రాగి జావ తాగుతున్నారా? ఈ నిజం తెలియకపోతే ఎంత తాగినా వేస్ట్!

కొన్నేళ్ల క్రితం వరకు మన పెద్దలు ఉదయాన్నే కాఫీ, టీకి బదులు రాగి జావ తాగుతుండేవాళ్లు. ఇప్పటికీ ఆరోగ్య సృహ ఉన్న చాలామంది పొద్దున్నే రాగి జావ లేదా రాగి అంబలి తాగతున్నారు. దీనికి కారణం రాగి జావలో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటది, దీని వల్ల రక్తహీనత తగ్గుతుంది, ఎముకలు ఉక్కులా మారతాయి, ఇంకా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నమ్మడం.

అయితే రాగి జావ తాగితే ఐరన్ వస్తుంది, కాల్షియం వస్తుంది అనుకునేవారికి షాకింగ్ నిజం చెప్పారు నెల్లూరుకి చెందిన డాక్టర్ శ్రీధర్. మీరు రోజూ రాగి జావ తాగినా కూడా అందులోని ఐరన్, కాల్షియం మీ శరీరానికి అందకపోవచ్చని డాక్టర్ శ్రీధర్ చెతున్నారు. దీనికి 2 కారణాలు ఉన్నాయని ఆయన చెప్పారు.

Drinking Ragi Java Every Day 3 Tips To Maximize Iron Calcium Absorption From Ragi Java

కాల్షియం, ఐరన్ పోటీ

రాగుల్లో ఐరన్, కాల్షియం రెండూ మెండుగానే ఉంటాయి. అయితే ప్రధాన సమస్య ఏంటంటే..మన శరీరంలోకి ఐరన్ గ్రహించబడే ప్రక్రియను కాల్షియం అడ్డుకుంటది. ఈథ రెండు పోషకాలు మన పేగుల్లోకి ఎంటర్ అయినప్పుడు శరీరం వాటిని స్వీకరించడంలో ఇబ్బంది ఎదుర్కొంటది.

ఫైటేట్స్..అడ్డుగోడలా

రాగిలో ఫైటేట్స్ అనే సహజ మూలకాలు ఉంటాయి. ఇవి కాల్షియం, ఐరన్ తో ఒక స్ట్రాంగ్ బంధాన్ని ఏర్పర్చుకుంటాయి. దీంతో మన పేగులు ఆయా పోషకాలను గ్రహించలేవు. దీని ఫలితంగా మనం రెగ్యులర్ గా రాగి జావ తాగిన మన శరీరానికి కాల్షియం, ఐరన్ అందకపోవచ్చు.

రాగి జావలోని పోషకాలు 100 శాతం శరీరానికి అందాలంటే డాక్టర్ సూచించిన 3 పనులు

రాగులను మొలక కట్టడం

రాగులను రాత్రంతా నీళ్లల్లో నానబెట్టి మరుసటి రోజు ఉదయం వాటిని ఒక పల్చటి గుడ్డలో మూతకట్టి మొలకలు వచ్చేలా చేయడం. మొలకెత్తిన రాగులను ఎండపెట్టి అప్పుడు పొడి చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రాగుల్లోని ఫైటేట్స్ పూర్తిగా నశించిపోతుంది, దీంతో ఆ పొడితో చేసిన రాగి జావ తాగినప్పుడు మన శరీరంలో అందులోని ఐరన్, కాల్షియంని ఈజీగా గ్రహిస్తుంది.

తల్లిదండ్రులూ బీ అలర్ట్..పిల్లలకు సిరప్ వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండితల్లిదండ్రులూ బీ అలర్ట్..పిల్లలకు సిరప్ వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి

రాత్రంతా పులియబెట్టడం

రాగులను రాత్రంతా పులియబెట్టడం లేదా రాగి పిండిని ముందు రోజు రాత్రే నీళ్లలో కలిపి పొద్దున్నే జావ కాచుకోవడం. ఇలా చేయడం వల్ల అందులో మన పేగులకు మంచి చేసే బ్యాక్టీరియా డెవలప్ అయ్యి..ఇది ఫైటేట్స్ ప్రభావం తగ్గించి పోషకాలను శరీరానికి అందిస్తుంది.

నిమ్మరసం పిండుకోవడం

రాగి జావ తాగే ముందు అందులో కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. ఐరన్ మన శరీరానికి వంటపట్టాలంటే విటమిన్ C చాలా అవసరం. తయారుచేసుకున్న రాగి జావ గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో కొంచెం నిమ్మరసం కలిపి తాగండి. దీంతో విటమిన్ సి సాయంతో ఐరన్ శోషణను పెంచుతది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Monday, November 2, 2026, 9:21 [IST]
Desktop Bottom Promotion