Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఇంట్లో దొరికే ఈ మొక్క ఆకులు ముఖానికి రాసుకుంటే, అందంగా తయారవుతారు! మీకు మీరే సాటి
హిందూ సంప్రదాయం ప్రకారం తులసి మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మొక్కను దైవ సంబంధిత కార్యక్రమాలకు వినియోగిస్తుంటారు. ప్రతిరోజూ తులసి మొక్కకు పూజలు నిర్వహిస్తుంటారు. అయితే తులసి మొక్క మత విశ్వాసాలకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి, అందానికి కూడా చాలా ముఖ్యం. తులసి అనేక విధమైన పోషకాలు, ఔషధాలు దాగి ఉన్నాయి. ఇవి మనిషి ఆరోగ్యానికి, మనిషి అందం పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే తులసి అందం పెంచడంలో ఏ విధంగా పని చేస్తాయి? వాటిని ఎలా ఉపయోగించాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తులసి ఆకుల ప్రయోజనాలు
తులసి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్ లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు అనేక చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. తులసి ఆకుల వలన దద్దుర్లు, చర్మంపై మంటలు, క్రిమి కాటు వంటి సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకుల రసాన్ని మొటిమలు ఉన్న ప్రాంతంలో అప్లై చేయడం ద్వారా, ఆ ప్రాంతంలో నొప్పి, వాపు తగ్గుతుంది. తులసి మొక్కలో యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి చర్మాన్ని మరింత ఆరోగ్యంగా, యవ్వనంగా మారుస్తాయి.

తులసి ఆకుల పేస్ట్
తులసి ఆకుల పేస్ట్ ముఖంపై మచ్చలు, డార్క్ సర్కిల్స్ తగ్గించడానికి మంచి ఉపయోగపడతాయి. 8-10 తులసి ఆకులను తీసుకుని, వాటిని బాగా కడగాలి. తర్వాత వాటిని గ్రైండ్ చేసి మెత్తని పేస్ట్ తయారు చేయాలి. ఈ పేస్ట్‌ని ముఖం, మెడ మీద అప్లై చేసి, అరగంట తర్వాత నీటితో కడగాలి. ఈ పేస్ట్‌ని ప్రతిరోజూ వినియోగించడం వల్ల మచ్చలు, చర్మ సమస్యలు తగ్గిపోతాయి.
ఎండిన తులసి ఆకుల పేస్ట్
ఎండిన తులసి ఆకుల పేస్ట్ కూడా ముఖంపై అప్లై చేయడం వలన మంచి ప్రయోజనాలు లభిస్తాయి. తులసి ఆకులను శుభ్రపరచి, ఎండనివ్వాలి. ఎండిన ఆకులను మెత్తగా రుబ్బి, అందులో తేనె కలిపి ముఖంపై అప్లై చేయాలి. 20-25 నిమిషాల తర్వాత, ముఖాన్ని నీటితో కడుక్కోండి. వారానికి 2-3 సార్లు ఈ పేస్ట్‌ను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. తేనె చర్మానికి తేమ అందించి, హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.
తులసి, పెరుగు ప్యాక్
తులసి ఆకులతో తయారుచేసిన పెరుగు ప్యాక్ కూడా చర్మం మీద మచ్చలను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. మొదట, తులసి ఆకులను శుభ్రపరిచి, వాటిని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో 2 చెంచాల పెరుగు కలిపి, ముఖానికి అప్లై చేయాలి. పెరుగులో ఉన్న లాక్టిక్ ఆమ్లం చర్మంపై మచ్చలు తొలగించడంలో సహాయపడుతుంది.
తులసి రసం మరియు బియ్యం పిండి
తులసి ఆకుల రసాన్ని తీసి, బియ్యం పిండితో మిక్స్ చేయండి. ఈ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేసి, 20 నిమిషాల తర్వాత, చర్మాన్ని తేలికగా రుద్దండి. ఈ విధానం చర్మం మీద ఉన్న చనిపోయిన కణాలను తొలగిస్తుంది మరియు ముఖాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. బియ్యం పిండి కూడా మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. వారానికి 2-3 సార్లు ఇలా చేయడం ద్వారా మీరు మంచి ఫలితాలు పొందవచ్చు.



Click it and Unblock the Notifications