Latest Updates
-
విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఉసిరి సూప్..చలికాలంలో దీన్ని మించింది లేదు! -
పురుషుల దినోత్సవం స్పెషల్ స్వీట్..నోట్లో వెన్నలా కరిగిపోయే క్రీమీ రబ్రీని ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
చాక్లెట్ బ్రౌనీ చీజ్ కేక్ రెసిపీ.. పురుషుల దినోత్సవాన మీ ప్రియమైన వారికి ఇలా స్వీట్ సర్ ప్రైజ్ ఇవ్వండి! -
International men's day: ప్రతి పురుషుడు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన టెస్టులు ఇవే! -
పిల్లల ఆట అనుకుంటున్నారా? పెద్దలు ఉయ్యాల ఊగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే! -
చలికాలం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్..ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు పాలకూర దోసె చేసుకోండిలా.. -
చలికాలంలో హార్ట్ ఎటాక్ ముప్పు? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు! -
కేరళ స్పెషల్ మలబార్ చికెన్ బిర్యానీ.. బ్యాచిలర్లు కూడా చిటికెలో చేసేయొచ్చు! -
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచి, చర్మానికి మెరుపునిచ్చే తులసి తమలపాకు రసం..ఎలా చేసుకోవాలంటే.. -
మెగ్నీషియం లోపం వేధిస్తోందా? కండరాల నొప్పులు, అలసట తగ్గించే 5 ఫుడ్స్ ఇవే!
నార్త్ ఇండియా స్టైల్ పుట్టగొడుగులు బంగాళదుంప మసాలా..తరతరాలకు గుర్తుండిపోయే రుచి!
రుచి, వండే విధానం వల్ల అందరూ ఎంతో ఇష్టపడే ఆహార పదార్థాలలో పుట్టగొడుగులు (మష్రూమ్స్) ఒకటి. చికెన్, గుడ్ల లాగే పుట్టగొడుగులతో కూడా వందలాది రకాల వంటకాలు చేయవచ్చు. మీ ఇంట్లో కూడా మష్రూమ్స్ అంటే అందరికీ ఇష్టమేనా? మీరు తరచుగా వీటిని కొని వండుతుంటారా?
అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా, ఈసారి వాటికి బంగాళదుంపలు జతచేసి జీడిపప్పు పేస్ట్ తో క్రీమీగా ఉండే నార్త్ ఇండియన్ స్టైల్ మష్రూమ్ పొటాటో మసాలా ప్రయత్నించి చూడండి. తయారు చేయడం ఎంతో సులభమైన ఈ కర్రీ, వేడివేడి అన్నం, చపాతీల నుండి దోసెల వరకు అన్నింటిలోకీ అద్భుతంగా ఉంటుంది. మష్రూమ్ పొటాటో మసాలా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
పుట్టగొడుగులు: 200 గ్రాములు
మధ్యస్థ బంగాళదుంపలు: 2
ఉల్లిపాయ తరుగు: 1 కప్పు
టమాటాలు: 2
జీడిపప్పులు: 10
పచ్చిమిర్చి: 2
అల్లం-వెల్లుల్లి పేస్ట్: ఒకటిన్నర టీస్పూన్
నూనె: 2 టేబుల్ స్పూన్లు
బిర్యానీ ఆకు: 1
జీలకర్ర: అర టీస్పూన్
కారం: 1 టీస్పూన్
పసుపు: పావు టీస్పూన్
గరం మసాలా: 1 టీస్పూన్
కసూరి మెంతి: పావు టీస్పూన్
కొత్తిమీర: గుప్పెడు
ఉప్పు, నీరు: తగినంత
చలికాలం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్..ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు పాలకూర దోసె చేసుకోండిలా..
తయారీ విధానం
-ముందుగా తరిగిన టమాటాలు, జీడిపప్పులను మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా రుబ్బి పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలను కడిగి సన్నగా, పచ్చిమిర్చిని ముక్కలుగా తరగండి. పుట్టగొడుగులను శుభ్రంగా కడిగి, మీకు నచ్చిన ఆకారంలో కోసుకోండి.
-ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి, తరిగిన పుట్టగొడుగులను మీడియం మంట మీద మెత్తబడే వరకు వేయించి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి.
-అదే బాండీలో మరో టేబుల్ స్పూన్ నూనె వేసి జీలకర్ర, బిర్యానీ ఆకు వేయండి. జీలకర్ర చిటపటలాడాక, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బంగారు గోధుమ రంగులోకి మారేవరకు వేయించండి. ఈలోపు బంగాళదుంపలను కడిగి, తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయండి.
-ఉల్లిపాయలు వేగిన తర్వాత, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించండి. తర్వాత రుబ్బిన టమాటా జీడిపప్పు పేస్ట్ వేసి, అందులోని తేమ పూర్తిగా ఆరిపోయే వరకు బాగా వేయించండి. ఇప్పుడు కారం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలిపి రెండు నిమిషాలు వేయించండి. ఆ తర్వాత తరిగిన బంగాళదుంప ముక్కలు వేసి మరో రెండు నిమిషాల పాటు వేయించండి.
-తర్వాత గ్రేవీకి అవసరమైనంత నీరు పోసి బాగా కలపండి. మూత పెట్టి బంగాళదుంపలు మెత్తగా ఉడికేవరకు ఉడికించండి.
-బంగాళదుంపలు ఉడికిన తర్వాత, వేయించి పెట్టుకున్న పుట్టగొడుగులు, కసూరి మెంతిని వేసి మూత పెట్టండి. గ్రేవీ కావలసిన చిక్కదనానికి వచ్చే వరకు సన్నని మంటపై ఉడకనివ్వండి.
-చివరగా ఉప్పు, కారం సరిచూసి అవసరమైతే సర్దుబాటు చేయండి. గ్రేవీ సన్నని మంటపై ఉడకడం మొదలైనప్పుడు స్టవ్ ఆపివేసి, పైన కొత్తిమీర ఆకులు చల్లి, వడ్డించే వరకు మూత పెట్టి ఉంచండి.
-అంతే, గుమగుమలాడే రుచికరమైన మష్రూమ్ పొటాటో మసాలా రెడీ. దీనిని వేడివేడి అన్నం, చపాతీ లేదా దోసెలతో వడ్డించి ఆస్వాదించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
