Latest Updates
-
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్..
చేపల కన్నా 10 రెట్లు ఎక్కువ ఒమేగా-3 ఇచ్చే వెజిటేరియన్ ఫుడ్స్ ఇవే!
మానవ శరీరానికి అత్యంత అవసరమైన పోషకాల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ (Omega-3 Fatty Acids) స్థానం చాలా ప్రత్యేకం. మన గుండె ఆరోగ్యంగా కొట్టుకోవాలన్నా, మెదడు చురుగ్గా ఆలోచించాలన్నా, అలాగే శరీరంలో హార్మోన్ల బ్యాలెన్స్ సరిగ్గా ఉండాలన్నా ఒమేగా-3 తప్పనిసరి. అయితే మనలో చాలామందికి ఉండే ఒక పెద్ద అపోహ ఏంటంటే.. ఒమేగా-3 పుష్కలంగా అందాలంటే కచ్చితంగా చేపలు తినాల్సిందేనని, శాకాహారులకు ఇది సరిపడా అందదని నమ్ముతుంటారు.

కాన, వాస్తవానికి మన సాంప్రదాయ భారతీయ శాకాహార వంటగది ఎన్నో ఏళ్లుగా ఇలాంటి అద్భుతమైన ఒమేగా-3 వనరులను మనకు అందిస్తూనే ఉంది. చేపల కన్నా ఒమేగా-3 ఎక్కువగా అందించే శాఖాహార ఫుడ్స్ ను ప్రముఖ పోషకాహార నిపుణురాలు లవ్ నీత్ బాత్రా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఒక పోస్ట్ లో తెలిపారు.
దీని వెనుక ఉన్న సైన్స్ రహస్యం ఏంటి?
మొక్కల ఆధారిత ఆహార పదార్థాలలో ఒమేగా-3 అనేది ALA(ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్) రూపంలో దొరుకుతుంది. అదే చేపలలో అయితే EPA, DHA రూపంలో ఉంటుంది. ఇక్కడే మన శరీరం చేసే మాయాజాలం దాగి ఉంది. మన శరీరం చాలా తెలివైనది. మీరు మొక్కల ద్వారా ALAను అందిస్తే, దానిని మన శరీరానికి అవసరమైన EPA, DHA లుగా సులభంగా మార్చుకునే అద్భుతమైన సామర్థ్యం దానికి ఉంది. కాబట్టి, ప్రతిరోజూ ఈ మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకుంటే చాలు, మీ శరీరానికి కావాల్సిన ముడి పదార్థాలు పుష్కలంగా అందుతాయి.
చేపల కంటే మెరుగైన 7 శాకాహార సూపర్ ఫుడ్స్ ఇవే
సాధారణంగా 100 గ్రాముల చేపల్లో కేవలం 2.2 గ్రాముల ఒమేగా-3 మాత్రమే ఉంటుంది. కానీ మన శాకాహార ఫుడ్స్ లో ఇది ఎంత మోతాదులో ఉందో ఇక్కడ చూడండి.
అవిసె గింజలు: 22.8 గ్రాములు (చేపల కంటే పది రెట్లు ఎక్కువ!)
చియా సీడ్స్ : 17.8 గ్రాములు
వాల్ నట్స్: 9.1 గ్రాములు
హెంప్ సీడ్స్: 8.7 గ్రాములు
ఆవాలు, ఆవ నూనె: 5.9 గ్రాములు
ఎండిన మునగాకు పొడి : 1.1 గ్రాములు
మెంతులు: 0.8 గ్రాములు
వీటిని ఎలా తినాలి
అవిసె గింజలు: వీటిని నేరుగా తినకూడదు. ముందుగా దోరగా వేయించి పొడి చేసుకోవాలి. ఆ పొడిని మీరు రోజూ తినే చపాతీ పిండిలో, పెరుగులో లేదా ఉదయం తాగే జ్యూస్ లలో ఒక స్పూన్ కలుపుకుని తినవచ్చు. ఈ పొడి పాడవకుండా ఉండాలంటే కచ్చితంగా ఫ్రిజ్ లో నిల్వ చేసుకోండి.
చియా సీడ్స్: ఒక టేబుల్ స్పూన్ చియా గింజలను రాత్రంతా ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి. ఉదయం నిద్రలేవగానే ఆ నీటిని తాగండి. లేదా వాటిని నిమ్మకాయ నీళ్లు,పెరుగు, కొబ్బరి పాలు లేదా పుడ్డింగ్ వంటి వాటిలో కలుపుకుని కూడా ఆస్వాదించవచ్చు.
వాల్ నట్స్: ప్రతిరోజూ కనీసం రెండు వాల్ నట్స్ ను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం తినండి. వీటిని రాగి జావలో కలుపుకుని లేదా రెండు ఖర్జూరాలతో పాటు కలిపి తీసుకుంటే రుచితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం.
హెంప్ సీడ్స్: రోజూ రెండు టేబుల్ స్పూన్ల హెంప్ సీడ్స్‌ను మీరు తినే సలాడ్స్ పైన, ఉదయం తాగే పండ్ల రసాలలో లేదా ఒక కప్పు పెరుగులో పైన చల్లుకుని తినండి.
ఆవాలు, ఆవ నూనె: ప్రతిరోజూ మీరు చేసే వంటల తాలింపులో ఆవాలను తప్పనిసరిగా వాడండి. అలాగే పరాఠాలు లేదా ఇతర వంటకాల కోసం గానుగ ఆవ నూనెను వాడటం అలవాటు చేసుకోండి.
మునగాకు పొడి: ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఎండిన మునగాకు పొడిని కలుపుకుని టీ లాగా తాగండి. లేదా మీరు రోజూ వండుకునే పప్పు, కూరల్లో తాజా మునగాకును జోడించండి.
మెంతులు: వీటిని రాత్రి నానబెట్టి ఆ నీటిని ఉదయం తాగవచ్చు లేదా వంటల తాలింపులో విరివిగా వాడవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
