Latest Updates
-
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు!
విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినా, విన్నా చాలు.. గ్రహ దోషాల నుంచి సత్వర ఉపశమనం.!
ఈ రోజు శనివారం విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు. ఈ రోజు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి విష్ణు సహస్రనామ పఠనం చేసి ఆధ్యాత్మిక భావనలో ఉంటారు. ఇలా చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా ఎంతో సానుకూల శక్తి, దైవానుగ్రహం లభిస్తుందని ఆధ్యావేత్తలు చెబుతుంటారు. అసలు ఇలా చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి ఇక్కడ చూద్దాం..

విష్ణు సహస్రనామ పఠనం అంటే భగవంతుడి ముందు కూర్చుని 1008 దివ్య నామాలను చదవడం, వినడం మాత్రమే కాదు. ఈ నామాలను భక్తితో జపిస్తే మనస్సు, శరీరం, ఆత్మకు సానుకూల శక్తి అందుతుంది. సానుకూల జీవనశైలి కోసం విష్ణు సహస్రనామ పఠనం ప్రభావవంతమైనదిగా ఉంటుంది. సహస్ర నామార్చనతో ఆధ్యాత్మికంగా, శారీరకంగా మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి.. వేద పండితులు ఏం చెబుతున్నారు చూద్దాం.
విష్ణు సహస్రనామంలోని ప్రతి పేరులో ప్రత్యేకమైన దైవిక శక్తి నిక్షిప్తమై ఉంటుందని ఇతిహాసాలు చెబుతున్నాయి. ఈ నామాలను భక్తిశ్రద్ధలతో పఠించాలని పండితులు సూచిస్తారు. ప్రతికూల ఆలోచనలను తొలగించి మనసును సానుకూల ఆలోచనలతో నింపుతుంది. దైవభక్తిపై మనసు నిమగ్నమై చేసే పనిలో ఆత్మ విశ్వాసం మరింత పెరుగుతుంది. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది.
ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత
నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడి అనేది ప్రధాన సమస్యగా మారింది. దీంతో ఆందోళన పెరిగి, మానసిక అశాంతి కలుగుతోంది. అందుకే రోజూ లేదా వారంలో కొద్ది సమయం ఆధ్యాత్మిక కార్యక్రమంతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా మనసు ప్రశాంతంగా ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ధ్యానంతో సమానంగా ఈ పఠనం మేలు చేస్తుంది. నిద్ర లేమి వంటి సమస్యల బారి నుంచి కాపాడుతుంది.
ప్రతికూల శక్తులు, గ్రహ దోషాలు
విష్ణు సహస్ర నామాన్ని పఠించడం ద్వారా మీ జాతకంలో గ్రహ దోషాల ప్రభావం కూడా తగ్గిపోతుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. సూర్యుని ప్రభావం వల్ల ఏర్పడే అశుభ సంకేతాలను తొలగిస్తుంది. మీలోని ప్రతికూల శక్తిని, నర దృష్టిని, ఆందోళనలను తగ్గిస్తుంది.

శారీరక బాధల నుంచి రిలీఫ్
విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పాటించడం ద్వారా శారీరక, దైవిక, భౌతిక బాధల బారి నుంచి రక్షిస్తుందని వేద పండితులు సూచిస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో మీకు శక్తిని, ధైర్యాన్ని అందిస్తుంది. మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు చికిత్సతో పాటు ధార్మిక పఠనం ద్వారా మీరు మానసిక స్థైర్యం పొందవచ్చు.
మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత భీష్మ పితామహుడు.. యుధిష్ఠరుడికి విష్ణు సహస్రనామం బోధిస్తారు. అందుకే ఈ స్తోత్రానికి ఆధ్యాత్మికంగా అంతటి ప్రాధాన్యత ఉంటుంది. పూజ సమయంలో జపించడం ద్వారా మీ ఆత్మను శుద్ధి అవుతుంది. మీలో ఉన్న అహంకారం నశిస్తుంది. ధైవభక్తి బలపడుతుంది. మోక్షాన్ని పొందే మార్గాన్ని అందిస్తుంది. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనసును కేంద్రీకరించి పఠించాలి. తద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. సహనం, సంయమనం, సానుకూల దృక్పథంతో ఉండగలరు. విద్యార్థులకు ఈ పఠనం ఎంతో మేలు చేస్తుంది.
ఎప్పుడు, ఎలా పఠించాలి?
ప్రతి శనివారం లేదా మీకు వీలైన రోజులో ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన, స్వచ్ఛమైన బట్టలు ధరించాలి. విష్ణుమూర్తి విగ్రహం లేదా పటం ఎదురుగా నెయ్యి లేదంటే నువ్వుల నూనెతో దీపం వెలిగించుకుని పూజ చేసుకోవాలి. భగవంతుడికి ఇష్టమైన నైవేద్యం సమర్పించి, కొబ్బరికాయ కొట్టిన తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనానికి కూర్చోవాలి. ఈ సమయంలో మీ మనస్సు ఆందోళనగా ఉండకూడదు. ఏకాగ్రతతో, విశ్వాసంతో, భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా నామాలను పఠించాలి. మొత్తం చదవలేకపోతే శ్లోకాలను చదవవచ్చు. పఠనంలో నాలుక తిరగకుండా ఇబ్బంది పడుతున్నట్లయితే అంతే ఏకాగ్రతతో వినవచ్చు.



Click it and Unblock the Notifications
