Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ఈనెల 29 నుంచి ఈ రాశుల వారి జీవితాలు మారనున్నాయి.. ఈ పని చేస్తే మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు!
నవగ్రహాల్లో శని గ్రహం అత్యంత శక్తివంతమైనదని మనందరికీ తెలిసిందే. శని గ్రహం వ్యక్తి జీవితాన్ని బాగు చేయడంతో పాటు.. ఆ జీవితంలో కష్టాలకు కూడా కారణమవుతుంది. శని చాలా నెమ్మదికగా కదిలే గ్రహం కావడం వల్ల.. ఏదైనా రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి నుంచి బయటికి వచ్చేందుకు చాలా సమయం తీసుకుంటారు.
అయితే ప్రస్తుతం శనిగ్రహం పలు రాశుల వారిపై తన అనుగ్రహం చూపిస్తున్నారు. ఈనెల 29వ తేదీ నుంచి నవంబర్ 6వ తేదీ వరకు బుధ, శుక్ర గ్రహాలు వృచ్చిక రాశిలో యుతి చెందనున్నారు. ఈ క్రమంలో కుంభరాశిలో ఉన్న శని పూర్ణదృష్టి ఈ గ్రహాలపై పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూలమైన కాలం ఉండనుంది. ఇంతకీ ఆ రాశులు ఏంటి, ఏ ఏ రాశుల వారికి శని అంగ్రహం కలగనుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభం: ఈ రాశికి అధిపతి బుధుడు. అయితే శుక్రుడు, శనీశ్వరుడి యుతి కారణంగా ఈ రాశివారికి అత్యంత శుభకాలం నడవనుంది. దీంతో వృషభరాశి వారు చేపట్టబోయే విజయవంతమవుతాయి. ఆర్ధిక మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారా, వృత్తికి సంబంధించిన ఒత్తిళ్ల నుంచి పూర్తిగా విముక్తి లభించడంతో ప్రశాంతమైన జీవితం గడిపే అవకాశం ఉంది. ప్రతి రంగాల్లోని వారికీ సమాజంలో గౌరవ మర్యాదలు పెరగనున్నాయి. ఊహిచిందాని కంటే ఎక్కువగా స్థాయిలో గుర్తింపు, సంతృప్తి లభించనుంది.
సింహం: బుధ, శుక్ర, శని గ్రహాల యుతి ఏర్పడడం, వీక్షణం కావడం వల్ల సింహరాశి వారికి చాలా శుభసూచికం అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఉద్యోగం విషయంలో అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్‌తో పాటు జీతం కూడా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకడం, విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వారి ప్రయత్నాలు ఫలించడం వంటివి జరుగుతాయి. అలాగే వృత్తి వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆర్ధిక రాబడి మార్గాలు పెరుగుతాయి.
తుల: ఈ రాశివారికి బుధ, శుక్ర గ్రహాలు ద్వీతీయ స్థానంలో సంచరిస్తున్నాయి. అలాంటి సమయంలో శనిగ్రహ ద్రుష్టి ఈ రాశివారిపై పడడంతో.. తులారాశి వారి కెరీర్ ఈ పదిరోజుల పాటు అత్యంత వైభవంగా కొనసాగుతుంది. ఈ మూడు గ్రహాలూ ఈ రాశివారికి అత్యంత అనుకూలమైన గ్రహాలే కావడంతో.. తులారాశి వారికి ఆదాయం పరంగా బాగా కలిసి వస్తుంది. ఏ కార్యం తలపెట్టినా అది విజయవంతమై తీరుతుంది. గృహ, వాహన సౌఖ్యం ఏర్పడనుంది. ఆస్తి సమస్యలు పరిష్కారమై ఆస్తి దక్కే ఛాన్సుంది.
మకరం: ఈ రాశివారికి శనీశ్వరుడు ధన స్థానంలో సంచరిస్తున్నాడు. అయితే అదే సమయంలో లాభ స్థానంలో ఉన్న బుధ, శుక్ర గ్రహాలతో శనీశ్వరుడితో యుతి ఏర్పడడం వల్ల.. ఈ రాశి వారికి రావాల్సిన సొమ్ము వస్తుంది. షేర్ మార్కెట్‌లో రాణిస్తారు. ఆదాయ మార్గాలు అమితంగా పెరుగుతాయి. ఉద్యోగంలో వేతనాలు పెరగనున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఆకస్మిక ధనలాభం చేకూరే అవకాశం ఉంది. కొన్ని పరిచయాలు లాభదాయకంగా మారనున్నాయి.
కుంభం: ప్రస్తుతం శనీశ్వరుడు కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. అదే సమయంలో ఈ రాశి వారిలో దశమ స్థానంలో సంచరిస్తున్న బుధ, శుక్ర గ్రహాలతో శనికి యుతి ఏర్పడడం వల్ల.. ఈ రాశివారికి ఉద్యోగ పరంగా అత్యంత అనుకూల కాలం ఉండనుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారికి ఆర్ధిక సమస్యల నుంచి విముక్తి లభించి క్రమంగా ఒత్తిళ్ల నుంచి దూరం అవుతారు. ప్రముఖులతో ఏర్పడే సాన్నిహిత్యం లాభదాయకంగా మారనుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
