. సహోద్యోగులతో అభిప్రాయ భేదాల కారణంగా పనిలో వేగం తగ్గవచ్చు. వ్యాపారస్థులు భాగస్వాములతో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యపరంగా జీర్ణ సమస్యలు, తలనొప్పి రావచ్చు. ప్రశాంతత కోసం వ్యాయామం, ధ్యానం, యోగా చేయడం మంచిది.
ఈ రాశి వారు శని ప్రభావం నుంచి పరిహారం పొందేందుకు ప్రతి రోజూ ఉదయం రాగి పాత్రలో సూర్య భగవానుడికి నీటిని సమర్పించి ప్రార్థించండి.

తులా రాశి
తులా రాశి వారి జాతకంలో సూర్యుడు పన్నెండో స్థానంలో, శని ఆరవ స్థానంలో ఉండటంతో వీరి కష్టానికి తగిన ప్రతిఫలం అందకపోవచ్చు. ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు ఆలస్యం అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో సంయమనం అవసరం. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వహించకూడదు. పబ్లిక్‌లో మాట్లాడేటపప్పుడు, గ్రూప్ డిస్కషన్స్ సమయంలో ఓర్పుగా ఉండండి. ఆలోచించకుండా మాట్లాడితే వివాదాలకు దారితీయవచ్చు. సమాజంలో మీ ప్రతిష్ఠ దెబ్బతినవచ్చు.
పరిహారం కోసం శివ నామస్మరణ, మంత్రాలను జపిస్తూ శివారాధనలో ఉండటం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

మీన రాశి
శని ఇప్పటికే మీన రాశిలో ఉండగా, సూర్యుడు కన్యారాశిలోకి రాగానే వీరి జాతకంలో ఏడవ స్థానంలోకి వస్తుంది. ఈ ప్రభావం కారణంగా జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాలపై గొడవలు, మనస్పర్థలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే మాట్లాడేటప్పుడు ఓపికగా ఉండటం మంచిది. అనసరమైన వాదనలు చేయకపోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఉద్యోగులు మీ బాధ్యతలను సక్రమంగా పూర్తి చేయండి. ఉన్నతాధికారులు మీ పనితీరును గమనిస్తూ ఉంటారు. ఆరోగ్యపరంగా ఒత్తిడి, నిద్ర లేమి ఉండవచ్చు.

మనశ్శాంతి, పాజిటివిటీ కోసం ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో గాయత్రీ మంత్రాన్ని జపించడం ద్వారా మేలు జరుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
