బాబా వంగా అంచనా..అక్టోబర్ 5వ తేదీ నుంచి ఆ 5 రాశుల వారికి రాజయోగం పక్కా!

ప్రపంచవ్యాప్తంగా తన అద్భుతమైన భవిష్యవాణులతో ప్రసిద్ధి చెందిన బాబా వంగా అంచనాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఆ అంచనాల ప్రకారం.. 2026 అక్టోబర్ 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఉన్న వారం జ్యోతిష్య శాస్త్రపరంగా అత్యంత ప్రత్యేకమైనది.

ఈ వారం వృశ్చిక రాశితో సహా ఐదు రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు జరగనున్నాయి. వృత్తి, వ్యాపారం, డబ్బు, ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఈ రాశుల వారి దశ తిరగబోతోంది. మరి ఆ అదృష్ట రాశులు ఏవో, వారికి ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో ఇక్కడ చూడండి.

Weekly Horoscope Baba Vanga Predicts 5 Zodiac Signs Whose Fate Will Change From 2026 October 5 to 11

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ వారం కెరీర్, ఆర్థిక రంగాల్లో సరికొత్త అవకాశాలు తలుపు తట్టనున్నాయి. ఆఫీసులో మీ కష్టానికి గుర్తింపు లభించి, ప్రమోషన్లు లేదా కొత్త బాధ్యతలు దక్కవచ్చు. వ్యాపారులకు కొత్త పరిచయాలు భవిష్యత్తులో లాభాలను తెచ్చిపెడతాయి. ఎప్పటి నుంచో చేతికి రాకుండా ఆగిపోయిన డబ్బు ఈ వారం మీకు అందుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్న విద్యార్థులకు ఆశించిన సానుకూల ఫలితాలు వస్తాయి. పెట్టుబడులకు ఇది సరైన సమయం.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ వారం అఖండ విజయం, ఆర్థిక బలం సిద్ధించనున్నాయి. ఉద్యోగులకు సమాజంలో, కార్యాలయంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారాన్ని విస్తరించాలనే మీ ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి. ముఖ్యంగా కొత్త డీల్స్ ద్వారా లాభాలు గడిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు అదృష్టం వరిస్తుంది. పెట్టుబడుల ద్వారా భారీ లాభాలు ఉంటాయి.

ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఉలవల కారం పొడి..ఒక్కసారి చేస్తే నెల రోజులు నిల్వ..ఇడ్లీ, వేడి అన్నంలోకి బెస్ట్ ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఉలవల కారం పొడి..ఒక్కసారి చేస్తే నెల రోజులు నిల్వ..ఇడ్లీ, వేడి అన్నంలోకి బెస్ట్

తులా రాశి

తులా రాశి వారికి వారం ప్రారంభం నుంచే అదృష్టం వెన్నంటి ఉంటుంది. మీరు ఏ పని తలపెట్టినా అందులో సులభంగా విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఈ వారం అద్భుతంగా ఉంటుంది. సొంత వ్యాపారం చేసేవారికి లాభాల పంట పండుతుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఈ వారం స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ ప్రయాణాల్లో కొందరు ప్రత్యేకమైన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు మీకు ఎంతో మేలు చేస్తాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ వారం ఆర్థిక, వృత్తిపరమైన విషయాల్లో సానుకూల పవనాలు వీస్తాయి. కుటుంబంలో ఇన్నాళ్లుగా ఉన్న గొడవలు, ఉద్రిక్తతలు తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. బంధువుల కలయిక ఆనందాన్నిస్తుంది. ఆగిపోయిన వ్యాపార ప్రాజెక్టులు తిరిగి ఊపందుకుంటాయి. కొత్త పనులకు ప్రణాళికలు వేస్తారు. పాత పెట్టుబడుల నుంచి వచ్చే లాభాలు, తిరిగి వచ్చే పాత బాకీలు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి.

మకర రాశి

మకర రాశి వారి కెరీర్‌ కు ఈ వారం అత్యంత కీలకమైనది. ఉద్యోగ వేటలో ఉన్న యువత నిరీక్షణ ఫలించి శుభవార్త వింటారు. ఉద్యోగులకు ఆఫీసులో కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి. స్నేహితులతో కలిసి సరికొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. పెట్టుబడులు పెట్టిన వారికి ఆశించిన లాభాలు అందుతాయి. ప్రేమ జీవితంలో ఉన్న చిన్నచిన్న అపార్థాలు తొలగిపోయి, బంధం మరింత బలపడుతుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Monday, October 5, 2026, 11:06 [IST]
Desktop Bottom Promotion