Latest Updates
-
టపాసుల నిప్పురవ్వలు పడి చర్మం కాలితే వెంటనే చేయాల్సిన, చేయకూడని పనులివే! -
దీపావళి స్పెషల్..బ్యాచిలర్స్ కూడా సులభంగా వండేలా.. అదిరిపోయే పొల్లాచి చికెన్ బిర్యానీ చేసుకోండిలా.. -
దీపావళి స్పెషల్.. రొటీన్ కు భిన్నంగా నోరూరించే గుంటూరు చికెన్ రోస్ట్.. ఈజీగా చేసుకోండిలా.. -
నువ్వు దేవుడివి సామీ: ఉద్యోగులకు దీపావళి బోనస్ గా 20 లక్షల రూపాయలు ఇచ్చిన వ్యాపారి..వీడియో చూడండి -
డాక్టర్ హెచ్చరిక..సైలెంట్ గా కాలుతాయి కదా అని ఈ 3 టపాసులు పిల్లలకు ఇస్తే పెను ప్రమాదమే! -
ఎముకలను బలపరిచే పోషకాల నిధి.. దీపావళి పండుగ స్పెషల్ గా పెసరపప్పు పాయసం చేయండిలా.. -
Diwali 2026 Wishes in Telugu: మీ బంధుమిత్రులకు ప్రత్యేకంగా దీపావళి శుభాకాంక్షలు చెప్పండిలా.. -
రెస్టారెంట్ స్టైల్ పనీర్ భుర్జీ మసాలా గ్రేవీ.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
బంగాళదుంపతో ఇలా దోశ వేస్తే రుచికి ఫిదా అవ్వాల్సిందే.. తయారీ విధానం ఇదే.. -
మీ జీర్ణవ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందనడానికి 10 సంకేతాలివే
చలికాలంలో ఎముకలను దృఢంగా ఉంచే రాగి మునగాకు రోటీ..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్
చలికాలం రాగానే మనకు ఏదైనా వేడిగా, రుచిగా తినాలనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం పూట తీసుకునే బ్రేక్ ఫాస్ట్ కడుపు నింపేలా ఉండటమే కాకుండా, శరీరానికి కావాల్సిన శక్తిని, రోగనిరోధక శక్తిని అందించేదిగా ఉండాలి. రోజూ తినే ఇడ్లీ, దోశ, ఉప్మా,వడలు తిని మీకు బాగా విసుగొచ్చిందా? అయితే ఈ చలికాలంలో మీ నాలుకకు కొత్త రుచిని, మీ శరీరానికి అదనపు ఆరోగ్యాన్ని ఇచ్చే అద్భుతమైన వంటకం రాగి మునగాకు రోటీ.
రాగి పిండిలో కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇక మునగాకు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, దీన్ని పోషకాల గని అంటారు. ఈ రెండింటి కలయికతో రోటీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
రాగి పిండి - 2 కప్పులు
లేత మునగాకు - 1 కప్పు
ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
ఎండు మిరపకాయలు - 4
పచ్చి కొబ్బరి తురుము - పావు కప్పు
వెల్లుల్లి - 1 టేబుల్ స్పూన్
రుచికి సరిపడా ఉప్పు
గోరువెచ్చని నీరు
నూనె లేదా నెయ్యి
బంగాళదుంపతో ఇలా దోశ వేస్తే రుచికి ఫిదా అవ్వాల్సిందే.. తయారీ విధానం ఇదే..
తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి పాత్ర తీసుకోండి. అందులో రాగి పిండిని వేసి, దానికి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, మునగాకు, ఎండు మిర్చి ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, దంచిన వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు వేసి చేత్తో బాగా కలపండి.
-ఇప్పుడు గోరువెచ్చని నీటిని కొద్దికొద్దిగా పోస్తూ పిండిని ముద్దలా కలపాలి. మునగాకు,వెల్లుల్లి ఫ్లేవర్స్ రాగి పిండికి బాగా పట్టేలా చేత్తో గట్టిగా నొక్కుతూ మెత్తని పిండి ముద్దను సిద్ధం చేసుకోండి. ఈ పిండి ముద్దపై ఒక మూత పెట్టి సుమారు అరగంట పాటు పక్కన ఉంచండి.
-ఒక చదునైన పళ్ళెం లేదా బోర్లించిన గిన్నె అడుగున శుభ్రమైన, తడి కాటన్ వస్త్రాన్ని పరచండి. చేతులకు కొద్దిగా నూనె రాసుకుని, నానబెట్టిన పిండి నుంచి నిమ్మకాయంత ముద్దను తీసుకోండి. తడి గుడ్డ మీద ఈ పిండి ముద్దను పెట్టి వేళ్లతో మెల్లగా ఒత్తుతూ, గుండ్రంగా, కాస్త పలచగా రోటీలా చేసుకోండి.
-స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేయండి. ఇప్పుడు తడి గుడ్డను జాగ్రత్తగా ఎత్తి, రోటీ వైపు ఉన్న భాగాన్ని పెనం మీద వేసి, గుడ్డను మెల్లగా తీసేయండి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, రోటీ అంచుల వెంబడి, పైన కొద్దిగా నూనె లేదా నెయ్యి వేయండి. రెండు వైపులా తిప్పుతూ ఎర్రగా, లోపల పిండి పూర్తిగా ఉడికేలా నిదానంగా కాల్చుకోండి.
-అంతే ఎంతో గుమగుమలాడే, రుచికరమైన రాగి మునగాకు రోటీలు రెడీ. వీటిని వేడివేడిగా గ్రీన్ చట్నీ, టమాటా చట్నీ లేదా కమ్మటి పెరుగుతో తింటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
