జలుబు వల్ల వచ్చే తీవ్రమైన తలనొప్పిని తగ్గించే బెస్ట్ చిట్కా ఇదే

చాలామందికి జలుబు చేసినప్పుడు తీవ్రమైన తలనొప్పి రావడం సహజమే. కానీ కొన్నిసార్లు ఈ నొప్పి తల కుడి వైపున లేదా ఎడమ వైపున, మరికొన్నిసార్లు మధ్యలో మొదలై ఒక వైపు నుండి మరో వైపుకు పాకుతున్నట్లుగా ఉంటుంది. దీనిని కేవలం మైగ్రేన్ లేదా సైనస్ వల్ల వచ్చిందని కొట్టిపారేయలేం.

ముఖ్యంగా, కొందరిలో తలకు ఒకే వైపు నిరంతరాయంగా నొప్పి వేధిస్తూ ఉంటుంది. మందులు వేసుకున్నా, బామ్ లేదా ఆయింట్‌మెంట్ రాసుకున్నా ఈ మొండి నొప్పి తగ్గదు. వైద్య పరిభాషలో ఇలాంటి తలనొప్పిని హెమిక్రానియా కంటిన్యూవా అని పిలుస్తారు. అయితే కొన్ని సాధారణ వ్యాయామాల ద్వారా తల నొప్పి నుండి సహజంగా ఉపశమనం పొందవచ్చు. అవేంటో ఇక్కడ చూడండి.

Constant Headache on One Side Try These 3 Simple Exercises for Relief

మెడ సాగదీసే వ్యాయామం (నెక్ స్ట్రెచింగ్)

ముందుగా ఒక కుర్చీలో వీపు నిటారుగా పెట్టి కూర్చోండి. మీ భుజాలను కదల్చకుండా స్థిరంగా ఉంచండి. సాధారణంగా శ్వాస తీసుకుంటూ, మీ మెడను, తలను నెమ్మదిగా కుడి నుండి ఎడమ వైపుకు 10 సార్లు తిప్పండి. ఆ తర్వాత తలను మధ్యలోకి తీసుకువచ్చి, ఎడమ నుండి కుడి వైపుకు మరో 10 సార్లు తిప్పండి. తర్వాత మీ తలను వీలైనంత వరకు వెనక్కి వంచి, తిరిగి ముందుకు వంచండి. ఈ విధంగా ముందుకూ వెనక్కూ కూడా 10 సార్లు చేయండి. ఇది మెడ కండరాల ఒత్తిడిని తగ్గించి తలనొప్పిని శాంతింపజేస్తుంది.

ఉత్తానాసనం (స్టాండింగ్ ఫార్వర్డ్ బెండ్)

యోగా మ్యాట్ లేదా చాప మీద నిటారుగా నిలబడండి. మీ నడుము, వీపును స్థిరంగా ఉంచండి. ఇప్పుడు నడుము దగ్గర నుండి శరీరాన్ని ముందుకు వంచి, మీ అరచేతులతో నేలను తాకడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో మోకాళ్ళను అస్సలు వంచకూడదనే విషయం గుర్తుంచుకోండి. మీకు వ్యాయామం చేసే అలవాటు లేకపోతే ప్రారంభంలో ఈ భంగిమను ఎక్కువ సేపు నిలుపుకోవడం కష్టమనిపించవచ్చు. రోజూ సాధన చేయడం వల్ల క్రమంగా శరీరం వంగడం సులభమవుతుంది. సుమారు 10 సెకన్ల పాటు ఇదే స్థితిలో ఉండి, ఆ తర్వాత నెమ్మదిగా ప్రారంభ స్థితికి రండి. ఇది తలకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

చలికాలం సమస్యలకు చెక్ పెట్టే ఆయుర్వేద సంజీవని..ఇంట్లోనే స్వచ్ఛమైన చ్యవన్‌ ప్రాష్ ఎలా చేసుకోవాలంటే..చలికాలం సమస్యలకు చెక్ పెట్టే ఆయుర్వేద సంజీవని..ఇంట్లోనే స్వచ్ఛమైన చ్యవన్‌ ప్రాష్ ఎలా చేసుకోవాలంటే..

అధోముఖ శ్వానాసనం (డౌన్‌వర్డ్ ఫేసింగ్ డాగ్ పోజ్)

ముందుగా నేలపై మోకాళ్లు, అరచేతులు ఆనించి పాకే భంగిమలో కూర్చోండి. ఆ తర్వాత అరచేతులను నేలపై గట్టిగా అదిమిపట్టి, పాదాలు నేలను తాకుతూ ఉండగానే మీ వీపును, నడుమును పైకి లేపండి. శరీరం తలకిందులుగా ఉండే V ఆకారంలో వచ్చేలా చూసుకోండి. ఇప్పుడు మీ తలను నేల వైపునకు దించి, సుమారు 20 సెకన్ల పాటు లోతుగా శ్వాస పీల్చి వదలండి. ఈ ఆసనం మైగ్రేన్, మొండి తలనొప్పిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Thursday, November 19, 2026, 23:30 [IST]
Desktop Bottom Promotion