Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
మీ జాతకంలో ఈ యోగాలు ఉన్నాయా.. అయితే సర్కారు ఉద్యోగం కచ్చితంగా మీదే!
ఒక మనిషి జీవితంలో జరిగే ప్రతీ దానికి జ్యోతిష్య శాస్త్రానికి ముడి పడి ఉంటుంది. రాశులు, గ్రహాలు, గ్రహ సంచారల వల్లే మన జీవితంలో అధృష్టాలు, దురదృష్టాలు, సంతోషాలు, నష్టాలు వస్తుంటాయి. అయితే చాలా మందికి సర్కారు ఉద్యోగం రావాలని ఉంటుంది. ఆ ప్రభుత్వ ఉద్యోగం కోసం విపరీతంగా చదువుతుంటారు. ఎంత చదివినా కొన్ని సార్లు ఉద్యోగం రావడం చాలా కష్టం అవుతుంది. కొందరు ఎక్కువగా చదవకపోయినా కానీ ఒక్కసారి ప్రయత్నంలోనే ప్రభుత్వ ఉద్యోగం వరిస్తుంది.
సర్కారు కొలువు సాధించాలంటే చదువుతో పాటు మీ జాతకంలో ఈ యోగాల ఉంటే కచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఆ యోగం మీ జాతకంలో ఉందో లేదో తెలుసుకోవడానికి ఏ జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్లాల్సిన పని లేదు. కొన్ని లెక్కలు, యోగాల ద్వార ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా లేవా అని తెలుసుకోవచ్చు. మరి ఆ లెక్కలు ఎలా వేయాలి, మీ జాతకంలో సర్కారు కొలువు వచ్చే యోగం ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం.

అంగారకుడు మకర రాశిలో 10వ పాదంలో ఉంటే శభయోగం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తి జాతకంలో అంగారకుడు మకర రాశిలో 10వ పాదంలో ఉంటే శుభంగా పరిగణిస్తారు. శుభయోగంగా భావిస్తారు. ఈ స్థితిలో వారికి సర్కారు కొలువు లభించే యోగం ఉంటుందని అంతా భావిస్తారు. అలా కాకుండా వ్యక్తుల జాతకంలో 10వ పాదంలో సూర్యుడు, గురుడితో పాటు ఉచ్చ రాశిలో ఉన్నా, సొంత రాశి లేదా మిత్ర రాశిలో ప్రవేశించినా ఆ జాతకుల జీవితంలో మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించగలరని చెబుతారు.
10వ పాదంలో శుభగ్రహం ఉంటే సర్కారు కొలువు
అలాగే వ్యక్తి జాతక కేంద్రంలో ఏదైనా ఉచ్చరాశిలో గ్రహం ఉన్నా, ఇదే సమయంలో దీంతో పాటు జాతకుడిపై ఏదైనా గ్రహం భ దృష్టి ఉన్నా వారికి ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాకుండా జాతకంలో 10వ పాదంలో ఏదైనా శుభగ్రహం ఉన్నట్లు అయితే ప్రభుత్వ ఉద్యోగ యోగం లభిస్తుంది. కుండలిలో ప్రభుత్వ ఉద్యోగ యోగం ఉంటే దాదాపు వారు జీవితంలో ఎదుర్కోవాల్సిన కష్టాలను అధిగమించి మంచి కొలువు సాధిస్తారు.
లగ్నేశ లేదా దశమేష స్థితి ఉంటే ప్రభుత్వ ఉద్యోగం
ఇవే కాకుండా వ్యక్తి జాతకంలో లగ్నేశ లేదా దశమేష స్థితి ఉంటే శుభంగా పరిగణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం చేస్తున్న ప్రయత్నాల్లో విజయాన్ని అందుకుంటారు. ఇది కాకుండా 1, 4, 7, 10 లేదా 5, 9 పాదాల్లో ఎందులోనైనా అంగారకుడు బలంగా ఉంటే అది కూడా ఆ జాతకులు మేలు చేకూరుస్తుంది. వారు అనుకున్న ప్రభుత్వ కొలువుల్లో నియమితులు అవుతారు. జీవితంలో సంతోషకరమైన పరిస్థితులను ఎదుర్కుంటారు.
పైన చెప్పిన ఈ యోగాలు అన్నీ వ్యక్తుల జాతకంలో ఉంటే కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు. అలా చదకుండా అస్సలే ఉండకూడదు. సరస్వతీ దేవి మన వద్ద ఉంటేనే లక్ష్మీదేవి వస్తుంది. అంతేకాదు శభయోగాలు, శుభ గ్రహాలు కూడా మీ జాతకంలోకి వస్తాయి. సత్ఫలితంగా మీకు సర్కారు ఉద్యోగం కచ్చితంగా వస్తుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications