Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
శుక్రుడి చిత్తా నక్షత్ర ప్రవేశం..ఈ 4 రాశుల దశ తిరిగినట్లే!
నక్షత్రాలు,గ్రహాల కదలికల్లో మార్పులు అన్ని రాశులపై ఏదో ఒకరంగా ప్రభావాన్ని చూపెడతాయని జ్యోతిష్యశాస్త్రం తెలియజేస్తుంది. శుక్ర గ్రహంని దయ కలిగిన గ్రహంగా చెబుతారు. సుఖసంతోషాలకు అధిపతి అయిన శుక్ర భగవానుడి స్థాన మార్పు ఎల్లప్పుడూ ప్రత్యేకమైనది. శుక్రుడు..అక్టోబర్ 28,2025న హస్త నక్షత్రం నుంచి కుజుడు పాలిస్తున్న చిత్రా నక్షత్రంలోకి(chitra nakshatra) ప్రవేశిస్తాడు. నవంబర్ 7,2025 వరకు శుక్రుడు చిత్తా నక్షత్రంలోనే సంచరిస్తాడు. ఈ సమయంలో శుక్రుడు కన్య రాశిలో ఉంటాడు.
శుక్రుడు, చిత్రా నక్షత్రం కలయిక అత్యంత శక్తివంతమైనది. ఈ అరుదైన సంచారం వల్ల ముఖ్యంగా నాలుగు రాశుల వారికి భారీ అదృష్టం పట్టనుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. నాలుగు రాశుల వారి జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయి. వ్యక్తిగత ఆకర్షణ, సౌందర్యం ఇనుమడిస్తాయి. మరి ఆ అదృష్ట రాశులేవో, వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఇక్కడ చూడండి.

చిత్రా నక్షత్రంలో శుక్రడి ప్రవేశం మేష రాశి వ్యక్తులకు ఒక వరం లాంటిది. వృత్తి, వ్యాపారాలలో ఊహించని పురోగతి కనిపిస్తుంది. లాభాల పంట పండటంతో ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే ఎంతో మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. దాంపత్య జీవితంలో మాధుర్యం పెరుగుతుంది, ఇంట్లో శాంతి, సామరస్యం వెల్లివిరుస్తాయి. ఈ సమయంలో మీరు కళలు, సంగీతం వంటి సృజనాత్మక రంగాలపై ప్రత్యేక ఆసక్తి చూపుతారు. కెరీర్ లో ఎదుగుదలకు, వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం.
వృషభరాశి
వృషభరాశికి అధిపతి శుక్రుడే కాబట్టి చిత్రా నక్షత్రంలో ఈ సంచారం మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. మీరు నూతనోత్తేజంతో, అపారమైన ఉత్సాహంతో ఉరకలేస్తారు. మీ జీవితంలోకి విలాసవంతమైన వస్తువులు, సుఖసంతోషాలు ప్రవేశిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోయి, ప్రేమపూర్వక వాతావరణం నెలకొంటుంది. ప్రేమ సంబంధాలు మరింత లోతుగా, స్థిరంగా మారతాయి. వైవాహిక జీవితంలో అన్యోన్యత పెరిగి, ఆనందకరమైన క్షణాలను ఆస్వాదిస్తారు. కొత్త వాహనం లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేసే యోగం ఉంది.
తులరాశి
తులరాశికి కూడా శుక్రుడే అధిపతి. అందువల్ల ఈ సంచారం మీ ఆత్మవిశ్వాసాన్ని ఆకాశమంత ఎత్తుకు పెంచుతుంది. అవివాహితులకు శుభవివాహ ఘడియలు దగ్గరపడతాయి. మీకు నచ్చిన సంబంధాలు కుదరడమే కాకుండా, మీ జీవితంలోకి ప్రేమ ప్రవేశించే బలమైన అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. భూమి, ఇల్లు లేదా ఇతర స్థిరాస్తులు కొనుగోలు చేయాలనే మీ కల నెరవేరవచ్చు. ఆర్థికంగా ఇది మీకు సువర్ణయుగం లాంటిది.
వృశ్చికరాశి
వృశ్చికరాశి వారికి శుక్రుడి దయ వల్ల అదృష్టం అడుగడుగునా తోడుంటుంది. మీరు ఏ పని తలపెట్టినా విజయం మీ సొంతమవుతుంది. దీర్ఘకాలంగా ఆగిపోయిన పనులు, పరిష్కారం కాని సమస్యలు ఇప్పుడు సులభంగా పూర్తవుతాయి. ఎప్పటినుంచో రావాల్సిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, జీతాల పెంపు వంటి శుభవార్తలు వింటారు. ఉన్నతాధికారుల మద్దతు సంపూర్ణంగా లభిస్తుంది. అదృష్టం మీ వైపు ఉన్నందున, ప్రతి ప్రయత్నంలోనూ సానుకూల ఫలితాలు పొందుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











