Latest Updates
-
మెతుకు మిగల్చకుండా తినే రుచి..తమిళనాడు స్పెషల్ దిండిగల్ తలపకట్టి చికెన్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
క్రంచీ, టేస్టీ జీడిపప్పు పకోడి..మస్త్ కిక్కిచ్చే స్నాక్ ఈజీగా చేసుకోండిలా.. -
కరివేపాకు మరమరాలు..మూవీ, వెబ్ సిరీస్ చూస్తూ తినడానికి బెస్ట్ టేస్టీ,హెల్తీ స్నాక్ ! -
డీప్ ఫ్రై లేని హెల్తీ స్నాక్..సూపర్ టేస్టీ సగ్గుబియ్యం పొంగనాలు ఈజీగా ఇంట్లో చేసుకోండిలా.. -
ఈ చిన్న సీక్రెట్ తెలిస్తే..ఇంట్లోనే క్షణాల్లో రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ,సాఫ్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ -
వంకాయ దోసకాయ పచ్చడి..ఏంట టేస్ట్ రా బాబు మైండ్ నుంచి పోవట్లేదు అనాల్సిందే! -
తల్లిదండ్రులూ బీ అలర్ట్..పిల్లలకు సిరప్ వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి -
భూటాన్ స్పెషల్ ఎగ్ ఏమా దత్షీ..స్వర్గానికి బెత్తెడే దూరం! -
పండుగ రోజే దారుణం..భర్త డోర్ ఓపెన్ చేయగానే ప్రియుడితో సరసాలాడుతూ భార్య..రెండ్ హ్యాండెడ్ గా దొరకడంతో.. -
జలుబు, దగ్గును మాయం చేసే చెట్టినాడ్ ఉల్లిపాయ రసం.. ఈ మసాలాతో చేస్తే టేస్ట్ అదుర్స్!
ప్రభుత్వ హాస్పిటల్స్ దుస్థితికి ఇదే నిదర్శనం.. ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్ కి ఎయిమ్స్ డైరెక్టర్!
మనదేశంలో ప్రభుత్వ హాస్పిటల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎక్కడో అక్కడ అక్కడ తప్పితే మిగతా అన్నీ అరకొర వసతులతో ఉండేవే. ల్యాబ్ లు ఉంటాయి కానీ అందులో పరికరాలు ఉండవు, గదులు ఉంటాయి కానీ డాక్టర్లు అందుబాటులో ఉండరు, బాత్ రూమ్ లు ఉంటాయి కానీ తాళాలు వేసి ఉంటాయి..కొన్ని చోట్ల పరికరాలు ఉంటాయి కానీ వాటిని ఆపరేట్ చేయడానిక సిబ్బంది ఉండరు..ఇలా ఒకటి ఉంటే ఒకటి ఉండదు అన్నట్లే పరిస్ధితి ఉంది మన ప్రభుత్వ హాస్పిటల్స్ లో. గర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్లే ఇంటికి సేఫ్ గా తిరిగి వస్తారో రారో అన్న పరిస్థితికి ప్రజలను ఎప్పుడో నెట్టేశారు మన పాలకులు. దీనికి ప్రత్యేకంగా ఒక్క ప్రభుత్వాన్ని నిందించలేం.
మనదేశంలో అత్యున్నత వైద్య సేవలు అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చే పేరు ఎయిమ్స్. మన తెలుగు రాష్ట్రాల్లో రెండు ఉన్నాయి, ఒకటి ఏపీలోని మంగళగిరిలో, ఇంకోటి తెలంగాణలోని బీబీ నగర్ లో ఉంది. ఇక్కడ అత్యాధునిక సదుపాయలు ఉంటాయన్న నమ్మకంతో చాలామంది ఇక్కడికి వస్తుంటారు. కానీ తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్ పూర్ ఎయిమ్స్ హాస్పిటల్ లో జరిగిన ఒక పరిణామం అందరినీ విస్మయానికి గురిచేసింది. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ఈ ఘటన ప్రభుత్వ హాస్పిటల్స్ లో అధునాతన వైద్య సదుపాయాల లభ్యతపై చాలా ప్రశ్నలను లేవనెత్తింది.

ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ ఎయిమ్స్ హాస్పిటల్ కి ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గా ఉన్న విబా దత్తా బుధవారం సడెన్ గా తీవ్ర తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత సమస్యగా గుర్తించిన డాక్టర్లు వెంటనే ఆమెకు ఎయిమ్స్ లోనే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చి పరిస్థితిని నిలకడగా మార్చారు. అయితే మెరుగైన కార్డియాక్ ఎవాల్యుయేషన్ (గుండె పరీక్షలు) కోసం ఆమెను హుటాహుటిన నగరంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించాల్సి వచ్చింది.
అంత పెద్ద జాతీయ స్థాయి గవర్నమెంట్ వైద్య సంస్థకు డైరెక్టర్ గా ఉన్న వ్యక్తిని అత్యవసరంగా ప్రైవేట్ హాస్పిటల్ కు ఎందుకు తరలించాల్సి వచ్చిందనేది ఇప్పుడు అందరినీ తొలిచివేస్తున్న అసలు ప్రశ్న. గోరఖ్ పూర్ ఎయిమ్స్‌లో గుండె సంబంధిత వ్యాధులను నిర్ధారించే కార్డియాక్ కాథెటరైజేషన్ లాబొరేటరీ సదుపాయం ఇంకా అందుబాటులోకి రాకపోవడమే దీనికి ప్రధాన కారణం. అందువల్ల ముందస్తు జాగ్రత్తగా ఆమెను ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ సీనియర్ డాక్టర్లు ఆమెకు పేస్‌మేకర్ అమర్చాల్సిన అవసరం ఉందా అని క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఎలాంటి ఆపరేషన్ అవసరం లేదని తేలడంతో ఆమె రాత్రి 8 గంటల సమయానికి సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు.
కానీ, ఈ సంఘటన సామాన్య ప్రజల మదిలో ఎన్నో ప్రశ్నలను, ఒక భయంకరమైన సందేహాన్ని రేకెత్తిస్తోంది. కోట్ల రూపాయల నిధులతో నడిచే టాప్ క్లాస్ అని చెప్పే ప్రభుత్వ వైద్య సంస్థకు నాయకత్వం వహించే అధికారికే గుండె సంబంధిత ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్ తలుపులు తట్టాల్సిన దుస్థితి ఏర్పడితే... ప్రాణాపాయ స్థితిలో అక్కడికి వచ్చే సామాన్య రోగుల పరిస్థితి ఏమిటి? ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ హాస్పిటల్సే శరణ్యమని నమ్ముకున్న నిరుపేదలు అత్యవసర సమయంలో ఎక్కడికి వెళ్లాలి? అప్పటికప్పుడు ప్రైవేటుకు వెళ్లే స్థోమత వారికి ఉంటుందా? అని సోషల్ మీడియాలో కూడా ఈ ఘటనపై కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ విమర్శల నేపథ్యంలో స్పందించిన ఎయిమ్స్ యాజమాన్యం... సంస్థలో క్యాత్ ల్యాబ్ ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, ఇప్పటికే దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపింది. 2026 డిసెంబర్ నాటికి ఈ సదుపాయం పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేసింది.



Click it and Unblock the Notifications

