Latest Updates
-
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.!
ఉతికిన బట్టలు ఈ సమయంలో ఆరేస్తున్నారా.. వాస్తు ప్రకారం ఇంటికి ఎంత ప్రమాదకరమో తెలుసా.?
బిజీ లైఫ్‌లో చాలా మంది ఇంటి పనులు చేసుకోవడానికి సరైన సమయం ఉండదు. దీంతో రోజులో ఎప్పుడు వీలైతే అప్పుడు పనులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కొందరు ఉద్యోగాలు చేసే మహిళలు ఉదయం బట్టలు ఉతికే తీరిక లేక రాత్రి సమయంలో వాష్ చేసి ఆరేస్తుంటారు. దీంతో బట్టలు రాత్రంతా తీగలకు వేలాడుతూ ఉంటాయి. మరుసటి రోజు ఉదయం లేదా మధ్యాహ్నం ఆరిన తర్వాత తీస్తుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా రాత్రి సమయంలో బట్టలు ఆరేయడం ఇంటికి మంచిది కాదని పండితులు చెబుతున్నారు. మరి రాత్రిళ్లు బట్టలు ఆరేయడం వల్ల ఏం జరుగుతుంది.. వాస్తు ఏం చెబుతుంది.. ఇక్కడ చూద్దాం..

వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రిళ్లు ఇంటి బయట బట్టలు ఆరేయడం పూర్తిగా అనుచితమైన పద్ధతి. ఇలా చేయడం ద్వారా అది ఇంటి వాతావరణాన్ని పాడు చేయడంతో పాటు పాజిటివ్ ఎనర్జీపై ప్రభావం చూపిస్తుంది. మరోవైపు సైంటిఫికల్‌గా చూస్తే రాత్రిపూట బట్టలు ఆరేయడం ఆరోగ్య సమస్యలకి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు.
వాతావరణంలో మార్పులు
వాస్తు శాస్త్రం ప్రకారం.. పగటి పూట వచ్చే ఎనర్జీకి, రాత్రి పూట కలిగి ఎనర్జీకి చాలా తేడా ఉంటుంది. ఈ క్రమంలో రాత్రి పూట తడిబట్టలను ఎక్కువ సేపు బయట ఉంచడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే వాస్తు ప్రకారం పగటిపూట బట్టలు ఆరబెట్టుకోవడం శ్రేయస్కరం. రాత్రిపూట బయట వదిలివేసిన బట్టలు ఇంట్లోకి బరువును, అశాంతిని తీసుకువచ్చే అవకాశం ఉండటంతో.. సూర్యాస్తమయానికి ముందే బట్టలను లోపలికి తీసుకురావాలని శాస్త్రాలు చెబుతున్నారు.

ఆరోగ్యంపై ప్రభావం
సైంటిఫికల్‌గా చూస్తే రాత్రంతా బట్టలను ఆరబెట్టడం వల్ల చల్లటి వాతావరణం ప్రభావంతో అవి ఎక్కువ సేపు తేమను నిలుపుకొంటాయి. దీంతో తడి బట్టల వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ వృద్ధి చెందుతుంది. ఇది కుటుంబీకుల్లో చర్మ సమస్యలకి దారితీయవచ్చు. అందుకే పగటిపూట బట్టలు ఆరబెట్టడం ఆరోగ్యానికి సైతం మంచిది.
పగటిపూట బట్టలను ఎప్పుడూ ఆరుబయట సూర్యరశ్మి తగిలేలా ఆరబెట్టండి. సూర్యాస్తమయంలోగా వాటిని ఇంట్లోకి తెచ్చేయండి. సరైన సమయంలో బట్టలు ఆరేసి ఆరిన తర్వాత తీయడం ద్వారా ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. ఇంట్లో వారి ఆరోగ్యమూ బాగుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
