సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం!

సూర్యభగవానుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు. ఈ క్రమంలో సెప్టెంబర్ 17న సూర్యుడు సింహ రాశి నుండి కన్యా రాశిలోకి ప్రవేశించాడు. పవిత్రమైన ఈ ఘట్టాన్ని కన్యా సంక్రాంతి అని పిలుస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు, శని దేవుడు బద్ధ శత్రువులు.

అక్టోబర్ 17, 2026 వరకు సూర్యుడు కన్యా రాశిలో, శని దేవుడు మీన రాశిలో సంచరించనున్నారు. ఈ స్థితి వల్ల ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి ఏడవ దృష్టితో (సమసప్తక యోగం) చూసుకుంటాయి. దీని ఫలితంగా ప్రధానంగా 5 రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

Sun and Saturn Face Off Huge Losses Predicted for 5 Zodiac Signs

ఆ 5 రాశులు ఇవే..

మేష రాశి

అప్పుల బాధలు పెరగడమే కాకుండా, అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. హాస్పిటల్ ఖర్చులు, మెడికల్ బిల్లులు మీ జేబుకు చిల్లులు పెడతాయి. రహస్య శత్రువులు మీపై కుట్రలు చేసే అవకాశం ఉంది. ఆఫీసులో పై అధికారులతో లేదా ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు.

సింహ రాశి

ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగువేయాలి. ఆఫీసులో బాస్‌ తో గొడవలు మీ కెరీర్‌ కే ముప్పు తెచ్చిపెట్టవచ్చు. తీవ్రమైన ఆర్థిక నష్టాలతో పాటు అనారోగ్య సమస్యలు వేధించే ప్రమాదం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.

వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్‌ ఎక్కడ పెట్టాలో తెలుసా!వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్‌ ఎక్కడ పెట్టాలో తెలుసా!

కన్యా రాశి

సూర్యుడు మీ రాశిలోనే ఉండి, శనితో తలపడుతున్నాడు. దీని ప్రభావం మీ వైవాహిక జీవితంపై తీవ్రంగా పడుతుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రాకుండా చూసుకోవాలి. వ్యాపారంలో భాగస్వామ్యాలు ఉన్నవారు అక్టోబర్ 17 వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలి, లేదంటే మోసపోయే అవకాశం ఉంది.

కుంభ రాశి

ఈ రాశికి అధిపతి శని దేవుడు. పైగా వీరికి ఏలినాటి శని చివరి దశ నడుస్తోంది. ఈ సూర్య-శని పోరు వల్ల కుంభ రాశి వారికి ఊహించని ఆర్థిక నష్టాలు వాటిల్లుతాయి. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు తప్పవు. మీ మాటల్లోని కఠినత్వం వల్ల మీ జీవిత భాగస్వామితో తీవ్రమైన గొడవలు జరగవచ్చు. కాబట్టి వాదనలకు దిగకుండా మౌనం వహించడం ఉత్తమం.

మీన రాశి

మీన రాశి వారికి ఈ సమయం ఏమాత్రం అనుకూలమైనది కాదు. వ్యాపార భాగస్వామ్యాలు దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే దాంపత్య జీవితంలో కలతలు రేగుతాయి. మీ వృత్తి జీవితం, గౌరవ మర్యాదలు, ఆర్థిక స్థితులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టవిరుద్ధమైన లేదా అనైతిక పనులకు దూరంగా ఉండండి, లేదంటే ఊహించని చిక్కుల్లో పడతారు

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Friday, September 18, 2026, 15:01 [IST]
Desktop Bottom Promotion