Latest Updates
-
పిత్తులు వేసే వాళ్లని చూసి నవ్వుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి.. -
స్పైసీ మసాలా కార్న్ కర్రీ..చపాతీ, నాన్ లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్! -
ఆగస్టు 11 నుంచి 5 రాశులకు రాజయోగం.. కుబేరులు కాబోతున్న ఆ అదృష్టవంతులు మీరేనా? -
చికెన్ 65, చిల్లీ చికెన్ మర్చిపోతారు.. ఈ కేరళ చికెన్ ఫ్రై రుచి చూస్తే! -
తలస్నానం చేసిన ప్రతిసారీ జుట్టు రాలిపోతోందా? దీనికి పరిష్కారం ఏంటో తెలుసా? -
కీళ్ల నొప్పులకు చెక్,ఎముకలకు బలాన్నిచ్చే రుచికరమైన మటన్ పాయా కర్రీ..ఇంట్లోనే ఈజీగా వండేయండిలా.. -
ఎలాంటి మెషీన్ లేకుండానే ఇంట్లోనే స్వచ్ఛమైన వేరుశెనగ నూనె..ఎలా చేయాలో చూడండి.. -
అరేయ్ మామా.. మీ బెస్ట్ ఫ్రెండ్ కి పంపించడానికి అదిరిపోయే ఫ్రెండ్ షిప్ డే విషెస్, కోట్స్,స్టేటస్ లు.. -
నెలసరి ఆలస్యమవుతోందా? కారణం ఒత్తిడి మాత్రమే కాదు..ఈ నిజాలు తెలుసుకోండి! -
వీకెండ్ స్పెషల్: రొటీన్ కు భిన్నంగా ఆంధ్రా స్టైల్ కరివేపాకు తొక్కు చికెన్.. టేస్ట్ చేస్తే వదలరు!
ప్రతీ రాశికి ఒక గుణం, లక్షణం వుంటుంది..? మీ రాశి గురించి కూడా తెలుసుకోండి..?
ప్రపంచంలో వున్న ప్రతీ ఒక్క వ్యక్తికీ ఒక బలహీనత వుంటుంది. ఈ బలహీనతను వారు ఎవ్వరితో పంచుకోరు, చెప్పరు. ఎందుకంటే బలహీనతను గనుక చెప్పినట్లయితే వారు తమతో ఆడుకుంటారని తెలిసి బలహీనతను చెప్పకుండా వుంటారు. ప్రతీ రాశి వారికి బలహీనతలు వుంటాయ్. ఏ రాశి వారికి ఏ బలహీనత వుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషం
ఈ రాశికి చెందిన వారు తమ చుట్టూ వుండేవారిని గమనిస్తూ వుంటారు. వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా వుంటాయ్. అందువల్ల వీరు తమ పక్కని వారికి ఏదైనా సంఘటన జరిగితే వెంటనే స్పందిస్తారు.

వృషభ రాశి
వృషభ రాశి వారు చాలా నమ్మదస్తులు. వీరు స్థిరంగా వుండే గుణాన్ని కలిగి వుంటారు. అపజయాలు వస్తాయని వీరు ఎక్కువగా భయపడిపోతూ వుంటారు. గెలుపైనా, ఓటమైనా ముందుకు వెళ్లాలనుకుంటారు. అలా వెళ్లినప్పుడు వీరికి ఎదురు వుండదు.
మిధునం
వీరికి ఒక అంశంపై స్థిరమైన ఆలోచన వుండదు. వీరి మనస్తత్వం తరచూ మారతూ వుంటుంది. ఎక్కువగా ఆలోచించి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు.
కర్కాటక రాశి
ఈ రాశి వారికి భావోద్వేగాలు చాలా ఎక్కువగా వుంటాయ్. వీరు తమ ఎమోషన్స్‌ను అలాగే వుంచుకుంటూ వుంటారు. వాటిని ఎప్పుడో ఒకసారి అకస్మాత్తుగా బయటపెట్టేస్తూ వుంటారు.అవతలివారు చిన్న మాట అన్నాకూడా వీరి మనోభావాలు చాలా దెబ్బతింటాయ్. దాంతో వీరు ఎక్కువగా ఆందోళనకు గురౌతుంటారు. వీరు ఎక్కువగా నిరాశాజనకంగా వుంటారు. వీరికి ఇతరులపై అస్సలు నమ్మకం వుండదు.

సింహరాశి
సింహరాశి వారికి గర్వం అహంకారం చాలా ఎక్కువగా వుంటుంది. పక్కవారి పట్ల కూడా వీరు చాలా గర్వంగా వుంటారు. దీంతో వీరికి చాలా మంది దూరమైపోతూ వుంటారు.
కన్యా రాశి
కన్యా రాశి వారికి మేధస్సు బాగా వుంటుంది. వీరు దేనిపైనైనా విశ్లేషన చేయగలుగుతారు. ప్రతీ సమస్యనూ తాము పరిష్కరించగలుగుతామనే ధీమాతో వుంటారు. కానీ వారే తమ సమస్యలను పరిష్కరించుకోలేని అయోమయ స్థితిలో పడిపోతారు.
తులా రాశి
ఈ రాశికి చెందిన వారు చాలా ప్రశాంతంగా వుంటారు. శాంతి కాముకులుగా ప్రవర్తిస్తారు. వీరికి ఉన్నట్లుండి అప్పటికప్పుడు కోపం వచ్చేస్తూ వుంటుంది. అందరినీ దూరం చేసుకుంటూ వుంటారు.
వృశ్చికం
ఈ రాశివారు చాలా రొమాంటిక్‌గా వుంటారు. వీరు శృంగార సంబంధాన్ని కూడా బాగా కలిగివుంటారు.
ధనుస్సు రాశి
ఈ రాశివారు ఎప్పుడూ బోర్‌గా ఫీల్ అవుతూ వుంటారు. వీరికి ఓపిక, సహనం అస్సలు వుండదు. ఎదుటివారు చెప్పేది వీరు వినరు. వీరు చాలా మందిని దూరం చేసుకుంటూ వెళ్లిపోతారు.
మకర రాశి
ఈ రాశివారు డబ్బుకే ఎక్కువ విలువను ఇస్తుంటారు. డబ్బు సంపాదించడానికి ఎక్కువగా శ్రమిస్తూ వుంటారు. దీంతో వీరు చిన్న చిన్న సరదాలను కోల్పోతూ వుంటారు. వీరు చిన్న పనిచేసి చాలా గొప్పగా చెప్పుకుంటారు.
కుంభరాశి
ఈ రాశివారు మనసులోని విషయాలను బయటపెట్టడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. వీరికి చాలా భావోద్వేగాలు వుంటాయ్. కానీ వాటిని వ్యక్తపరచలేరు. ఎదుటివారు ఏమనుకుంటారోనన్న భయం వీరికి వుంటుంది.
మీనరాశి
మీనరాశి వారికి కూడా భావోద్వేగాలు చాలా ఎక్కువగానే వుంటాయ్. వీటిని వీరు వ్యక్తపరుస్తారు. వీరిలో సృజనాత్మకత ఎక్కువగానే వుంటుంది. కానీ దాన్ని వెలికితీయడంలో ఇబ్బంది పడుతుంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications