Latest Updates
-
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే..
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే?
జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని కర్మ ఫలదాతగా, న్యాయాధికారిగా పరిగణిస్తారు. శని.. మకర, కుంభ రాశులకు అధిపతి. ఒక రాశిలో సుమారు రెండున్నర సంవత్సరాల పాటు సంచరించే శని దేవుడు, తరచుగా తన నక్షత్రాన్ని కూడా మారుస్తుంటాడు.
ప్రస్తుతం మీన రాశిలో, రేవతి నక్షత్రంలో సంచరిస్తున్న శని.. అక్టోబర్ 9వ తేదీన వక్ర (తిరోగమన) దశలో తన స్వంత నక్షత్రమైన ఉత్తరాభాద్ర (ఉత్తరత్తి) నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఫిబ్రవరి 8,2027 వరకు శని ఇదే నక్షత్రంలో ఉంటాడు. తన స్వంత నక్షత్రంలో శని సంచారం చేయడం ఏ రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటదో చూడండి.

మేష రాశి
సాధారణ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలపై పూర్తి ఏకాగ్రత పెట్టాలి. ప్రతి నిర్ణయాన్ని ఆచితూచి తీసుకోవడం ఉత్తమం. పని నిమిత్తం చేసే ప్రయాణాలు మీకు ఆర్థికంగా లాభిస్తాయి, ఆశించిన విజయాలు దక్కుతాయి.
వృషభ రాశి
కనకవర్షం కురిసే అవకాశం ఉంది. ఆర్థికంగా అద్భుతమైన లాభాలు వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. దాంపత్య జీవితం ఆనందమయంగా ఉంటుంది. నలుదిక్కుల నుంచి శుభవార్తలు వింటారు.
మిథున రాశి
పురోగతికి అద్భుతమైన అవకాశాలు ఉన్నప్పటికీ, పనిభారం చాలా పెరుగుతుంది. సుదూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఆఫీసులో అదనపు బాధ్యతలు మీలోని కష్టపడే తత్వాన్ని పెంచి, ఆర్థికంగా మిమ్మల్ని ఉన్నత స్థితికి చేరుస్తాయి.
కర్కాటక రాశి
విజయాల పరంపర మొదలవుతుంది. నిరుద్యోగుల కల నెరవేరుతుంది, ఆశించిన ఉద్యోగం వస్తుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. మీ కష్టానికి తగిన అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది.
సింహ రాశి
సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి. కార్యాలయంలో మీ పనితీరుకు ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. పెండింగ్ ఉన్న డబ్బు చేతికి వస్తుంది. ఒంటరిగా ఉన్నవారికి తగిన జీవిత భాగస్వామి దొరికే సువర్ణ అవకాశం ఉంది.
కన్య రాశి
ఏ పనిలోనూ తొందరపాటు పనికిరాదు. అయితే మీరు వేసే పెద్ద ప్రణాళికలు మాత్రం సక్సెస్ అవుతాయి. పిల్లల వైపు నుంచి సంతోషం కలిగించే వార్తలు వింటారు. అడుగడుగునా అప్రమత్తంగా ఉంటూ ముందుకు సాగాలి.
తులా రాశి
అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ కష్టానికి ఊహించని ప్రతిఫలం దక్కుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు, వ్యాపారులకు విశేష లాభాలు సిద్ధిస్తాయి. కెరీర్ పరుగెత్తుతుంది, విజయాలు మీ సొంతమవుతాయి.
వృశ్చిక రాశి
కొన్ని సవాళ్లు ఎదురయ్యే సూచనలున్నాయి. ఏ నిర్ణయమైనా పూర్తి సమాచారం లేకుండా తీసుకోకూడదు. కెరీర్‌లో ఒడిదుడుకులు ఉంటాయి. అయితే కొత్తగా పరిచయమయ్యే స్నేహితులు మీకు కొండంత అండగా నిలిచి ఉపశమనం కలిగిస్తారు.
ధనుస్సు రాశి
శని దేవుడి దయతో వీరికి మహర్దశ పడుతుంది. పాత పెట్టుబడుల నుంచి భారీ లాభాలు వస్తాయి. విద్యార్థులకు విదేశీ విద్య యోగం ఉంది. అద్భుతమైన ఆర్థిక పురోగతితో పాటు జీవితంలో కొత్త అవకాశాలు తలుపు తడతాయి.
మకర రాశి
వీరు ఆర్థిక విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. గుడ్డిగా ఆలోచించకుండా పెద్ద పెట్టుబడులు పెడితే నష్టాలు తప్పవు. అయితే, సమాజంలో హోదా, గౌరవం మాత్రం పెరుగుతాయి. ప్రతి అడుగు ఆలోచించి వేయాలి.
కుంభ రాశి
శని సంచారం వీరికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. చాలాకాలంగా పడుతున్న కష్టానికి సరైన ప్రతిఫలం దక్కుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంది. ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి, జీవితంలో మానసిక ప్రశాంతత లభిస్తుంది.
మీన రాశి
వీరి జీవితం మరింత అందంగా, సాఫీగా మారుతుంది. ముఖ్యంగా ఉమ్మడి వ్యాపారాలు చేసేవారికి లాభాల పంట పండుతుంది. కెరీర్, ఆర్థికపరంగా దూసుకుపోతారు. కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో ఆనందంగా గడిపే సమయం దొరుకుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications

