రుచిగా, పోషకాలతో నిండిన బ్రేక్ ఫాస్ట్..తింటే కొండలను ఢీకొట్టే శక్తి!

Posted By:

రోజూ ఇడ్లీ, దశలు,పూరీలు, మైసూర్ బోండాలు వంటివి తినడం ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. బ్రేక్ ఫాస్ట్ లో హెల్తీ ఫుడ్ తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలు అంది ఫుల్ ఎనర్జీతో ఉంటారు. బ్రేక్ ఫాస్ట్ లో తినడానికి అంటే గోధుమ రవ్వ కిచిడి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

గోధుమ రవ్వ కిచిడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని సింపుల్ గా చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి మసాలాలు వేయకుండానే టేస్ట్ అదరహో అనేలా ఉంటది. దీని తయారీలో గోధుమ రవ్వ, పెసరపప్పు, రకరకాల కూరగాయలు ఉండటం వల్ల ఇది ఒక సంపూర్ణ మీల్ లా ఉంటుంది. దీనిని బ్రేక్ ఫాస్ట్ లంచ్, డిన్నర్ ఎప్పుడైనా తినొచ్చు, పొట్టకు హాయిగా ఉంటుంది. దీని తినడం ద్వారా రోజంతా యాక్టివ్ గా ఎనర్జిటిక్ గా ఉంటారు. పోషకాలతో నిండిన టేస్టీ గోధుమ రవ్వ కిచిడి మీ ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Boost Your Immunity Energy with This Protein Packed Wheat Rava Khichdi Recipe in Telugu

కావాల్సిన పదార్థాలు

-గోధుమ రవ్వ
-పెసరపప్పు
-నీళ్లు
-జీలకర్ర
-ఆవాలు
-నూనె లేదా నెయ్యి
-ఉల్లిపాయ
-క్యారెట్
-బంగాళదుంప
-పచ్చి బఠాణి
-అల్లం
-పచ్చిమిర్చి
-కరివేపాకు
-పసుపు
-టమాటో

అట్లతద్ది స్పెషల్..ఈ టిప్స్ పాటిస్తే దూదిలా మెత్తటి వాయనం అట్లు..

గోధుమ రవ్వ కిచిడి తయారీ విధానం

-ముందుగా ఒక గిన్నె తీసుకోండి, అందులో 1 కప్పు గోధుమ రవ్వ(ఎర్ర నూక) వేయండి. ఇందులోనే అరకప్పు పెసరపప్పు వేసుకోండి. ఇందులో నీళ్లు పోసి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఇందులొ 2 కప్పులు నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టి ఉడికించుకుంటే మెత్తగా, త్వరగా అయిపోతుంది. అయితే కుక్కర్ లో చేసే పనయితే నానబెట్టక్కర్లేదు. డైరెక్ట్ గానే చేసుకోవచ్చు.

-తర్వాత కిచిడి కోసం..స్టవ్ ఆన్ చేసి అందులో నూనె లేదా నెయ్యి వేసి వేడయ్యాక అందులో అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాక అందులోనే 3 పచ్చిమిరపకాయల ముక్కలు, అర ఇంచు అల్లం సన్నని తరుగు, 1 ఉల్లిపాయ పొడవాటి చీలికలు,1 క్యారెట్ చిన్న ముక్కలు , 1 టమాటో ముక్కలు, 1 చిన్న బంగాళదుంప ముక్కలు, అరకప్పు పచ్చి బఠాణీలు వేసి ఇందులోనే తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టి మీడియం మంట మీద మగ్గించాలి. మధ్య మధ్యలో మూత తీసి కలపండి.

-కూరగాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత అందులో నానబెట్టుకున్న గోధుమ రవ్వ పెసరపప్పు మిశ్రమం వేయండి. ఇందులో 6 కప్పుల నీళ్లు పోసి, పావు స్పూన్ పసుపు వేసి గరిటతో కలిపి మూతపెట్టి తక్కువ మంట మీద రవ్వ, పప్పు రెండూ మెత్తగా అయ్యేదాకా ఉడికించి స్టవ్ ఆపేస్తే గోధుమ రవ్వ కిచిడి రెడీ.

-ఒకవేళ మీరు కుక్కర్ లో చేస్తున్నట్లయితే మూతపెట్టి పెద్ద మంట మీద 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికిస్తే చాలు రెడీ అయిపోతుంది.

[ of 5 - Users]
Story first published: Wednesday, October 28, 2026, 9:07 [IST]
Desktop Bottom Promotion