ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి!

ప్రతి ఒక్కరి లైఫ్ లో పెళ్లి అనేది అత్యంత ముఖ్యమైన, మధురమైన ఘట్టం. గతంలో ఒక్కరిని పెళ్లి చేసుకుంటే కష్టమో,సుఖమో జీవితాంతం వారితోనే కలిసి ఉండేవాళ్లు. అయితే కాలం మారింది..ఇప్పుడు పెళ్లి పీటల మీద నుంచి ఇంటికి వెళ్లే లోపే విడాకులు తీసుకుంటున్న ఘటనలు చాలా చూస్తున్నాం. .

కొందరు జీవితాంతం ఒకే భాగస్వామితో సంతోషంగా గడిపితే, మరికొందరు అనుకోని పరిస్థితుల వల్ల లేదా మొదటి వివాహంలో ఎదురైన చేదు అనుభవాల వల్ల రెండో పెళ్లికి సిద్ధపడతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు రెండో పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఆ రాశులేమిటో, వారి మనస్తత్వం ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి.

Second Marriage in Astrology 4 Zodiac Signs Most Likely to Remarry

వృషభ రాశి

ప్రేమ, అందానికి ప్రతీక అయిన శుక్ర గ్రహం వృషభ రాశిని పాలిస్తుంది. ఈ రాశి వారు తమ బంధాల్లో స్థిరత్వాన్ని, భద్రతను అమితంగా కోరుకుంటారు. పెళ్లి తర్వాత భాగస్వామికి వీళ్లు భాగస్వామికి చాలా నమ్మకంగా ఉంటారు. అయితే, తమ వ్యక్తిగత ఆనందం, భద్రత విషయంలో వీరు ఏమాత్రం రాజీపడరు. మొదటి పెళ్లిలో తాము ఆశించిన ప్రేమ, ప్రశాంతత దక్కకపోతే వీరు తీవ్రంగా నిరాశపడతారు. తమకు సరైన భద్రతను, సంతోషాన్ని అందించే భాగస్వామి దొరికితే, పాత గాయాలను మర్చిపోయి రెండో పెళ్లి చేసుకోవడానికి వీరు ఏమాత్రం వెనుకాడరు.

బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి!బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి!

తులా రాశి

తులా రాశికి కూడా శుక్రుడే అధిపతి. వీరు వైవాహిక బంధంలో సమతుల్యతను, సామరస్యాన్ని (బ్యాలెన్స్) ఎక్కువగా ఇష్టపడతారు. గొడవలు, అపార్థాలతో కూడిన బంధంలో ఇమడలేరు. మొదటి పెళ్లిలో తాము కోరుకున్న ప్రశాంతత లోపించిందని భావిస్తే, ఆ బంధం నుండి బయటకు వచ్చేస్తారు. తమ మనసును అర్థం చేసుకుని, జీవితంలో ప్రశాంతమైన వాతావరణాన్ని అందించగల సరైన భాగస్వామి కోసం వెతికి, రెండో పెళ్లికి సుముఖత చూపుతారు.

వృశ్చిక రాశి

కుజుడు ప్రభావం ఉండే వృశ్చిక రాశి వారు చాలా భావోద్వేగమైన వ్యక్తులు. వీరు ప్రేమను, సాన్నిహిత్యాన్ని చాలా తీవ్రంగా కోరుకుంటారు. పెళ్లిలో కేవలం బాధ్యతలు మాత్రమే కాదు, తమకు తగిన గుర్తింపు, అంతులేని ప్రేమ కావాలని ఆశిస్తారు. మొదటి వివాహంలో భాగస్వామి తమ భావోద్వేగాలను అర్థం చేసుకోకపోయినా, తగిన గుర్తింపు ఇవ్వకపోయినా వీరు తట్టుకోలేరు. తమలోని గాఢమైన ప్రేమను పంచుకోవడానికి, తమను పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తి కోసం వీరు రెండో పెళ్లి వైపు అడుగులు వేస్తారు.

ధనుస్సు రాశి

బృహస్పతి పాలించే ధనుస్సు రాశి వారు స్వేచ్ఛా ప్రియులు. వీరికి వైవాహిక జీవితం అందించే సంతోషం కంటే, వ్యక్తిగత స్వేచ్ఛే ఎక్కువ ముఖ్యం. సంప్రదాయబద్ధమైన పెళ్లి పేరుతో తమపై ఆంక్షలు విధిస్తే వీరు ఊపిరి ఆడనట్లుగా భావిస్తారు. మొదటి పెళ్లిలో తమ స్వేచ్ఛకు భంగం కలుగుతోందని, కట్టడి చేస్తున్నారని అనిపిస్తే వెంటనే ఆ బంధానికి స్వస్తి పలుకుతారు. తమ లక్ష్యాలను, స్వేచ్ఛను గౌరవిస్తూనే తోడుగా నిలిచే వ్యక్తిని ఎంచుకుని రెండో వివాహం చేసుకోవడానికి వీరు ఆసక్తి చూపిస్తారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Desktop Bottom Promotion