Latest Updates
-
మైసూర్ స్టైల్ రసం రెసిపీ.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే గ్లాసులోనే లాగించేస్తారు.! -
రోజూ ఈ టైంలో నిద్రపోయే అలవాటుందా.. లక్ష్మీదేవి నిలవాలంటే ఈ పొరపాట్లు అస్సలు వద్దు.! -
బ్రిటిష్ కాలం నాటి కోల్క్తా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ పనీర్ కతీ రోల్.. ఇంట్లోనే ఈజీగా.! -
హెల్తీ కదా అని డ్రై ఫ్రూట్స్ ఇష్టారీతిన తింటున్నారా.. ఎక్కువగా తింటే ఎంత ప్రమాదమో తెలుసా.? -
ఎముకల పటుత్వాన్ని పెంచే గోంగూర నల్లి బొక్కల మటన్ కూర.. రాగి ముద్దతో సూపర్ కాంబో.! -
Sunday Recipe: చికెన్ ముక్క.. మసాలా చిక్క..ఆహా అనిపించే పంజాబ్ స్టైల్ చికెన్ గ్రేవీ -
గ్యాస్ ప్రాబ్లమ్‌కి చెక్ పెట్టే హెల్తీ టమాటా పొంగల్.. బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పనిసరిగా ఉండాల్సిందే.! -
మద్యపానం కొందరికి వ్యసనమైతే.. మరికొందరికి ఎందుకు కాదు.. సన్నీడియోల్ అనుభవం ఇదే.! -
సొంత రాశిలోకి శుక్ర గ్రహ సంచారం: ఈ నాలుగు రాశుల వారికి కనీవినీ ఎరుగని రీతిలో అదృష్టం -
నేపాల్ వరదల్లో చేతివాటం.. మృతదేహం నుంచి బంగారం చోరీ.. వైరల్ వీడియో.!
సెప్టెంబర్ 2026 రాశి ఫలాలు: వీరి అదృష్టం మారబోతుంది.. 12 రాశుల ఫలితాలివే.!
రేపటి నుంచి సెప్టెంబర్ నెల ప్రారంభం కానుంది. ఈ నెలలో అనేక ప్రధాన గ్రహాలు రాశులు మార్చుకోనున్నాయి. సెప్టెంబర్ 2న శుక్రుడు తులారాశిలోకి, 7న బుధుడు కన్యారాశిలోకి, 17న సూర్యుడు కన్యారాశిలోకి, 18న కుజుడు కర్కాటక రాశిలోకి, 26న బుధుడు తులారాశిలోకి సంచరించనున్నాడు. ఈ నెల మొత్తం మీనరాశిలో శని వక్రగతిలో ఉండనుంది. రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి శుభసూచకం కాగా, మరికొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు తీసుకురానున్నాయి. మరి 12 రాశుల వారికి సెప్టెంబర్ జాతకం ఎలా ఉంటుందో చూద్దాం..

మేష రాశి
సెప్టెంబర్ నుంచే మేషరాశికి అదృష్టం కలిసి రానుంది. మొదటివారంలో అనుకున్న పనులు పూర్తవుతాయి. కెరీర్, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. స్వదేశంలో, విదేశంలో ఆనందం, మద్దతు, సహకారం లభిస్తుంది. కుటుంబీకులతో సమయం గడుపుతారు. అయితే ఈ రాశి వారు నెల మధ్యలో తమ బద్ధకాన్ని వీడి కష్టపడి పనిచేయాలి. పనిలో ఏకాగ్రత అవసరం. అధికారంలో ఉన్న వారి నుంచి మద్దతు కారణంగా పెండింగ్ పనులు పూర్తవుతాయి. నెల మూడోవారంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అవసరం. నెలాఖరుకి పరిస్థితులు గాడిలో పడతాయి. ప్రతిరోజూ కనకధార స్తోత్రాన్ని పఠిస్తూ దుర్గాదేవికి ఎర్రటి పువ్వులను సమర్పించి పూజించడం మంచిది.

వృషభ రాశి
సెప్టెంబర్ నెల వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అుభవించనుంది. చేస్తున్న పనిలో అత్యంత శ్రద్ధ వహించాలి. మీ వెనుకే ఉన్న శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదం అనిపించే పనులకు దూరంగా ఉండండి. రిలేషన్‌షిప్‌లో హుందాతనాన్ని పాటించాలి. ప్రేమయినా, పెళ్లయినా భావోద్వేగాలకు విలువ ఇవ్వాలి. డబ్బును, సమయాన్ని, మీ ఎనర్జీని తెలివిగా వాడుకోవాలి. ప్రణాళికాబద్ధంగా, శ్రద్ధగా పనులు చేయండి. నెల మధ్యలో వృత్తి, వ్యాపార సమస్యలు ఆందోళన కలిగించవచ్చు. ఇతరుల సహాయంతో పనులు విజయవంతంగా పూర్తిచేసుకోవచ్చు. శ్రీ కృష్ణ భగవానుడిని పూజిస్తూ శ్రీ కృష్ణాష్టకాన్ని పఠించడం ద్వారా మనశ్శాంతిని పొందవచ్చు.
మిథునం
మిథున రాశి వారికి సెప్టెంబర్ నెల అన్ని విధాలుగా కలిసిరానుంది. వృత్తి, వ్యాపారాల్లో కోరుకున్న విజయాన్ని సాధిస్తారు. వ్యాపార పర్యటనలు కలిసివస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లు మీకు అనుకూలంగా ఉంటాయి. కానీ రెండో వారం ఆరోగ్యం, సంబంధాల విషయంలో ప్రతికూల పరిస్థితులు వస్తాయి. భావోద్వేగాలు, ఆవేశపూరిత నిర్ణయాలకు లోను కాకండి. ఊహించని ఖర్చులు ఆర్థిక పరిస్థితిని దిగజారుస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రతిరోజూ శమీ ఆకులతో గణేశుడిని పూజించి పారాయణం చేయండి.
కర్కాటకం
ఈ రాశి వారికి సెప్టెంబర్ మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఒడుదొడుకులు ఎదురుకావచ్చు. ఆరంభంలో అనుకూలంగా ఉండి పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఉద్యోగం, వ్యాపారంలో ఆర్థిక లాభాలు చూస్తాయి. అయితే రెండోవారంలో కొన్ని ఇబ్బందులు పడొచ్చు. ప్రత్యర్థుల ప్రణాళికలతో జాగ్రత్త. అయితే నెల మధ్యలో అదృష్టం కలిసి రావడంతో పనులు ఊపందుకుంటాయి. ఆస్తి వివాదాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. ప్రతిరోజూ శివలింగానికి జలాభిషేకం చేసి, రుద్రాష్టకాన్ని పఠించడం ప్రయోజనకరం.

సింహరాశి
సింహరాశి వారికి సెప్టెంబర్ సాధారణంగానే ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగంలో ఊహించని సవాళ్లు ఎదుర్కొంటారు. ముఖ్యమైన పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి. కుటుంబీకుల నుంచి మద్దతు, సహకారం పొందుతారు. రెండోవారం వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. నెల మధ్యలో ఊహించని ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు. వాతావరణ మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. తెలివితేటలు, విచక్షణ ద్వారా లక్ష్యాలను సాధించగలరు. ప్రతిరోజూ సూర్యభగవానుడిని పూజిస్తూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి.
కన్యారాశి
కన్యారాశి వారికి సెప్టెంబర్ సంతోషం, దుఃఖం రెండింటినీ ఇస్తుంది. కొన్నిసార్లు పనులు సజావుగా పూర్తయినా, మరికొన్ని ఊహించని అడ్డంకులను తీసుకువస్తాయి. నెల ప్రారంభంలో అన్నీ కలిసివస్తాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. అదనపు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నెల మధ్యలో వ్యాపారంలో ఒడుదొడుకుల కారణంగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. విద్యార్థులకు ఈ నెల కలిసి రానుంది. ప్రతిరోజూ హనుమంతుని పూజించేటప్పుడు శ్రీ సుందరకాండను పఠించండి.
