భారతదేశంలో నిప్పులు చెరుగుతున్న ఏకైక అగ్నిపర్వతం ఎక్కడుందో తెలుసా?

చాలా దేశాల్లో మహా విపత్తులకు, అనేక వాతావరణ మార్పులు అగ్నిపర్వతాలు ప్రధాన కారణంగా ఉంటాయి. అగ్నిపర్వత్వం విస్పోటనం అయ్యి..ఇళ్ల మీదకు లావా పొంగడం, గాలి కలుషితం అవడం, చాలా మంది ప్రాణాలు కోల్పోవడం చాలా సందర్భాల్లో వార్తల్లో మనం చూస్తుంటాం. ఇండోనేషియా, జపాన్, ఇటలీ ఇలీ విదేశాల్లో ఉండే అగ్నిపర్వతాల గురించే మనం ఎక్కవగా విని ఉంటాం..కానీ మనదేశంలో అగ్నిపర్వతం బద్దలవడం అయ్యి పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే వార్తలు ఎప్పుడూ వినలేదు కాబట్టి ఇక్కడ అసలు అగ్నిపర్వతాలు లేవు అని చాలామంది అనుకుంటారు.

ఈ భూమి మీద 1500కి పైగా అగ్నిపర్వతాలు ఉండగా,మన దేశంలో ఏకంగా 7 అగ్నిపర్వతాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఇప్పటికీ నిప్పులు చెరుగుతున్న సజీవ(యాక్టివ్) అగ్నిపర్వతం కూడా. ఎప్పుడైనా విస్ఫోటనం చెందే ప్రమాదం ఉన్న లావా పొరలతో కూడిన ఆ అగ్నిపర్వతం ఎక్కడుందో, దాని వివరాలు ఏంటో ఇక్కడ చూడండి.

India s Only Active Volcano Everything You Need to Know About Barren Island

అందమైన బీచ్ లు ఉన్న ప్రదేశంలో..

అందమైన సముద్ర తీరాలకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి కేరాఫ్ అడ్రస్ అయిన అండమాన్ నికోబార్ దీవుల్లోనే ఈ అగ్నిపర్వతం దాగి ఉంది. అండమాన్ రాజధాని శ్రీ విజయపురం (పోర్ట్ బ్లెయిర్) కు ఈశాన్యంగా సుమారు 138 కిలోమీటర్ల దూరంలో సముద్రం మధ్యలో బారెన్ ఐలాండ్ అనే దీవి ఉంది. దక్షిణాసియా మొత్తంలో ఉన్న ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఇదే కావడం విశేషం. సుమారు 3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ ద్వీపం ఎక్కువగా బూడిద, అగ్నిపర్వత శంకువులతో కప్పబడి ఉంటుంది. ఇది ఇండియన్, పెర్మియన్ టెక్టోనిక్ ప్లేట్ల కలయిక వద్ద ఏర్పడింది.

ఈ ఒక్క ఎక్సర్ సైజ్ చేస్తే 100 ఏళ్లు బ్రతకొచ్చు..న్యూరాలజిస్ట్ చెప్పిన సంచలన నిజం!
చరిత్ర - విస్ఫోటనాలు

అధికారిక రికార్డుల ప్రకారం.. ఈ అగ్నిపర్వతం మొదటిసారిగా 1787లో బద్దలైంది. ఆ తర్వాత సుదీర్ఘ విరామాలతో 1991, 2005, 2017, ఇటీవల 2022లో కూడా చిన్న తరహా విస్ఫోటనాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా 1991లో జరిగిన విస్ఫోటనం అక్కడి పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపింది. పేరుకు తగ్గట్టుగానే బారెన్ (బంజరు,ఖాళీ) ద్వీపంలో మనుషులెవరూ నివసించరు.

కానీ ఆశ్చర్యకరంగా ఈ కఠినమైన వాతావరణంలోనూ కొన్ని జాతుల మేకలు, ఎలుకలు, పావురాలు జీవిస్తున్నాయి. గతంలో బంగాళాఖాతంలో జరిగిన ఏదైనా ఓడ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన మేకలు ఇక్కడికి చేరుకుని ఉంటాయని, అగ్నిపర్వత వాలులో ఊరే మంచినీటి బుగ్గల ఆధారంగా అవి ప్రాణాలు నిలుపుకుంటున్నాయని శాస్త్రవేత్తల అంచనా.

పర్యాటకులు అక్కడికి వెళ్లొచ్చా?

పర్యాటకులు షిప్ లు లేదా బోట్లలో ఈ ద్వీపం చుట్టూ ప్రయాణిస్తూ, సురక్షితమైన దూరం నుంచి అగ్నిపర్వతం పొగలు కక్కడాన్ని కనులారా వీక్షించవచ్చు. కానీ ద్వీపం నేల మీద అడుగుపెట్టడం మాత్రం పూర్తిగా నిషేధం. అగ్నిపర్వతం ఎప్పుడైనా బద్దలయ్యే ప్రమాదం ఉన్నందున పర్యాటకుల భద్రత దృష్ట్యా అధికారులు ఈ నిషేధాన్ని విధించారు.

Story first published: Wednesday, October 28, 2026, 16:48 [IST]
Desktop Bottom Promotion