Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
ugadi panchangam 2025: సింహ రాశి వారికి ఉగాది నుంచి ధనయోగం,కానీ అదొక్కటే!
తెలుగువారి తొలి పండుగ ఉగాది ఈ ఏడాది మార్చి 30న జరుపుకుంటారు. తెలుగు పంచాంగం ప్రకారం ఉగాది నుంచే తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఒక్కో ఏడాదికి ఒక్కో పేరు ఉంటుంది. అలాగే ఈ ఏడాది నుంచి ప్రారంభమయ్యే కొత్త సంవత్సరాన్ని శ్రీ విశ్వావసు నామ సంవత్సరంగా పిలుస్తారు. ఉగాది రోజున ఉగాది పచ్చడి తినడంతో పాటు ఆ రోజున పంచాంగ శ్రవణం ద్వారా రాబోయే ఏడాదిలో అంతే తెలుగువారి కొత్త సంవత్సరంలో ఎదురయ్యే పరిస్థితులను తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. విశ్వావసు నామ సంవత్సరంలో ప్రతి రాశి వారికి తమ తమ గ్రహస్థితి, దశల ఆధారంగా ఫలితాలు మారుతూ ఉంటాయి.
జనవరి 30,2025 నుండి ప్రారంభమయ్యే తెలుగు నూతన సంవత్సరం సింహరాశి వ్యక్తులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోవాలనుకుందా? సింహ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ రాశి అధిపతి అయిన సూర్యుడు మీకు శక్తిని, ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. అయితే కొన్ని గ్రహాల స్థానాల వల్ల కొన్ని సవాళ్లు కూడా ఎదురుకావచ్చు. సింహరాశి వారికి ఉగాది నుంచి ఈ ఏడాది మొత్తం ఆర్థికంగా,కుటుంబ పరంగా, వృత్తి పరంగా, ఆరోగ్య పరంగా ఏ విధమైన ఫలితాలు ఉంటాయో వివరంగా ఇప్పుడు చూద్దాం.

ఆర్థికంగా ఎలా ఉంటుంది
ఉగాది నుంచి ప్రారంభయ్యే తెలుగువారి కొత్త సంవత్సరంలో సింహ రాశి వారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్థిరమైన ఆదాయం ఉంటుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. తెలివైన పెట్టుబడులు లాభాలను తెచ్చిపెడతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడిని ఆశించవచ్చు. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. పొదుపుపై దృష్టి పెట్టడం భవిష్యత్తుకు మంచిది.
వృత్తి పరంగా ఎలా ఉంటుంది
ఉగాది నుంచి ప్రారంభయ్యే తెలుగువారి కొత్త సంవత్సరంలో సింహరాశి వారి వృత్తి జీవితంలో మంచి ఎదుగుదల ఉంటుంది. చేస్తున్న ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. పదోన్నతులు పొందే అవకాశాలు ఉన్నాయి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించండి. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు ఎదురవుతాయి. విస్తరణ ప్రణాళికలు విజయవంతంగా ముందుకు సాగుతాయి. పోటీని తట్టుకుని నిలబడటానికి మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం అవసరం.
ఆరోగ్యం
ఆరోగ్యం విషయంలో సింహరాశి వారు ఉగాది నుంచి ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం వంటివి చేయండి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది..కానీ వాటిని సకాలంలో గుర్తిస్తే పెద్దగా ఇబ్బంది ఉండదు.
కుటుంబం,సంబంధాలు
కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నించండి. చిన్న చిన్న మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది, వాటిని సామరస్యంగా పరిష్కరించుకోండి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. స్నేహితుల సహకారం మీకు లభిస్తుంది.
ప్రేమ, వైవాహిక జీవితం
ప్రేమలో ఉన్నవారికి ఇది ఆనందకరమైన సమయం. మీ బంధం మరింత బలపడుతుంది. వివాహితులకు జీవిత భాగస్వామితో అనుబంధం మెరుగుపడుతుంది. ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగడం వల్ల సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.
విద్య, అభివృద్ధి
విద్యార్థులకు ఇది మంచి సమయం. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. మీ వ్యక్తిగత, వృత్తిపరమైన అభివృద్ధికి ఈ సంవత్సరం దోహదపడుతుంది.
మొత్తంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం సింహ రాశి వారికి వృత్తిలో ఎదుగుదల, ఆర్థిక స్థిరత్వం కలిగిస్తుంది. అయితే కుటుంబ సంబంధాలు, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications