Latest Updates
-
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.!
‘మందు బాబులూ’, మరో గజనీలవుతారు జాగ్రత్త..?

అతిగా మద్యాన్ని సేవించే వ్యక్తులకు జ్ఞాపక శక్తి తగ్గిపోతుందట. తరచూ మద్యం తాగేవారి మెదడులోని కణాలు స్టిరాయిడ్లను విడుదల చేస్తూ జ్ఞాపక శక్తిని హరింపజేస్తాయని అధ్యయనకర్తల బృందం వెల్లడించింది. తాగుబోతుల పై నిర్వహించిన ఈ పరిశోధనకు సంబంధించి జర్నల్ ఆఫ్ న్యూరోసైన్సెస్ ఓ కధనాన్ని వెలువరించింది.
వాషింగ్టన్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ మెడిసిస్ విభాగానికి చెందిన శాస్రవేత్త ఛార్లెస్ జోరుమ్స్కీ నేతృత్వంలోని నిపుణుల బృందం తమ పరిశోధనలో భాగంగా ఈ కొత్త విషయాలను ఆవిష్కరించింది.
అధిక మోతాదులో ఆల్కహాల్‌ను సేవించటం వల్ల మెదడు కణాలకు ఎటువంటి ముప్పు కలగలేదని, అయితే జ్ఞాపకశక్తిని హరింపజేసే స్టిరియిడ్లను కణాలు విడుదల చేయ్యటం తము గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ క్రమంలో మెదడు కణాల నుంచి వెలువడే స్టిరాయిడ్లను బ్లాక్ చేయ్యటంతో, మెదడు కణాలు సాధారణ స్థితిలో సమాచారాన్ని అందిపుచ్చుకుంటున్నాయని వీరు తెలిపారు.



Click it and Unblock the Notifications
