Latest Updates
-
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. !
కడుపులో మంట... యాసిడిటినీ దూరం చేయండిలా...!

1. భోజనం చేసిన వెంటనే ఉసిరికాయంత బెల్లం ముక్క బుగ్గన పెట్టుకొని చప్పరించడండి, బెల్లం ముక్క యాసిడిటిని దూరం చేస్తుంది.
2. రోజు మొత్తం మీద వీలున్న సమయంలో గ్లాసుడు నీటిలో చిటికెడు వంటసోడా వేసుకొని తాగితే మంచిది.
3. ఇంట్లో సాధారణంగా వంటల్లో ఉపయోగించే యాలకులు, లవంగాలు మౌత్ ఫ్రెషనర్ గానే కాకుండా కడుపులో మంటని చల్లార్చేందుకు దోహదపడతాయి. భోజనం చేయగానే ఈ రెండింటిని కలిపి లేదా విడివిడిగా బుగ్గన పెట్టుకోవాలి. నోటి దుర్వాసనను కూడా ఇది దూరం చేస్తుంది.
4. కొద్దిగా జీలకర్ర తీసుకొని నీటిలో మరిగించి ఆ నీటిని రోజుకి మూడు నాలుగుసార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి నీళ్లు రోజుకి మూడు నాలుగు సార్లు తాగితే కడుపులో చల్లగా ఉంటుంది.
5. చెంచా అల్లం రసంలో అరటీస్పూన్ తేనె, చిటికెడు పసుపు కలిపి రోజుకి మూడు సార్లు తాగితే యాసిడిటి నుంచి విముక్తి లభిస్తుంది.
6. అరగ్లాసు పాలలో చిటికెడు పసుపు వేసి మరిగించి దానికి కొద్దిగా పంచదార కలిపి తీసుకోవాలి.
7. బబుల్ గమ్ యాసిడిటికి మంచి మందుగా పనిచేస్తుంది. అప్పుడప్పుడు బబుల్ గమ్ నములుతుంటే కడుపులో మంట దరిచేరదు.
8. నిమ్మకాయను ప్రతి రోజూ ఆహారంలో చేరుస్తూ వుండడం వలన కూడా యాసిడిటిని తగ్గించుకోవచ్చు.
9. నూనె, పంచదారత పాటు ఐయోడైజ్డ్ ఉప్పును ఆహారంలో బాగా తగ్గించాలి.
10. మాంసాహాన్ని, మసాలాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని తీసుకోవాల్సిన వస్తే పెద్ద గిన్నె నిండా సూప్ తాగిన తర్వాతే మాంసాహారాన్ని తినాలి.
11. పళ్లరసాలు, తాజా కూరగాలతోపాటు కూరగాయలను నుంచి తీసిన జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవాలి.
12. ఆకు కూరలను రోజు విడిచి రోజూ భోజనంలో చేర్చడం మరిచిపోకండి
13. టైమ్ టు టైమ్ భోజనం చేయడం. ఏ పరిస్థితుల్లోనైనా సమయం దాటిపోతే తేలికపాటి ఆహారం తీసుకోవాలి. కాని కడుపునిండా తినకూడదు.
14. భోజనం ఏవి తీసుకుంటే కడుపులో మంట వస్తున్నదో గమనించి వాటికి దూరంగా వుండండి.
15. యాసిడిటికి మరో ముఖ్యమైన కారణం ఎక్కువ ఫ్రైడ్ రైస్, జక్ ఫుడ్ తీసుకోవడం, కారం ఎక్కువగా తినడం, ఎదైనా తినేటప్పుడు ఎక్కువ నముల కుండా అలాగే మింగేయడం, మోతాదుకు మించి తినడం, ఎక్కువగా నిద్రించడం, ఒత్తిడి, స్మోకింగి, ఆల్కాహాల్ డ్రికింగ్ వంటి వాటివల్ల యాసిడిటి వస్తుంది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని చక్కటి శరీర ఆరోగ్యానికి జాగ్రత్తలు తీసుకోవాలి.



Click it and Unblock the Notifications
