Latest Updates
-
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన! -
బయట బండి మీద దొరికే రుచితో ఇంట్లోనే భేల్ పూరీ.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
ఇడ్లీ, దోసెల్లోకి ఈసారి వంకాయ చట్నీ రుచి చూడండి..లెక్కపెట్టకుండా తినేస్తారు -
హైదరాబాద్ స్పెషల్ ఇరానీ ఛాయ్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి! -
చపాతీ, పూరీ, పులావ్ లలోకి అదిరిపోయే మీల్ మేకర్ మసాలా గ్రేవీ.. నాన్ వెజ్ కూడా దీని ముందు దిగదుడుపే!
2025 వరకు కన్యారాశి వారి జీవితంలో జరిగేవి ఇవే..! ముందుగానే తెలుసుకోండి..!
గ్రహస్థితి లో మార్పుల వల్ల కన్యా రాశి వారి జీవితం పూర్తిగా మారిపోయింది. ఈ సమయంలో వీరు విశేషమైన శుభఫలితాలను పొందుతున్నారు అంతేకాకుండా ఉద్యోగపరంగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి స్థానచలనం కూడా కనిపిస్తుంది. పనిభారం అధికం గా ఉన్నా సరే ఆ పనిభారం తగ్గించుకోవడానికి మీరు స్మార్ట్ వర్క్ చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఫలితాన్ని పొందుతారు. శని భగవానుడి అనుకూలత వల్ల ఉద్యోగ సంస్థలో మంచి పేరును కూడా సంపాదిస్తారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారం విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఏదైనా భూమిని కొనుగోలు చేసేటప్పుడు వాటికి సంబంధించిన అన్ని కాగితాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం మంచిది.

కుటుంబంలో గతంలో ఉన్న మనస్పర్ధలు అన్ని పూర్తిగా తొలగిపోతాయి ఈ రాశి వారి వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్య చేయాలన్ని కలను కూడా నిజం చేసుకోవడం వల్ల వల్ల మంచి పేరును సంపాదించుకుంటారు. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారు లేదా వ్యాపారం చేయాలనుకునేవారు ఈ సమయంలో ప్రయత్నించడం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందుతారు.
ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కోరుకుంటున్నవారు ఈ సమయంలో ట్రాన్స్ఫర్ పొందే అవకాశం కనిపిస్తుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. ప్రభుత్వ రంగంలో పని చేసేవారు ఈ సమయంలో మంచి లాభాలను పొందుతారు. వ్యవసాయదారుడైతే ప్రభుత్వం నుంచి సహకారాన్ని పొందుతారు. ఈ రాశి వారు చేసే పనులు ప్రణాళికాబద్ధంగా ఉండటం వల్ల అనుకున్న విజయాన్ని సాధిస్తారు.
వీరు చేసే పనుల్లో కుటుంబ సభ్యులు సహకారం, స్నేహితులు, సహకారం ఉంటుంది. దీని వల్ల ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేశి సంతోషంగా ఉంటారు. మదులుపెట్టి ఆగిపోయిన పనులు విజయవంతంగా పూర్తవుతాయ్. వీరు ఉద్యోగంలో చేసే పనులు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. ఇప్పటివరకు సరైన ఉద్యోగం లేదనుకునేవారు ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటే మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు.
విద్యార్థులు జ్ఞానం విచక్షణ కలిగి ఉంటారు. అనుకున్న రంగాలలో రాణిస్తారు. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది, కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలన్నీ పూర్తిగా తొలగి పోతాయి అదేవిధంగా ఎప్పటినుంచే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో మంచి వివాహ సంబంధం కనిపిస్తాయ్.
వీరి అదృష్ట సంఖ్య 6, వీరికి బుధవారం శుక్రవారం అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు ప్రారంభించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది ఎంత ఆదాయం వస్తుందో అదే విధంగా ఖర్చులు కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో గృహోపకరణాల విషయంలో అధికంగా ధనం ఖర్చు చేస్తారు. కనుక డబ్బులు ఖర్చు పెట్టే సమయంలో ఎంత వరకూ అవసరమో అంతే ఖర్చు పెట్టడం మంచిది.
మంగళ వారం రోజుల్లో పొరపాటున కూడా అప్పు చేయకూడదు ఈ సమయంలో అతి విశ్వాసంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. దీని వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. ప్రతికూల ఆలోచనలు రాకుండా జాగర్త పడాలి ప్రతీ విషయాన్ని కూడా పాజిటివ్ గా ఆలోచించడం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్నత పదవిని పొందాలి అనే ఆలోచన చేసే వారు రాజకీయ రంగ ప్రవేశం చేయటం మంచిది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. ప్రజాదరణ కలుగుతుంది దీనివల్ల అనుకున్న పనిని సొంతం చేసుకుంటారు.
లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈ రాశి వారిపై ఉంటుంది. చేసిన పనుల్లో విజయం సాధించాలంటే శుక్రవారం రోజున దుర్గాదేవి ఆలయానికి వెళ్లి అక్కడ ఓం దుర్గాయై నమ: అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకోవడం వల్ల మొదలుపెట్టిన పనుల్లో తప్పకుండా విజయం సాధిస్తారు.
గమనిక : పైన ఇవ్వబడిన వివరాలన్నీ ప్రముఖ జ్యోతిష్యులు పండితుల నుంచి సేకరించినవి. వీటిని మేము ఎట్టిపరిస్థితిలో దృవీకరించము.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