తులారాశి
తులారాశి వారు సెప్టెంబర్ నెలలో సంయమనం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలి. ఊహించని గొప్ప ఫలితాలు సాధిస్తారు. విజయం, లాభం సాధించేందుకు కృషి, పట్టుదల అవసరం. ఇబ్బందులు ఎదుర్కొన్నా కుటుంబీకుల మద్దతు అందుకుంటారు. సహోద్యోగులతో స్నేహపూర్వక సంబంధం ఉంటుంది. అనవసరమైన గొడవలకి దూరంగా ఉండండి. అధిక పని భారంతో శారీరక, మానసిక అలసట పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. ప్రతిరోజూ స్ఫటిక శ్రీ యంత్రాన్ని పూజించి, శ్రీ సూక్తాన్ని పఠించడం మేలు చేస్తుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు ఈనెలలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఊహించని ఖర్చులు బడ్జెట్‌ను తలకిందులు చేస్తాయి. విద్యార్థులు చదువుపై ఆసక్తి కోల్పోవచ్చు. పని నిమిత్తం సుదూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వైవాహిక లేదా ప్రేమ సంబంధాలైనా, మీ సంబంధాలలో నిజాయితీగా ఉండటం మంచిది. హనుమంతుడిని పూజిస్తూ హనుమనాష్టకాన్ని పఠించండి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ ఆనందం, అదృష్టాన్ని తీసుకువస్తుంది. జీవితంలో పురోగతి సాధించే అవకాశాలు దొరుకుతాయి. పెండింగ్ ప్రాజెక్టులు ఊపందుకుంటాయి. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. ప్రయాణాల్లో వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజూ కుంకుమ తిలకం పెట్టుకుని, విష్ణు సహస్రనామం పఠిస్తూ విష్ణుమూర్తిని పూజించడం శ్రేయస్కరం.

మకర రాశి
మకర రాశి వారు ఈ నెలలో ఆశించిన విజయాలు పొందుతారు. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. ఆర్థిక లావాదేవీలను జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. పెద్దవారి సలహాలను విస్మరించకండి. అదృష్టం కలిసి వస్తుంది. ఓపిక, విచక్షణ అవసరం. ప్రతిరోజూ శివ భగవానుడికి చేసే ప్రార్థనల సమయంలో శివ మహిమ్న స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ నెల కొన్ని సార్లు అనుకూలంగా, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. పోటీదారులను అధిగమిస్తారు. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. నెల రెండో వారంలో మాటల్లో సంయమనం అవసరం. వ్యాపారవేత్తలు నష్ట భయం ఉన్న వాటిలో పెట్టుబడులు పెట్టకండి. ఇతరులపై, అదృష్టంపై కాకుండా మీ కష్టాన్ని, పట్టుదలను నమ్ముకోండి. ప్రతిరోజూ హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసా పఠించండి.
మీన రాశి
మీన రాశి వారు ఈ నెలలో లక్ష్యాలను సాధించేందుకు చాలా కష్టపడాలి. ఇతరులతో గౌరవంగా ఉండండి. ప్రేమ, వైవాహిక జీవితంలో విశ్వాసంగా ఉండండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేముందు శ్రేయోభిషాషుల సలహా తీసుకోండి. నెల మధ్య నుంచి ఒడుదొడుకులు ఎదుర్కొంటారు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడవచ్చు. విద్యార్థులకు, ఉన్నత విద్య అభ్యసించాలనుకునేవారికి కలిసి వస్తుంది. ప్రతిరోజూ సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించి, సూర్యాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications