Latest Updates
-
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్!
Sun jupiter conjunction: 12 ఏళ్ల తర్వాత మేషరాశిలో సూర్య- గురు గ్రహ సంయోగం, ఈ 3 రాశుల వారికి లాభాలు
12 సంవత్సరాల తర్వాత బృహస్పతి పితృ గ్రహం సూర్యూడితో మేషరాశిలో సంయోగం చెందనున్నాడు. ఈ సంయోగం 12 రాశులపై ప్రభావం చూపిస్తుంది. అయితే దీని వల్ల కొన్ని రాశుల వారు చాలా లాభపడనున్నారు. ఈ సమయంలో వారు ఏ పని తలపెట్టినా విజయం వరిస్
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాలు, నక్షత్రరాశుల కదలికలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహాలు, సూర్య చంద్రుల కదలికలు జీవితంలోని వివిధ అంశాలను ప్రభావితం చేస్తాయి. కొన్నిసార్లు వాటి ప్రభావం విస్తృత స్థాయిలో కూడా ఉండొచ్చు. 12 సంవత్సరాల తర్వాత బృహస్పతి పితృ గ్రహం సూర్యూడితో మేషరాశిలో సంయోగం చెందనున్నాడు. ఈ సంయోగం 12 రాశులపై ప్రభావం చూపిస్తుంది. అయితే దీని వల్ల కొన్ని రాశుల వారు చాలా లాభపడనున్నారు. ఈ సమయంలో వారు ఏ పని తలపెట్టినా విజయం వరిస్తుంది.

సూర్య-గురు గ్రహ సంయోగం ఎప్పుడు జరగనుంది?
జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు అత్యంత ఉన్నతమైన గ్రహం. సూర్యుడు అధికారం, శక్తి, ఆరోగ్యం, తేజం, ఆశ సహా మరెన్నింటికో అధిపతిగా పరిగణిస్తారు. బృహస్పతి(గురు) గ్రహాన్ని సమృద్ధికి, అవగాహనకు, అదృష్టానికి, పెరుగుదలకు, ఆశావాదానికి అధిపతిగా పరిగణించబడుతోంది.
ఏప్రిల్ 14, 2023న మేషరాశిలోకి సూర్యుడు సంచరించనున్నాడు. ఏప్రిల్ 22, 2023న తెల్లవారుజాము 3.33 గంటలకు గురు గ్రహం తన సొంత రాశిని మీనరాశిని విడిచిపెట్టి, అప్పటికే మేషరాశిలో ఉన్న సూర్యుడితో సంయోగం చేయనున్నాడు.

మేషరాశిలో సూర్య- గురు గ్రహ సంయోగంతో ఈ 3 రాశుల వారికి ప్రయోజనం
మీనరాశి:
మీనం యొక్క స్థానికులకు, సూర్యుడు-బృహస్పతి యొక్క ఈ కలయిక వారి రెండో ఇంట్లో జరుగుతుంది. దాని వల్ల మీనరాశి వారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రెండో ఇల్లు మీ ప్రసంగం, సంపదను ప్రభావితం చేస్తుంది. సూర్య - గురు గ్రహాల సంయోగంతో మీనరాశి వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఆర్థికంగా లాభాలు పొందుతారు. సృజనాత్మక మీనం స్థానికులు కమ్యూనికేషన్, ప్రసంగంలో వారి ఉత్సాహంతో ప్రజలను ప్రభావితం చేయగలరు. కెరీర్ పరంగా ప్రమోషన్, ఇంక్రిమెంట్లు పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో ఉన్న మీనరాశి వారు లాభాలు పొందుతారు.

సింహరాశి:
సూర్యుడు-బృహస్పతి కలయిక సింహ రాశి వారికి 9వ ఇంట్లో జరుగుతుంది వారికి శ్రేయస్సు, విజయాన్ని అందిస్తుంది. ఈ ఇల్లు అదృష్టాన్ని మరియు ప్రయాణాన్ని సూచిస్తుంది. ఈ కలయికతో సింహరాశి వారు అదృష్టాన్ని పొందుతారు. సూర్యుడు సింహ రాశికి అధిపతి అయినందు వల్ల వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో సింహ రాశి వారు విదేశీ ప్రయాణాలు చేయవచ్చు. కుటుంబసభ్యులతో ముఖ్యంత్రి తండ్రితో సంబంధం మెరుగుపడుతుంది. మతం, ఆధ్యాత్మికతకు సంబంధించిన పనిలో బిజీగా ఉంటారు.

కర్కాటకరాశి:
కర్కాటక రాశి వారికి సూర్య- గురు గ్రహాల సంయోగం కలిసి రానుంది. వ్యాపారంలో ఉన్న వారికి లాభాలు, వ్యాపార వృద్ధి జరగనుంది. ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతి లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ సంయోగం 10వ ఇంట్లో జరుగుతుంది. ఇది కర్మ చర్యలను సూచిస్తుంది. బృహస్పతి ప్రభావం వల్ల స్థానికులకు కొత్త ఉద్యోగవకాశాలు, ఆఫర్లు వస్తాయి.



Click it and Unblock the Notifications