Latest Updates
-
బియ్యం, మినప్పప్పు లేకుండానే అటుకులతో అప్పటికప్పుడు క్రిస్పీ మసాలా దోసె..అబ్బబ్బబ్బా అనాల్సిందే! -
చలికాలంలో రోజూ ఒక బెల్లం ముక్క తింటే ఏమవుతుంది? రోజుకు ఎంత, ఎలా తినాలో తెలుసా? -
బాలల దినోత్సవం స్పెషల్: ఓవెన్ లేకపోయినా పర్లేదు.. స్టవ్ మీదనే క్రిస్పీగా వేరుశెనగ బిస్కెట్లు చేసుకోండిలా! -
పాస్ వర్డ్ లో కామా పెడితే ఎవ్వరూ హ్యాక్ చేయలేరా? వైరల్ టెక్ ట్రిక్ వెనుక వాస్తవం ఇదే! -
కారంగా, కమ్మగా ఉండే కరివేపాకు చికెన్ రోస్ట్.. ఈ సీక్రెట్ మసాలాతో రుచి డబుల్! -
మన దేశం మధ్యలో ఉండి భారతీయులే వెళ్లలేని వింత గ్రామం..ఎక్కడుంది? ఆ కథేంటి? -
చలికాలంలో పచ్చి బఠానీ ఎందుకు తినాలో తెలుసా? -
చేపల వేపుడును మించిపోయే రుచితో కందగడ్డ ఫ్రై.. సింపుల్ గా ఇంట్లోనే చేసుకోండి ఇలా! -
ఒకే రకమైన ఎగ్ కర్రీ తిని విసిగిపోయారా? ఒక్కసారి ఈ నేపాల్ స్టైల్ ఎగ్ రెసిపి తింటే జన్మలో మర్చిపోరు! -
షుగర్ వ్యాధి వచ్చే ముందు కనబడే సంకేతాలు ఇవే!
ప్రతి రాత్రి సోంపు నీరు తాగుతున్నారా? నెల రోజుల్లో శరీరంలో జరిగే అద్భుత మార్పులివే!
భారతీయ వంటగదుల్లో తప్పక ఉండే పదార్థాల్లో సోంపు కూడా ఒకటి. హోటల్స్, రెస్టారెంట్లలో కూడా తప్పనిసరిగా ఇది ఉంటుంది. హోటల్ లేదా రెస్టారెంట్ కి వెళ్లి ఫుడ్ తిన్న తర్వాత ఖచ్చితంగా సోంపు తింటుంటారు చాలామంది. దీనివల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుందని, అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మనకు తెలిసిన విషయమే. అయితే ఒక నెల పాటు ప్రతి రాత్రి పడుకునే ముందు సోంపు నీరు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
జీర్ణక్రియకు సహాయం, ఉబ్బరానికి చెక్
సోంపు సహజ జీర్ణకారిగా పనిచేస్తుంది. దీనిలోని అనెథోల్ అనే నూనె కడుపు కండరాలను సడలించి గ్యాస్ ను తగ్గిస్తుంది. ప్రతి రాత్రి దీనిని తాగడం వల్ల ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా భారీ భోజనం తర్వాత వచ్చే అజీర్తిని నివారిస్తుంది. నెల రోజుల తర్వాత భోజనం చేసినా కడుపు తేలికగా అనిపిస్తుంది.

బరువు నిర్వహణకు తోడ్పాటు
సోంపు నీరు నేరుగా కొవ్వును కరిగించదు కానీ బరువును అదుపులో ఉంచే మంచి అలవాట్లకు మద్దతు ఇస్తుంది. ఇది శరీరంలో నీరు నిల్వ ఉండటాన్ని తగ్గిస్తుంది, రాత్రిపూట ఆకలిని నియంత్రిస్తుంది, ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అయితే ఇది వ్యాయామం, సమతుల్య ఆహారానికి ప్రత్యామ్నాయం కాదు.
హైడ్రేషన్, డిటాక్సిఫికేషన్
సోంపు ఒక తేలికపాటి మూత్రవిసర్జకారిగా పనిచేసి శరీరంలోని వ్యర్థాలను, అదనపు ద్రవాలను బయటకు పంపుతుంది. ఇది మూత్రపిండాల పనితీరుకు మద్దతు ఇచ్చి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. శరీరం ఉబ్బినట్లు కనిపించడాన్ని తగ్గించి, హైడ్రేషన్ ను మెరుగుపరుస్తుంది. తగినంత నీరు, మంచి ఆహారంతో పాటు దీనిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

హార్మోన్ల సమతుల్యత
సోంపు గింజలలో ఈస్ట్రోజెన్ ను పోలిన ఫైటోఈస్ట్రోజెన్ గుణాలు ఉన్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వీటి వల్ల మహిళల్లో పిఎంఎస్ లక్షణాలు, నెలసరి నొప్పులు, మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. హార్మోన్ల మార్పుల సమయంలో ప్రశాంతమైన నిద్రకు కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది.
గాఢ నిద్ర, మనశ్శాంతి
సోంపులోని సహజ నూనెలు మనస్సును, శరీరాన్ని ప్రశాంతపరుస్తాయి. నిద్రకు ముందు సోంపు నీరు తాగితే నాడీ వ్యవస్థ విశ్రాంతి పొంది ఒత్తిడి తగ్గుతుంది. ఆలస్యంగా లేదా భారీగా తిన్నప్పుడు కలిగే అసౌకర్యాన్ని తగ్గించి త్వరగా నిద్ర పట్టేలా చేస్తుంది. ఉదయాన్నే చాలా తేలికగా, ఉత్సాహంగా మేల్కొంటారు.
ఒక నెల తర్వాత మీరు గమనించే మార్పులు
క్రమం తప్పకుండా నెల రోజులు సోంపు నీరు తాగితే కడుపు ఉబ్బరం తగ్గడం, జీర్ణ సమస్యలు దూరమవడం, వాటర్ రిటెన్షన్ తగ్గడం, సాఫీగా మలవిసర్జన జరగడం, రాత్రిపూట ప్రశాంతమైన కడుపు, మెరుగైన నిద్ర, నెలసరి అసౌకర్యం నుండి ఉపశమనం వంటి మార్పులను మీరు గమనించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
