ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోయే టమాటా మినపపప్పు చట్నీ.. ఒక్కసారి రుచి చూశారంటే వదిలిపెట్టరు!

Posted By:

ఇడ్లీ, దోసెలలోకి ప్రతిరోజూ రొటీన్‌గా తినే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీలు తిని బోర్ కొట్టి, మీ కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు కొత్త రుచులు కావాలని అడుగుతున్నారా? మనలో చాలామందికి టమాటా చట్నీ అంటే ఇష్టం. అయితే ఎప్పుడూ ఒకే పద్ధతిలో కాకుండా, కాస్త వెరైటీగా టమాటాలకు మినపపప్పును జోడించి కమ్మటి చట్నీ తయారు చేసి చూడండి.

మినపపప్పు వల్ల చట్నీకి అద్భుతమైన రుచితో పాటు మంచి కమ్మదనం వస్తుంది. ఇది తయారు చేయడం చాలా సులభం. వేడి వేడి ఇడ్లీలు లేదా కరకరలాడే దోసెలతో ఈ చట్నీ కలుపుకుని తింటుంటే ఆహా అనిపించాల్సిందే. నోరూరించే టమాటో మినపపప్పు చట్నీ తయారీ విధానం ఇక్కడ చూడండి.

Tomato Urad Dal Chutney Recipe in Telugu The Perfect Side Dish for Your Morning Breakfast

కావలసిన పదార్థాలు

నూనె - 1 టేబుల్ స్పూన్
మినపపప్పు - 5 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
వెల్లుల్లి - 10 రెబ్బలు
ఎండు మిరపకాయలు - 3
చింతపండు - చిన్న ముక్క
కొత్తిమీర - ఒక గుప్పెడు
కరివేపాకు - 1 రెమ్మ
టమాటాలు - 4
ఉప్పు - మీ రుచికి తగినంత

తాలింపు కోసం:

నూనె - 1 టీస్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
మినపపప్పు - 1 టేబుల్ స్పూన్
ఎండు మిరపకాయ - 1
కరివేపాకు - 1 రెమ్మ
పసుపు లేదా మెంతుల పొడి - 1 టీస్పూన్

రుచిగా, పోషకాలతో నిండిన బ్రేక్ ఫాస్ట్..తింటే కొండలను ఢీకొట్టే శక్తి!

తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి అయ్యాక, మినపపప్పు వేసి పచ్చి వాసన పోయేలా వేయించండి. పప్పు బంగారు గోధుమ రంగులోకి మారి కమ్మటి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి.

-పప్పు వేగిన తర్వాత అందులో ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిసేపు దోరగా వేయించాలి.
ఆ వెంటనే ఎండు మిరపకాయలు, చిన్న చింతపండు ముక్క వేసి కలపాలి. అలాగే గుప్పెడు కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి వేయించండి.

-ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న 4 టమాటా ముక్కలను పాన్ ‌లో వేసి బాగా కలపండి. టమాటాలు పూర్తిగా మెత్తబడి, గుజ్జులా ఉడికేవరకు ఉంచి.. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.

-వేయించిన పదార్థాలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత, వాటిని ఒక మిక్సీ జార్‌ లో వేసుకుని, రుచికి సరిపడా ఉప్పును జోడించి మెత్తని పేస్ట్‌ లా గ్రైండ్ చేసుకోవాలి.

-గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోండి.

-చట్నీకి అసలైన రుచి తాలింపుతోనే వస్తుంది. చివరగా స్టవ్ పై పోపు గరిటెను ఉంచి, నూనె వేడిచేయండి. అందులో ఆవాలు, మినపపప్పు, ఎండు మిరపకాయ, కరివేపాకు, కాస్త పసుపు లేదా మెంతుల పొడి వేసి చిటపటలాడనివ్వండి. ఈ ఘుమఘుమలాడే పోపును చట్నీలో వేసి బాగా కలుపుకోవాలి.

-అంతే ఎంతో రుచికరమైన టమాటా మినపపప్పు చట్నీ రెడీ

[ of 5 - Users]
Story first published: Wednesday, October 28, 2026, 19:40 [IST]
Desktop Bottom Promotion