Latest Updates
-
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే -
ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్ జెండర్ -
ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! -
చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. -
చలికాలంలో వెచ్చగా, రుచిగా మహారాష్ట్ర స్పెషల్ టమాటా సూప్.. ఇంట్లోనే సులభంగా చేసుకోండి! -
చలికాలంలో వెచ్చదనాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే మిల్లెట్ కూరగాయల సూప్..ఈజీగా ఇంట్లో చేసుకోండిలా.. -
టీ తాగే వేళలో తినడానికి బెస్ట్ హెల్దీ స్నాక్..తక్కువ సమయంలో,తక్కువ నూనెతో మఖానా టిక్కీ చేసుకోండిలా.. -
మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లకి లివర్ ప్రాబ్లమ్ ముప్పు ఎక్కువో తెలుసా? -
ఒమేగా 3 పుష్కలంగా ఉండే అవిసె గింజల లడ్డూ.. చలికాలంలో రోజుకొకటి తింటే ఆశ్చర్యపరిచే ఆరోగ్య ప్రయోజనాలు -
ఓడియమ్మ: బాత్రూమ్ లో భారీ కొండచిలువ ఫొటో.. నిజమని నమ్మి 48 గంటలు గాలించారు, చివరికి చూస్తే..
మూత్ర విసర్జన చేసిన వెంటనే మళ్లీ టాయిలెట్ కు వెళ్లాల్సి వస్తోందా? అసలు కారణాలు ఇవే!
మీరు టాయిలెట్ కు వెళ్లి వచ్చిన కొద్ది నిమిషాలకే మళ్లీ మూత్ర విసర్జన చేయాలనే కోరిక కలుగుతోందా? రోజూ ఇలాంటి ఇబ్బందిని చాలామంది ఎదుర్కొంటుంటారు. సాధారణంగా ఎక్కువ నీరు త్రాగినప్పుడు ఇలా జరగడం సహజమే. కానీ అలా కాకపోయినా ఈ సమస్య నిరంతరం కొనసాగుతుంటే మాత్రం దానిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. దీని వెనుక కొన్ని ఆరోగ్య కారణాలు ఉండవచ్చని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అసలు కారణాలేంటి?
డాక్టర్ల ప్రకారం..అతి చురుకైన మూత్రాశయం, మూత్ర ఇన్ఫెక్షన్ లేదా మూత్ర నాళంలో అడ్డంకి వంటి కారణాల వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. సాధారణంగా మూత్రాశయంలో మూత్రం నిండిన తర్వాతే టాయిలెట్ కు వెళ్లమని మెదడుకు సంకేతం అందుతుంది. కానీ అతి చురుకైన మూత్రాశయం ఉన్నవారిలో కండరాలు అకాలంగా సంకోచించి, మూత్రాన్ని నిలుపుకోవడానికి ఒత్తిడిని సృష్టిస్తాయి. దీనివల్ల మూత్రం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, అకస్మాత్తుగా తీవ్రమైన కోరిక కలుగుతుంది. ఫలితంగా విసర్జన చేసిన కొద్ది నిమిషాలకే మళ్లీ వెళ్లాలనిపిస్తుంది.

వయసు, ఇతర అనారోగ్యాల ప్రభావం
అతి చురుకైన మూత్రాశయ సమస్య సాధారణంగా వృద్ధాప్యంలో, ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఇది చిన్న వయస్సు వారిలోనూ సంభవించవచ్చు. ఒకవేళ తరచుగా మూత్ర విసర్జనతో పాటు మంట, నొప్పి లేదా పొత్తికడుపులో అసౌకర్యం ఉంటే అది మూత్ర నాళ ఇన్ఫెక్షన్ కావొచ్చు. అలాగే షుగర్ ఉన్నవారిలోనూ తరచుగా మూత్ర విసర్జన సమస్య కనిపించవచ్చు.

డాక్టర్ ని ఎప్పుడు సంప్రదించాలి?
మీకు తరచుగా మూత్ర విసర్జన చేయాలనే కోరిక కలగడం, రాత్రిపూట నిద్రలోంచి మెలకువ రావడం, లేదా విసర్జన చేసిన తర్వాత కూడా మీ మూత్రాశయం ఖాళీ కాలేదని అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్ కి సంప్రదించాలి. లక్షణాలను బట్టి డాక్టర్లు మీకు మూత్ర పరీక్షతో పాటు, మూత్ర విసర్జన చేసిన తర్వాత మీ మూత్రాశయంలో ఇంకా ఎంత మూత్రం మిగిలి ఉందో తెలుసుకోవడానికి తగిన పరీక్షలు చేయమని సిఫార్సు చేయవచ్చు.
డాక్టర్ల సలహా మేరకు తీసుకునే ట్రీట్మెంట్ తో పాటు బ్లాడర్ ట్రైనింగ్, పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు చేయడం వల్ల కొంతమంది రోగులకు మంచి ప్రయోజనం చేకూరుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
