Latest Updates
-
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.!
ఆదివారం పుట్టారా? అయితే మీ జాతకం ఇదే..మామూలోళ్లు కాదుగా
ఒక్కో రాశిలో జన్మించిన వ్యక్తులు ఒక్కో రకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నట్లుగానే.. ఒక్కో రోజున పుట్టిన వ్యక్తులు ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. దీని ప్రకారం వారంలో మొదటి రోజైన ఆదివారం పుట్టిన వాళ్లు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు,వారి బలాలు ఏంటీ,బలహీనతలు ఏంటి,ఆరోగ్యం,వృత్తి జీవితం ఎలా ఉంటుంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
వ్యక్తిత్వం, అలవాట్లు
ఆదివారం జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వం, అలవాట్లు ఇతర రోజులలో జన్మించిన వారి కంటే పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఈ రోజున జన్మించిన వ్యక్తులు కష్టపడి పనిచేసేవారు, ప్రతిష్టాత్మకంగా ఉంటారు. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. చాలా స్వచ్ఛమైన మనస్సు కలిగి ఉంటారు. బేషరతుగా ప్రేమిస్తారు. సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. గ్రహాల రాజు అయిన సూర్య భగవానుడు వీరి అధిష్టాన దేవడు. అందుకే సూర్య భగవానుడి ప్రత్యేక ఆశీస్సులు వీళ్లపై ఉంటాయి.

వృత్తి జీవితం
ప్రభుత్వ రంగంలో లేదా పరిపాలనలో ఉత్తమంగా పని చేస్తారు. మెడికల్, ఎనర్జీ సెక్టార్, రాజకీయాలు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, పోలీస్, థియేటర్ లేదా ఫిల్మ్ డైరెక్టర్ వంటి వృత్తులలో విజయం సాధిస్తారు. మెకానిక్ రంగంలో ఇంజనీర్లు లేదా యజమానులుగా ఉంటారు.
తక్కువ మాట్లాడటం
ఆదివారం జన్మించిన వ్యక్తులు తక్కువ మాట్లాడతారు, కానీ కరెక్ట్ గా మాట్లాడతారు. వీరి మాటలు భిన్నమైన,లోతైన ప్రభావాన్ని కలిగి ఉంటాయి. చాలా సున్నితమైన వ్యక్తులు. దేనికోసం తమ ఆత్మగౌరవాన్ని కోల్పోరు. బలమైన వ్యక్తిత్వం, సృజనాత్మకత, ఆశయం, బలమైన సంకల్ప శక్తి కారణంగా వీరు తమ ఆదర్శాలను సులభంగా సాధిస్తారు. మంచి క్రమశిక్షణ గలవారు. వీరు నాయకుడుగా ఉన్న ఇంట్లో లేదా ప్రదేశంలో కఠినమైన నియమాలు ఉంటాయి.
ఆకర్షణీయంగా
ఆదివారం నాడు పుట్టిన వారు అందంగా కనిపిస్తారు. అందంగా కనిపించడం వల్ల ఇతరులను చాలా త్వరగా ఆకర్షిస్తారు. లుక్స్ మాత్రమే కాదు వారి వ్యక్తిత్వం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. వీరి ముఖాలు మృదుత్వం, తేజస్సుతో నిండి ఉన్నాయి. మనోహరమైన లుక్ కారణంగా ఎదుటివారిని సులభంగా ఆకర్షించగలరు.
రిలేషన్స్
ఆదివారం రోజున జన్మించిన వ్యక్తులు బయటికి చాలా బలంగా ఉంటారు, కానీ సమస్యలు తలెత్తినప్పుడు అసహనానికి గురవుతారు. ఇది వారి వ్యక్తిగత జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వీరి భాగస్వామి ఓపిక లేని వ్యక్తి అయితే వీరి వ్యక్తిగత జీవితం సంక్లిష్టంగా మారుతుంది.
ఆరోగ్యం
ఆదివారం రోజున పుట్టిన వాళ్లు సూర్యుడిలా శక్తితో నిండి ఉంటారు,అందుకే వీరి ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఆదివారం పుట్టిన వారికి గుండె జబ్బులు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు, అధిక రక్తపోటు, రక్త సంబంధిత వ్యాధులు, జుట్టు రాలడం లేదా బట్టతల రావడం, విపరీతమైన అలసట, వెన్నునొప్పి, వృద్ధాప్యంలో వేడి సంబంధిత వ్యాధులకు గురవుతారు.
ఆదివారం పుట్టిన వారికి అదృష్ట సంఖ్యలు
ఆదివారం జన్మించిన వ్యక్తులు తాము చేసే ప్రతి పనిలో అగ్రస్థానంలో ఉండటానికి ఇష్టపడతారు. వీరి అదృష్ట సంఖ్య 1. ముఖ్యమైన ఈవెంట్‌లు, కొత్త వెంచర్‌లను నెల మొదటి రోజున లేదా 1వ తేదీన ప్రారంభించడం వీరికి విజయాన్ని తీసుకొస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications